January

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన

చరిత్ర పూర్వ యుగం నాణాలు, శిలాజాల ప్రదర్శన అమోఘం : ప్రిన్సిపాల్‍ ప్రొ. డి.రవీందర్‍ చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగానికి సంబంధించిన ముఖ్య పనిముట్లు, నాణాలు, శిలాజాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ అన్నారు. ఓయూ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన పురాతన రాతి పనిముట్లు, మానవ శిలాజాలు, చారిత్రక యుగంకు సంబంధించిన నాణాలు (కైన్స్) ప్రదర్శన కార్యక్రమాన్ని ఆర్టస్ కళాశాల …

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన Read More »

వాసన

ఒక్కమాట చాలువాసన పసికట్టడానికి.అది అవసరమోఆప్యాయతోఆనందమోఅవ్యాజమోచప్పున స్ఫురిస్తుంది. పరిమళం పువ్వులనుంచే రాకపోవచ్చుఆకాశం నుండి రాలే వాన చినుకులుభూమిని ముద్దుపెట్టుకునేటప్పుడులేచే మృత్తికాసౌరభం కావచ్చు,తోటంతా ఉక్కిరిబిక్కిరౌతూసమిష్టి భావనలు నిండిపోవచ్చుకాని ఇవేవీ కావు. అది రింగ్‍టోనోఎస్‍. ఎం. ఎస్సోవాట్సాపోచివరికి ఈ మెయిలైనా కావచ్చునీటిబొట్టు లా రాలే శబ్దానికిఒక స్మరణ మేల్కోంటుంది. ఏమి రాయకుండానేతెల్లకాగితానికి కలలుంటాయిఅక్షరాలకు ధ్వనులే ఒక వాసన ఎవరిదో పొడ గడపలోంచిలోపలికి అడుగుపెట్టగానేతెలిసిపోయే అపరిచిత సమీరస్పర్శఘ్రాణేంద్రియానికి అందేది కాదుప్రాణ సర్వస్వానికి తెలిసేది కాదు.సమస్త వాసనాధురీణ జగుత్తులోకాస్త కాస్త దేనికోసమో అలమటించిపోతున్నానుబహుశా అదిమనిషి …

వాసన Read More »

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’

ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, తుపుక్‍ మని రోడ్డుమీద ఉమ్మేస్తూ, సన్నగా పొడుగ్గా ఉన్న మేక గడ్డం చిరుగాలితో సయ్యాటలాడుతుంటే, తెల్లటి మస్లీన్‍ లాల్చీ ధరించి, …

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

పర్యావరణ సంక్షోభం – నైతికత 21వ శతాబ్ది ప్రారంభం నుండి మానవాళి మునుపెన్నడూ లేని విధంగా పర్యావరణ విషయంగా అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తున్నది. మానవ చరిత్రలోనే ఇవి Unprecedented గా ఉన్నాయి. ఈ సవాళ్ళన్నీ మానవ కార్యకలాపాల ద్వారా ఉత్పతన్నమైనవే. భూమిపై జీవుల, జీవరాశులు పెద్దయెత్తున అంతరింపులకు గురవుతూ వస్తున్నవి. 65 మిలియన్ల సంవత్సరాల క్రిందట డైనాసార్‍ యుగం అంతరించిన తరువాత ఇంత పెద్దమొత్తంలో జీవజాతులు అంతరించిపోవటం మొదలైంది. కొన్ని అంచనాల ప్రకారం రోజుకి …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

నానీలు

నగరవాసులధమనులుసిరిలల్లోనిర్విరామ జన ప్రవాహం ఒకప్పుడుఅన్నం మెతుకుపై మన పేరుమరి ఇప్పుడోట్యాబ్‍ లెట్లపై భూమాతగుండెల్లో దింపినఇనుప స్ట్రాలుబోరింగ్‍ మిషన్లు కెరటాలుకాళ్ళ కింది ఇసుకనులాగేస్తున్నాయినమ్మక ద్రోహిలా ! రోజూ దసరా పండగేనడక దారిలోపాలపిట్టదర్శనం ! -కంచనపల్లి రవికాంత్‍ఎ : 949012275

ప్రక్షాలన…

చీకటి ముసిరింది మొదలుతూరుపు తెల్లారుదాకా…చెత్తా చెదారం చేరిపిదుమ్ము ధూళి దులిపినల్లటి రోడ్ల ‘‘చంద్రబింబం’’లా మెరిపిస్తారు వంచిన నడుము ఎత్తకవీధుల ‘‘చిత్తడి’’ ఊడ్చికడిగిన ‘‘ముత్య’’మల్లే మార్చుతారు ముక్కు పుటాలు అదిరేమురికి కాల్వ ‘‘కుళ్లును’’ ఎత్తిపోసిపరిశుభ్రత చేకూరుస్తారు కాలలతో నిమిత్తం లేకచలి మంచులో ‘‘నెగళ్లై’’ రగులుతారుజోరు వానలో ‘‘చెమట’’చుక్కలై రాలుతారు లోకమంతా ‘‘కలల’’ నిద్దట్లో మునకేస్తేవాడల ‘‘ఊడిగం’’లో జాగరణమౌతారు రాత్రి వీధి లైట్ల ‘‘వెలుగు’’లో మలిగితే…పగలు ఎండ ‘‘కుంపట్లో’’ కములుతారు గౌరవాలేవి దక్కకున్నా…సగర్వంగా ముందుకు సాగుతారు ఛీత్కారాలెన్నున్నా…పరిశుభ్రత ‘‘పరమ’’ సేవగా …

ప్రక్షాలన… Read More »

రాజేశ్వరపురం శాసనం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామం రాజేశ్వరపురం. ఇక్కడ వీరగోపాలస్వామి దేవాలయంలో నిలబెట్టివున్న 15 అడుగుల ఎత్తు, 3అడుగుల వెడల్పు 6అంగుళాల మందమున్న రాతిబండ (పలక,సలప)మీద రెండువైపులా శాసనం చెక్కివుంది. ఈ శాసనంలో 12మంది వ్యక్తుల పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో మొదటిపేరు కోటకేతన. కోట వంశస్తులు కాకతీయుల సామంతులే కాదు వారి బంధువులు కూడా. వీరి రాజధాని ధరణికోట. పట్టణం పేరే వారి ఇంటిపేరయింది. వీరికి పరబలసాధక, ప్రతాప లంకేశ్వర, కళిగళ మొగడకై, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ …

రాజేశ్వరపురం శాసనం Read More »

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి

తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి తెలంగాణ వివక్షతకు గురైనప్పుడు తెలంగాణ చరిత్రను నిర్భయంగా, నిరంతరంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి కొనియాడారు. ఉన్నదాన్ని ఒప్పుకోక ఘర్షణ పడి చరిత్రను రచించిన వారే చరిత్రకారులని, ఈ కోవలోకే చెందినవారు బి.ఎన్‍.శాస్త్రి అని ఆయన చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, మూసీ సాహిత్య ధార సంయుక్తాధ్వర్యంలో బి.ఎన్‍.శాస్త్రి సాహిత్యం, సమాలోచన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు …

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి Read More »

స్వప్న శైధిల్యం

చూపులు వేలాడుతున్నప్పుడుఅడుగులు తడబడుతున్నవిమరకలంటించుకొని జ్ఞానం పుస్తకాల్లోంచిఎగిరిపోయిందిఆలోచనలు చుక్కల దారుల వెంటనీటి ధారలే కనపడని వింతదారుల విస్తరణ మరింత ఇరుకవుతుందిచీకటి వేళ చీకటినే ముట్టించేకన్ను ఎక్కడో మాయమయ్యిందిచేతుల కింద చురకత్తులు పరిహసించబడిరాలుతున్న పూలకు ఉరేసుకున్నవిఎగురేసుకు పోయిన జెండాలుపొలిమేరలు దాటంగనే వలలైపోయినవిఇప్పుడు చిలుకలకు పలుకులు లేవుఎలుకలు వలలు కొరికేది లేదుచంపుడు పందెం పిల్లల ఆటల్లోనే పురుడుపోసుకుంది దీపం తలాపున నవ్వుతుంటేసంధ్య వేళలు వెక్కిరిస్తున్నవిగాలికి ఉడుకపోస్తుంటేతరగతి గదులు తాళాలతో వేలాడుతున్నవి. – ఒద్దిరాజు ప్రవీణ్‍ కుమార్‍ఎ : 9849082693

తెలంగాణ రైతుకు వైభవం

వ్యవసాయం దండుగ కాదు పండుగ అని, స్వరాష్ట్రం వస్తే రైతులకు అన్ని విధాల లాభం జరుగుతుందని మన ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‍ రావు చెప్పిన మాటలు ఇప్పటికే కార్యాచరణలోకి వచ్చేసాయి. రైతు బంధు, రైతు భీమా మొదలైన వాటితో పాటు తెలంగాణ భూములకు అనుకూలమైన అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడానికి రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఆయిల్‍ పామ్‍ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఒక టన్ను పామాయిల్‍ ఉత్పత్తి చెయ్యాలంటే …

తెలంగాణ రైతుకు వైభవం Read More »