జానే కాహా గయే ఓదిన్
(గత సంచిక తరువాయి)ఆ దినాలల్ల అన్ని టాకీసులలో మార్నింగు షోలకు తక్కువ ధర ఉండేది. కారణం అవి పాత సీన్మాలు. మిగతా మూడు ఆటలకు ధర ఎక్కువ. ఎందుకంటే అవి కొత్త సీన్మాలు. పైగా రంగుల సీన్మాలు. మా ‘ఆషా’ల మార్నింగులన్నీ పాత తెలుగు సీన్మాలు. మిగతా మూడు ఆటలు కొత్త హిందీ సీన్మాలు. మా అమ్మ వెంబడి తోక లాగ తెలుగు సీన్మాలకు పోయేవాళ్లం. దేవదాసు సీన్మా చూసి మా అమ్మ వారం దినాలపాటు ఒకటే …









