2022

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!! అంటార్కిటికా అంతరించిపోతే!!??

(గత సంచిక తరువాయి)గత రెండు కథనాలలో అంటార్కిటికాకు సంబంధించిన చాలా విషయాల్ని తెలుసుకున్నాం. అంటార్కిటికాపై జరిగిన ప్రయోగాలన్నీ గతంలో కన్నా అంటార్కిటికా వేడి ప్రాంతంగా మారుతుందన్నట్లుగా గణాంకాల్ని అందించాయి. గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రతీ దశాబ్దానికి ఉష్ణోగ్రత ఈ కింది విధంగా పెరుగుతున్నట్లుగా తేల్చారు. అలాగే గత అయిదు సంవత్సరాల నుండి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నట్లుగా శాస్త్రజ్ఞులు, పరిశోధకులు గుర్తించారు. అవి వరుసగా 24 మార్చి 2015 17.5°C6 ఫిబ్రవరి 2020 18.3°C13 ఫిబ్రవరి …

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!! అంటార్కిటికా అంతరించిపోతే!!?? Read More »

సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!

జాతీయ మట్టి సర్వే-భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్‍.బి.ఎస్‍.ఎస్‍-ఎల్‍.యు.పి.) నిపుణులు డా. వి. రామమూర్తి ఇంటర్నెట్‍లో అందించిన వివరాలు. తెలుగు రాష్ట్రాల్లో పంట భూముల గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్‍ వి. రామమూర్తి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఏర్పాటైన ‘జాతీయ మట్టి సర్వే-భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్‍.బి.ఎస్‍.ఎస్‍-ఎల్‍.యు.పి.)’ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆయన సేవలందిస్తున్నారు. స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను …

సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం! Read More »

అభినందనలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘హైదరాబాద్‍ బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త డా।। సిరి గారి విశ్లేషణ.కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి …

అభినందనలు Read More »

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం

అనేక సామాజిక రుగ్మతలకు మూలం నిరక్షరాస్యత.ఈ నిరక్షరాస్యతకు మూలం సామాజిక అసమానతలు. విద్య, వైద్య విధానాల రూప కల్పన, ఆచరణ ఆయా సామాజికాభివృద్ధికి కారణమవుతాయి. నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందాలన్న సదాశయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కెజీ టూ పీజీ ఉచిత విద్యకు అంకిత భావంతో అంకురార్పణ చేసింది. గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, దళిత బహుజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను, స్థానిక, ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా …

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం Read More »

సిరిప్రెగడ భార్గవరావు

‘‘పల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా పల్లవముల్‍ గ్రసించు చిరుపాటలదియాని తేనెతేటలు జిల్లు పికంబు మా యనుగుచెల్లెలు గానమె మాదు ప్రాణమౌ’’.అని కంఠమెత్తి పాడిన కవికోకిల సిరిప్రెగడ భార్గవరావు.ఎక్కడో నల్లగొండ జిల్లాలోని చండూరు సమీపముగల చిరుపల్లె గూడెపల్లిలో సిరిప్రెగడ జన్మించారు. ఆయన జనన తేది కూడా సాహితీలోకానికి తెలియదు. చాలా పిన్న వయస్సులోనే 1963లో ఆయన అస్తమించారు.1934లో గుంటూరు జిల్లా ‘ఏదుబాడు’ నుండి …

సిరిప్రెగడ భార్గవరావు Read More »

మనం మరచిన సంస్థాన మహిళలు

హైదరాబాద్‍ రాజ్యమే ఎనుకటి ఇండియాలో పెద్ద సంస్థానం. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చిన్న, పెద్ద సంస్థానాలు పరిపాలన సాగించేవి. ఈ సంస్థానాధీశులతో చాలా మందికి దగ్గరి సంబంధాలుండేవి. దోమకొండ సంస్థానానికి అమరచింత సంస్థానాధీశులతో, గద్వాల సంస్థాన పాలకులకు మెదక్‍ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి, జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధీశులకి వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి పాలకులతో, వనపర్తి సంస్థానం వారికి మునగాల పాలకులతో సంబంధ బాంధవ్యాలుండేవి. ఇవన్నీ ఆ పరిపాలన సజావుగా జరగడానికి, వారి రాజరికాన్ని, అధికారాన్ని నిలుపుకోడానికి …

మనం మరచిన సంస్థాన మహిళలు Read More »

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’

ప్రేమకోసం తాజ్‍మహల్‍ వెలిసింది. ఒక ప్రియుడు, తన ప్రియురాలికి ఇచ్చిన ప్రేమ కానుకగా హైద్రాబాద్‍ నగరం అవతరించింది.అసలు హైద్రాబాదే ఒక ప్రేమనగరం. కొడుకు మీద ప్రేమతో ఒక ముసలి తండ్రి నిర్మించిన వంతెన పూరానాపూల్‍. తన ముస్లిం భార్య మీద ప్రేమతో ఒక ఆంగ్లేయుడు కట్టించిన భవనమే కోఠిలోని రెసిడెన్సీ. ప్రస్తుతం ఇది ఉమెన్స్ కాలేజీగా చెలామణి అవుతుంది. ఒక ముస్లిం ప్రేమికుడు తన ఫార్సీ భార్యకోసం కట్టించిన మహల్‍ ‘‘వికార్‍ మంజిల్‍’’. అతను ఎవరో కాదు …

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

(గత సంచిక తరువాయి) సోషల్‍ ఎకాలజీముర్రేబుక్‍చిన్‍ అనే సామాజిక సిద్ధాంతకర్త సాగించిన ఆలోచనధారను ‘సోషల్‍ ఎకాలజీ’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపై చిలుకుగా ఈయన సామాజిక ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం మధ్యగల సంబంధాలను గురించి సాగించిన రచనల సారాంశం సోషల్‍ ఎకాలజీగా గుర్తింపు పొందింది.ఈయన సాగించిన చింతనకు మూలాలు భిన్న రకాలైన తాత్త్విక సంప్రదాయాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మార్క్సీయ సామ్యవాదం, ఉదార అరాచకవాదం, పాశ్చాత్య జీవవాదాలలో దర్శనమిస్తాయి. అదే విధంగా అరిస్టాటిల్‍, హెగెల్‍ వంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రభావం …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

ఉజ్జలికోట శాసనం (క్రీ.శ.966 & క్రీ.శ.1097)

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-18అనేక ప్రత్యేకతలు గల ఇద్దరు రాజుల ఉజ్జిలి, మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లా, మక్తల్‍ తాలూకాలోని ఒక ప్రాచీన కోట. కళ్యాణ చాళుక్యుల కాలంలో ఒక రాజధాని. ఉజ్జిలి ఇపుడొక చిన్న గ్రామమైనా, క్రీ.శ.10-12 శతాబ్దాల్లో ఒక పాలనా కేంద్రంగా వెలుగొందిన నగరం. ఆ గ్రామంలోని ఒక బావి దగ్గర అనేక ప్రత్యేకతలున్న ఒక కన్నడ శాసనముంది. 131 సం।।ల తేడాతో ఒకేరాతిపై గల క్రీ.శ.966 నాటి మొదటి శాసనాన్ని మహామండలేశ్వర శ్రీ వల్లభచోళ …

ఉజ్జలికోట శాసనం (క్రీ.శ.966 & క్రీ.శ.1097) Read More »

ఆకాశంలో తెగిపడే చుక్కలు

నిజానికి ఉల్కలు అనేవి ఆస్టరాయిడ్‍ బెల్ట్ నుంచి వచ్చేవి. సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల నడుమ ‘గ్రహశకలాల సమూహం’ (Asteroids Belt) ఎల్లప్పుడు ఒక కక్ష్యలో తిరుగు తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రహశకలాలు ఆ గుంపు నుంచి వెలువడి అత్యంతవేగంతో భూమి వాతావరణంలోనికి ప్రవేశించినపుడు వాటిలో ఎక్కువభాగం మండిపోతాయి. కొన్ని మాత్రమే అరుదుగా భూమిమీద రాలిపడుతుంటాయి. దాన్నే ఉల్కాపాతం అంటారు. రాలిపడ్డ పదార్థాలు ఉల్కలు. గ్రహాంతర పదార్థశకలాలు(Celestial Bodies) . భూమి అక్షంలో వక్రత, భూమండలం మీద వాటి …

ఆకాశంలో తెగిపడే చుక్కలు Read More »