మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్ అలీ పాషా’
నయాపూల్ దాటాక ఎడమవైపున్న నాయబ్ హోటల్ పక్క సందులోకి మళ్లితే చత్తాబజార్ వస్తుంది. అక్కడి సిటి సివిల్ కోర్టు వెనక భాగాన ఉన్నదే పురానీ హవేలీ. ఐదవ కులీ కుతుబ్ షాకు (1580-1612) ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాదీ నివాసమే ఈ హవేలీ. ఇది అవతలి వారికి కనబడకుండా ఉండటం కోసం దీని చుట్టూ ఒక మైలు దూరం వర్తులాకారంలో ఎత్తైన ప్రహారీ గోడను నిర్మించారు. రెండవ నిజాం మీర్ అలీ ఖాన్ తన కుమారుడు, …