నిరపరాధి భావన
రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. వాళ్ళ అధికారానికి ఎలాంటి పరిమితులు లేవు. వాళ్ళకు తోచింది చేసే అవకాశం వుండేది. అనుమానం మీద, నేరారోపణల మీద శిక్షలు విధించేవాళ్ళు. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండా పోయింది. నిరంకుశత్వం పెరిగిపోయేది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215వ సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా, ఒక వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్ష్యాలు లేకుండా ఏ అధికారి …