అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)
హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. విష్ణుకుండికాలపు ఈ శాసనంలో, తులచు – (తొలచు, తొలిచే) వాన్ఱు – (వారు, వాళ్లు) అంటే తొలచేవాళ్లని, రాతిని తొలిచే శిల్పులు (వడ్డర్లు కూడా …









