సకల సంతోషాల సంక్రాంతి
తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సరకాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒక రాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళశాస్త్రం చెబుతోంది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు ఆంగ్ల సంవత్సరం జనవరి వచ్చేసరికి ధనూ రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఇది పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మనకున్న రెండు అయనాల్లో సూర్యుడు దక్షిణాయన కాలం ముగించుకొని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే …