2021

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍

భూమి లభ్యత పరిమితం. భూమి ఉపరితలంపై భూమి లభ్యత కేవలం 20 శాతమే.1.ఏ నగర అభివృద్ధికైనా భూమి అనేది ప్రాథమిక వనరు. ఇది రెండు ప్రధాన లక్షణాలను కలిగిఉంటుంది. (1) ఒక నిర్దిష్ట సమయం వద్ద భూమి లభ్యత పరిమితం గానే ఉంటుంది. (2) అది ఒక దానితో ఒకటి పోటీపడే అనేక ఉపయోగాలను కలిగి ఉంటుంది. నీరు లేదా శక్తి తరహాలో అది చలనశీలత ఉండేది కాదు. ఒక చోట ఉన్న స్థలాన్ని మరో చోటుకు …

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍ Read More »

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!

గతానికి కన్నా వర్తమానంలో మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఆశకు సృజన, ఆసక్తి, పట్టుదల, సడలని దృఢసంకల్పం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈరకమైన ఆలోచనలే మానవుడిని మహోన్నతుడిని చేశాయి. మొదట్లో ఒకచోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి కాలినడకను ఆశ్రయించిన నాటి మానవుడు, తదనంతర కాలంలో ‘‘చక్రం’’ కనుక్కోవడం, మానవ నాగరికతలోనే ఒక విప్లవాత్మక పరిణామంగా అభివర్ణించవచ్చు. చక్రాల సహాయంతో ఎద్దుల బండ్లను తయారుచేసుకొని, గతంతో పోలిస్తే సులువుగా తన ప్రయాణ అవసరాలు తీర్చుకున్నారు అప్పటి తొలితరం …

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!! Read More »

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం?

సూర్యమండలంలో కేంద్రమైన భానుడికి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం శుక్రుడు. చంద్రుడి తరువాత శుకగ్రహం కూడా రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగులు పంచగలుగుతుంది. సూర్యుడి చుట్టు ఒకసారి తిరగడానికి శుకగ్రహానికి 224.7 రోజులు పడుతుంది. ఆకారం, ద్రవ్యరాశి, సూర్యుడి నుండి దూరం మరియు సంఘటనలలో శుకగ్రహం మరియు భూగ్రహం ఒకేలా ఉన్నందున శుక్రుడిని భూమి ‘సోదర గ్రహం (సిస్టర్‍ ప్లానెట్‍)’ అంటారు. భూగ్రహం కోట్ల జీవులకు నెలవుగా ఉంది. శుకగ్రహంపై కూడా జీవుల ఉనికి ఉందనే ఆధారాలను 14 సెప్టెంబర్‍ 2020 రోజున అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల …

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం? Read More »

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం

భారతదేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక, సాంస్కృతిక విలువలు కలిగిన దేశం కాదు. భిన్నభాషా సంస్కృతులు, భిన్నమైన ఆలోచనా ధారలు వికసిల్లిన విశాల దేశం. భిన్నత్వమే ఈ దేశం ప్రత్యేకత. భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన సాంస్కృతిక ధార ఈ దేశానిది. అందులోనే సహజీవన సంస్కృతి వెల్లి విరిసింది. ఈ సహజీవన సంస్కృతి ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. భారత దేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక సాంస్కృతిక సమాజంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ దిశగా చరిత్రను పునర్లిఖించే ప్రయత్నం …

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం Read More »

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍

చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్‍, కామిక్‍ స్ట్రిప్‍ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు దృశ్యరూపం వీటిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కళ దేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండింది. ఎక్కడికక్కడ ఈ …

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ Read More »

ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్‍ బాధ్యతలు చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రే స్వయంగా భక్తిపరుడు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి తెలిపారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొదలు పెడతారన్నారు. సమైక్య రాష్ట్రంలో దేవాదాయ శాఖ అంటే కొన్ని పేర్లు మాత్రమే వినబడేవి. తిరుపతి కలిగియు దైవం వెంకటేశ్వర్లస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ ఇలా కొన్ని పేర్లు మాత్రమే భక్తుల నోట వినిపించేవి. …

ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి Read More »

కొంచెం ప్రయత్నిస్తే సాకారమయ్యే స్వప్నం ఒకటుంది సుస్థిరత, UN SDGs

ఇది నా కల. ఆకుపచ్చ కల. నడిచే దారంతా వృక్షాలు, పూల మొక్కలు ఉండాలని. చాలా చిన్న కల. మీకు కొంచెం ఇస్తున్నాను. మీకు నచ్చుతుంది నా కల. ఎందుకంటే నా కల, మీ కల ఒకటే కాబట్టి.కాస్త మెరుగైన జీవితం కోసం రంగుల కలలు కందాం. ప్రయత్నించి సాకారం చేసుకుందాం. అది 2000 సంవత్సరం. న్యూ మిలీనియం. ప్రపంచీకరణకు దారులు తెరిచిన సమయం. Local is global, Global is local నినినాదం మారుమోగుతున్న కాలం, …

కొంచెం ప్రయత్నిస్తే సాకారమయ్యే స్వప్నం ఒకటుంది సుస్థిరత, UN SDGs Read More »

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో భౌతిక గణిత శాస్త్రాలు

ఠక్కున పవర్‍ సప్లై పోతే, టార్చిలైటు దొరకవచ్చు కానీ – అగ్గిపుల్ల దొరక్క పోవచ్చు. ఇందులో ఆశ్చర్యం లేదు. అనూహ్యమైన రీతిలో శాస్త్ర విభాగం పరిఢవిల్లి, కొంగ్రొత్త ఆవిష్కరణలు వరసగా వచ్చిపడితే గతం పాతబడిపోతుంది. ఇటీవల కాలంలో ఈ శతాబ్దపు సైన్సు ప్రగతి పేరున పలురకాల విశ్లేషణలు వచ్చి వుండవచ్చు. అయితే నేటి సైన్స్ టార్చిలైటు వెనుక అగ్గిపుల్ల లాంటి 18, 19 శతాబ్దాల సైన్స్ పురోగతిని ఒక్కసారి పరామర్శిస్తే అది చెట్టుకు మూలమైన విత్తు గురించి …

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో భౌతిక గణిత శాస్త్రాలు Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!

ఓ నిజాన్ని గుర్తించడానికి, గుర్తించిన దాన్ని సిద్ధాంతీక రించడానికి, ఆ సిద్దాంతాన్ని ప్రయోగ పూర్వకంగా నిరూపించడానికి, నిరూపించిన దానికి సామాజిక ప్రయోజనం చేకూర్చడానికి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక తత్వవేత్తలు జీవితాల్నే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వెంటాడుతుంటే చుట్టూ వుండే సమాజం పిచ్చివారిగా ముద్రవేస్తుంది. నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, సమస్యకు దొరకని గమనం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారు తాయి. ఇలా ఎంతోమంది శాస్త్రజ్ఞులు సామాజిక వికాసానికై, అభివృద్ధికై …

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!! Read More »

బాసరలో జైనబసదులు, శివాలయాలు, సతిశిలలు, శాసనాలు:

బాసర ప్రస్తుతం నిర్మల్‍ జిల్లా(ఒకప్పుడు ఆదిలాబాద్‍ జిల్లా)లో వుంది. బాసర నిజానికి ఒక ఊరు కాదు. ఐదు గ్రామాల సముదాయం. 1. బాసర, 2. రేణుకాపురం, 3. మహదాపురం, 4. రత్నాపురం, 5. మయిలాపురం. ప్రస్తుతం బాసర, మయిలాపురం మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఊర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. బాసరలో జ్ఞానసరస్వతిని వ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పబడుతున్నది. కాని, ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన కరికాళచోళ రాజైన రెండవ బిజ్జలదేవుడే ఇక్కడ ఆలయాలను నిర్మించినాడని చరిత్రకారులు అభిప్రాయం. తాను జైనుడు. అతని బావ …

బాసరలో జైనబసదులు, శివాలయాలు, సతిశిలలు, శాసనాలు: Read More »