చంద్రవదనకో చందన తాంబూలం ‘అధికమెట్టు’
మాహ్ లఖా బాయి జననమే ఒక వింత కత. ఆమె తల్లి ఆరు నెలల గర్భవతిగా మౌలాలీ దర్గా సందర్శనానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. అప్పుడు ఆమె భర్త పరిగెత్తి దర్గా దగ్గరికి వెళ్లి మొక్కుకుని ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయి నెలలు నిండిన తర్వాత ఆడపిల్లను కనింది. ‘‘చాంద్ కా తుక్‍డా’’ లా ఉందని చాంద్ బీబీ పేరు పెట్టారు.అట్లాంటి ఆ చంద్రవదన రెండు …