నలభై వసంతాల మాభూమి
1950లలో భారతదేశంలో నవ్య సినిమా ప్రారంభమై దాని ప్రభావం క్రమంగా మరాఠి, ఒరియా, అస్సామి రంగాలకు పాకినా దక్షిణాదిని తాకింది 1970 ప్రారంభంలో. అదీ మలయాళ రంగాన్ని. అప్పటికే రామూ కారియత్ వంటివారు ‘నీలక్కుయిల్’ (1954), ‘చెమ్మీన్’ (65), పి.రాందాస్ ‘న్యూస్‍పేపర్ బాయ్’ (1954) వంటి ఆలోచనాత్మక చిత్రాలు మలయాళంలో వచ్చినవి. అయితే ఆదూర్ గోపాల కృష్ణన్ మలయాళ చిత్రరంగ ప్రవేశం మలయాళ సినిమా రంగాన్ని మహత్తరమైన మలుపు తిప్పింది. వీటన్నింటి ప్రభావం మద్రాసును తాకలేదు కానీ హైదరాబాదును తాకి. అది సికిందరాబాదు ఆల్వాల్‍లో పుట్టి పెరిగిన ‘శ్యాం …