బి.భానుప్రకాష్
బొల్లంపల్లి భానుప్రకాష్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ నటులు, దర్శకులు. 1950 నుండి 2009 వరకు తెలుగు రంగస్థలాన్ని ఏలిన కళాకారుల్లో భానుప్రకాష్ ఒకరు. 50 సంవత్సరాలకు పైగా రంగస్థలం మీద తన ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని అలరించిన నటరాజమూర్తి భానుప్రకాష్. వెయ్యికి పైగా నాటకాల్లో నటించి, వందకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించి తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన తెలంగాణ బిడ్డ. 1939 ఏప్రిల్ 21న నల్లగొండ పట్టణంలో కీ.శే. అండాళమ్మ వేంకటిహరి దంపతులకు …