deccanland

కేరళ రైతు శాస్త్రవేత్తఅద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’

కేరళలోని వయనాడ్‍ జిల్లా అంబలవాయల్‍కు చెందిన అజి థామస్‍ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్‍’ (pelleting technique) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి …

కేరళ రైతు శాస్త్రవేత్తఅద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’ Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: ఎక్స్కర్షన్‍ కోసం వచ్చిన స్కూల్‍ పిల్లలంతా విడిదిలో అవ్వ చెప్పినా వినకుండా అశుభ్రం చేస్తుంటే… వారికి స్వచ్ఛత గురించి అవగాహన కలిగించటానికి హోమ్‍ థియేటర్‍ ఓపెన్‍ చేయాలనుకుంటుంది అవ్వ.)‘‘పిల్లలూ.. ఈ రోజు మీరు టిఫిన్‍ తిన్నాక.. బయటకు వెళ్లక ముందు మీకు మంచి సినిమాలు చూపించనా’’ పిల్లల వైపు చూస్తూ అడిగింది అవ్వ.పిల్లలు సంతోషంగా ‘‘చూస్తామని’’.. తలలూపారు.‘‘పూటకూళ్ళవ్వ విడిది’’లో ఒక పక్కన హోమ్‍ థియేటర్‍ ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. దానికే …

పూటకూళ్ళవ్వ Read More »

ప్రకృతిని ప్రేమిద్దాం!మనల్ని మనం కాపాడుకుందాం?

ప్రకృతి, పర్యావరణం – ఈ రెండూ విడదీయలేని పదాలు. పర్యావరణం ప్రకృతి సంబంధిత అంశమే గానీ అది సామాజికమైనది కూడా. మానవ సమాజానికి ప్రకృతికి వున్న విడదీయరాని అనుబంధం వల్ల పర్యావరణం సామాజికమైనది. ఎప్పుడైతే సామాజికమైందో అప్పుడు అది రాజకీయ అంశమవుతుంది. సామాజిక అంశాలను నడిపేది, నిర్విహించేది రాజకీయ విధానాలే కనుక పర్యావరణం రాజకీయ అంశమవుతుంది. రాజకీయ విధానాలు ఆయా కాలాలలో వున్న వ్యవస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. ఆయా విధానాలు మానవ జీవితంలోని ప్రతి సూక్ష్మ, …

ప్రకృతిని ప్రేమిద్దాం!మనల్ని మనం కాపాడుకుందాం? Read More »

గోలకొండ కోటలోసర్వాయి పాపన్న స్మారకం నెలకొల్పాలికొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాకు ఆ సర్దార్‍ పేరు పెట్టాలి!

బహుజన వీరుడు సర్దార్‍ సర్వాయి పాపన్న (1650-1709) ఒక సామాన్య గీతకార్మికుడై వుండి స్థానిక భూస్వాములను ఎదుర్కొంటూ మొఘల్‍ పాలకులతో పోరాటం చేసే స్థాయికి ఖిలషాపురం నుండి గోల్కొండ వరకు ఎదగడం చరిత్ర.17వ శతాబ్దిలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొని మరాఠా పాలకుడైన ఛత్రపతి శివాజీ (1627-1680)తో పోల్చుకుంటే, దక్షిణభారత (తెలంగాణా) చరిత్రలో పాపన్నకు ఇప్పటికీ సరియైన గుర్తింపు రాలేదనే చెప్పాలి.1709 లో పాపన్న వీరమరణం తర్వాత దాదాపు వందసంవత్సరాల వరకు అయన త్యాగాలగాథను కాపాడిన ఘనత జానపదులది.1874లో …

గోలకొండ కోటలోసర్వాయి పాపన్న స్మారకం నెలకొల్పాలికొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాకు ఆ సర్దార్‍ పేరు పెట్టాలి! Read More »

‘వజ్ర’మానం

‘‘వజ్రం రత్తీమానేణ మాపయేత్‍’’వజ్ర విలువ నిర్ణయించే నాలుగు ప్రామాణికాలలో (4C) అందరి దృష్టిలో ముందు కనిపించేది, ‘‘క్యారెటేజ్‍’’.వజ్రం విలువ ఎలా నిర్ణయించబడినా మార్కెట్లో ధర మాత్రం క్యారెట్లలోనే ఉంటుంది.మన ప్రాచీన సాహిత్యంలో వజ్రమానం:భారతదేశంలో ఖచ్చితమైన కొలతలు అనాదిగా పాటించి నట్లు ఈ క్రింది శ్లోకం వల్ల తెలుస్తోంది.‘‘న మానేన వినా యుక్తిర్‍ ద్రవ్యాణాం జాయతే క్వచిత్‍.అతహః ప్రయోగ కార్యార్ధం మానమత్రోఛతే మయా’’కొలత లేకుండా ఏ పదార్థాన్నిఉపయోగించడం సాధ్యం కాదు అని అర్థం వచ్చే ఈ శ్లోకం సారంగధరసంహిత …

‘వజ్ర’మానం Read More »

ఆషాఢ బోనం

ఆషాఢం… పేరుకు ఇది శూన్యమాసమైనా ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తిశ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తరువాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల వెనుక ఉన్న అంతరార్థమేంటో తెలుసుకుందాం…బోనం.. అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. శివసత్తుల పూనకాలతో, పోతురాజుల న•త్యాలతో, ఘటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి తరలివచ్చే మహిళలు …

ఆషాఢ బోనం Read More »

‘‘స్వంత కథ’’

ఆదిమధ్యాంతరహిత నక్షత్రమండల విశ్వవీధులలో ఒక సూక్ష్మకాంతిపుంజంగా సంచలిస్తూ, సంచరిస్తూ, పరిభ్రమిస్తూ, పరిక్రమిస్తూ దిఙ్మండలంలో అనేకానేక రూపాంతరాలుగా పరిణామం చెందుతూ, లిప్తకాలం రవంతసేపు విశ్రమించి, సేదతీరటానికి ఈ పుడమిమీద వాలి, ఒక అమ్మగర్భంలో చేరి నవమాసాలు యోగనిద్ర ముద్రాంకితుడనై సుదీర్ఘ నిరీక్షానంతరం ముచికుందా నదీతీరాన 1910లో ఆరవ నిజాం నవాబు మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అను ‘‘మహబూబ్‍ అలీ పాషా’’ నిర్మించిన పెద్ద దవాఖానాలో (ఉస్మానియా హాస్పిటల్‍) 1951వ సంవత్సరం పదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు, నక్షత్రాలలో …

‘‘స్వంత కథ’’ Read More »

పర్యావరణ చరిత్ర – మానవ భావాల, సంస్కృతుల చరిత్ర!

చరిత్ర అనేది మార్పుకు సంబంధించిన ఒక ధారావాహిక గాథ అంటారు. ప్రజలు, తమచుట్టూ ఉన్న ప్రపంచం ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటే, తరం నుంచి తరానికి ఒకే రకమైనదిగా ఉంటే అందులో ఎదుగూ బొదుగూ ఏమీ ఉండదు. ఎటువంటి మార్పూ లేదు కనుక రాయడానికి చరిత్ర అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మానవ సమాజంకు గానీ, ప్రకృతి ప్రపంచానికి గానీ మార్పు అనేది ఒక అనివార్యమైన తప్పించుకోలేని దృగ్విషయం. ఈ మార్పు క్రమంలో ఎన్నో సవాళ్లు …

పర్యావరణ చరిత్ర – మానవ భావాల, సంస్కృతుల చరిత్ర! Read More »

తెలుగునేలకుతొలి శిల్పాలనందించిన తెలంగాణా!

శిలను ఉలితో చెక్కి తీర్చిదిద్దిన బొమ్మను శిల్పం అంటారు. ముందుగా మట్టి, ఆ తరువాత కొయ్య, ఆ తరువాత రాయి, ఆపైన లోహం, ఇంకా ఇతర ధాతువులతో శిల్పాలు రూపు దిద్దుకొన్నాయి. తెలుగునేలపై పాతరాతి యుగంలో ముడిరాతిని ముతక పనిముట్లుగా చేసిన తొలి ప్రయత్నం, మధ్య రాతియుగంలో నునుపైన కొనలు గల చిన్న పనిముట్లకు దారి తీసింది. ఆ తరువాత ఆలోచనలు పెరిగి, అనుభవం నేర్పిన పాఠాలతో, నాణ్యమైన రాతిని ఎంపిక చేసుకొని, కొనలు మొనదేలేట్లు అరగదీసి, …

తెలుగునేలకుతొలి శిల్పాలనందించిన తెలంగాణా! Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీలోనూ…దక్కన్‍ ల్యాండ్‍ జైత్రయాత్ర…!!

2024 అక్టోబర్‍లో జరిగిన టీజీపీఎస్సీ విభాగంలో గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీ విభాగంలో 100కు పైగా మార్కులకు దక్కన్‍ ల్యాండ్‍ వ్యాసాల నుండి ప్రశ్నలు వచ్చి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో దక్కన్‍ల్యాండ్‍ సంచలనం సృష్టించిన విషయాన్ని మరువక ముందే, గత మే నెలలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీ విభాగంలోనూ దక్కన్‍ ల్యాండ్‍ ప్రభంజనం సృష్టించింది. ఈ విభాగంలో మొత్తం 150 మార్కులకు గానూ, 50 మార్కుల వరకూ, దక్కన్‍ల్యాండ్‍ వ్యాసాల …

ఏపీపీఎస్సీ గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీలోనూ…దక్కన్‍ ల్యాండ్‍ జైత్రయాత్ర…!! Read More »