కరోనాను కట్టడి చేద్దాం
ఒక్కో శతాబ్దంలో ఒక్కో అంటువ్యాధి మానవాళిని వేధించింది. మిగితా అంటువ్యాధులతో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం ముందెన్నడూ ఊహించనిది. సినిమాల్లో, నవలాసాహిత్యంలో ఈ రకమైన వైరస్ ప్రస్తావనలు ఉన్నప్పటికీ, అవి నిజమయ్యే అవకాశం ఉందని ఏ దేశ ప్రభుత్వం కూడా ఊహించలేకపోయింది. అందుకే దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ వైరస్‍ను కట్టడి చేసే చర్యలు తీసుకోవడంలో కొంత అయోమయం నెలకొంది. ఈ వైరస్ ధాటికి మొదట యూరప్, ఆ తరువాత అమెరికా అతలాకుతలమైపోయాయి. ఆగ్నేయాసియాలోనూ దీని ప్రభావం …