సామరస్య పర్యావరణం – అభివృద్ధి – పరిరక్షణ
అభివృద్ధి, పరిరక్షణలనేవి పర్యావరణ చింతనలో తరచుగా ప్రస్తావితమవుతూ ఉంటాయి. అభివృద్ధి వాదులు పరిరక్షణ గురించి ఆలోచించరని పర్యావరణ వాదులు పేర్కొంటూ ఉంటారు. పరిరక్షణ వాదులు అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారని అభివృద్ధి వాదులు అభియోగం మోపుతూ ఉంటారు. పర్యావరణ చింతనలో ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైనవిగా, పరస్పరం వ్యతిరేకించుకునేవిగా కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ రెండూ పార్శ్వాలు లేదా పక్షాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఒక సయోధ్యను సాధించవచ్చు. సామరస్య పూర్వకంగా వ్యవహరించవచ్చు. కారణాలు ఏవైనా గానీ అభివృద్ధికి, …