సత్ఫలితాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయాలు
కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం మొత్తం మార్చి 16 నుండి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించి విద్యార్థులు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. తక్షణమే మార్చి 22 నుండి లాక్డౌన్ అమలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు అందు బాటులో ఉండేలా ప్రయత్నించారు. రేషన్ కార్డ్ కలిగిన ఒక్కో కుటుంబానికి …