కొత్త బౌద్ధక్షేత్రం చాడ
చాడ యాదగిరి-భువనగిరి జిల్లా మూటకోడూరు మండలం లోని ప్రాచీన గ్రామం. హైద్రాబాద్ నుంచి 74 కి.మీ.లు, భువనగిరి నుంచి 32 కి.మీ.ల దూరంలో ఉన్నది చాడ గ్రామం.తెలంగాణాలో మిగతా జిల్లాలన్నింటి కంటె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బౌద్ధం ఎక్కువచోట్ల విస్తరించింది. ఫణిగిరి, గాజులబండ, తిర్మలగిరి, నాగారం, వర్థమానుకోట, ఇంద్రపాలనగరం, తుమ్మల గూడెం, నాగారం, అరవపల్లి, గోపులాయపల్లి, నాగార్జునసాగర్, ఏలేశ్వరం, రఘునాథపురం, చాడ గ్రామాలలో బౌద్ధం ఆనవాళ్ళున్నాయి. యాదగిరి-భువనగిరి జిల్లాలో గోదావరి ఉపనది మానేరు నుండి పారిన చిన్ననదులలో…









