దళిత రైతుల దొంతర సేద్యం
తీరొక్క పంటలతో లాభసాటిగా వ్యవసాయం భూమి ఎంతున్నా.. రకరకాల పంటల సాగు సీజన్లవారీగా కూరగాయలు.. పూలమొక్కల పెంపకం కోళ్లు.. మేకలు.. పాడి అదనం సమీకృత వ్యవసాయంతో సంతృప్తిగా అన్నదాతలు ఆదర్శ వ్యవసాయ గ్రామంగా కరీంనగర్ శివారు మల్లన్నపల్లి‘ ఒక్క పంటను నమ్ముకుంటే నట్టేట మునుగుతం.. కాలమెట్లయిన సరే.. మనం బతికే మందం పైసలుండాలె.. ఒక్కటే పంటేసి అది పోయిందని గత్తర కావొద్దు.. ఒకటిపోతే.. ఇంకోటి మన చెయ్యికి అందాలె. పండో, ఫలమో, కోళ్లో, పాలో అమ్మేటట్టుండాలి.’ ఎనకట …