తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ
తెలంగాణా సంస్కృతిలో జానపద కళలు అంతర్భాగం. విభిన్న పక్రియలతో అనాదిగా తమకు సంక్రమించిన సాహిత్యం, ప్రదర్శనా నైపుణ్యంతో సమాజంలో మనుగడ సాగిస్తున్నవి. వైవిధ్యమైన ఈ మట్టి కళలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నవి. జానపద కళలు ఆశ్రిత, ఆశ్రితేతర కళారూపాలుగా విభజింపబడ్డాయి. నేటి ఆధునిక కాలంలో కూడా తమ మూల సంస్కృతిని పరిరక్షించుకుంటూ మార్పులకనుగుణంగా తమ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఆశ్రిత కళారూపాలు కేవలం ఒక ప్రత్యేక కులాన్ని మాత్రమే ఆశ్రయించి, కళా ప్రదర్శనల …









