చెట్టంత మనిషి
ఇప్పుడు చిన్న తరగతుల చరిత్రపాఠాల్లో ఉన్నాదో లేదో కానీ, రహదారుల పక్కన చెట్లు నాటించిన, మండపాలు కట్టించిన, బావులు తవ్వించిన అశోకుడి గురించి మేము చదువుకున్నాము. ఆ తరువాత చాలా మంది పెద్ద పెద్ద రాజుల గురించి, చక్రవర్తుల గురించి తెలుసుకున్నప్పుడు,వాళ్లు పాల్గొన్న యుద్ధాలు, చేసిన దండయాత్రలు, ఆక్రమించుకున్న రాజ్యాలు వంటి విషయాలే తప్ప, అశోకుడి లాంటి మంచి పనులు చేసినట్టు పెద్దగా వినలేదు. పైగా, తన పాలనలోని ‘ధార్మిక’ విలువల గురించి అశోకుడు తానే స్వయంగా …