సాంస్కృతిక పండుగ లోహ్రి
భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా అసమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. ఈ పండగలను చేసుకొనే విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం, పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి.వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా …