వెలిగేచీకటి
చేతికున్న వాచీలో టైం చూసుకొని వెహికిల్ స్పీడ్ పెంచాను. ఎంత స్పీడు పెంచితే మాత్రం ఏం లాభం… ముందర సిగ్నల్ దగ్గర అయిదునిమిషాలైన ఆగక తప్పదు. ఇలాంటి ఇంకో నాలుగైదు సిగ్నల్స్ దాటుకుంటే గానీ ఆఫీసుకి చేరుకోలేను. ప్చ్… ఎంత తొందరగా ఇంట్లోంచి బయటపడినా ఈ రోడ్లమీద ట్రాఫిక్ని తప్పించుకొని ఆఫీసుకు చేరుకునేసరికి ప్రతిరోజూ ఆలస్యమే. భగవంతుడా! అసలీ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి పరిష్కారమే లేదా? ఎం.ఎం.టి.ఎస్.లూ, మెట్రో రైల్… ఎన్నైనా సరిపోనంతగా రోజురోజుకీ పెరుగుతున్న జనం, …









