మదర్స్ డే – అమ్మల దినం
గిరి గాడొక్కడే చెత్త కుండీ నానుకొని గుడ్డె పొడుచుకొని కూలబడిండు. వానికెడమ వైపున రెండు గున్న పందులు తోక లూపుకుంటు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నై. కుడి వైపున ఒక బక్క కుక్క ముందలి కాళ్ళు చాపి ఒక దానిపై ఒకటి వేసుకొని గదుమ నానించి ఈ ప్రపంచ చింత తనకేమి పట్టనట్లు చూస్తూ పండింది.ఇంతలో ఒకవ్వ అక్కడికి చెత్త బకిటు తీసుకొని వచ్చి కుండీలో కుమ్మరించింది. దాన్నట్లా కుమ్మరించగానే పంది గున్నలు రెండు నేనంటే …









