బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి
వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం ఒక విశిష్ట చారిత్రిక గ్రామం. బుద్ధారం పేరులోనే వేల ఏండ్ల చరిత్ర దాగి ఉన్నది. పాత పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ (పుట 35)లో “బుద్ధాపురం … బుద్ధారెడ్డి పేర కట్టించినదే” అని రాయగా, కపిలవాయి లింగమూర్తి తన ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ (పుట 193)లో “గోన గణపిరెడ్డి తమ తండ్రి గారి పేర… స్ధాపించిన గ్రామానికి బుద్ధవరమని …









