శబ్ద కాలుష్యం-సమస్యలు- చట్టం

పరిచయం :
ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి – సమాజాల మద్య అగాధం పెరిగిపోయింది. కాలుష్యం ప్రధాన కారణం. జనాభా పెరుగుదల, అదనపు విలువను జమ చేయడానికి మనుష్యుల్లోని ఒక గ్రూపు చేసే చర్యల వలన కాలుష్యం పెరిగిపోయింది.
కాలుష్యం రెండు రకాలు.
(అ) కృత్రిమ కాలుష్యం
(ఆ) భావజాల కాలుష్యం

కృత్రిమ కాలుష్యం అనేది అగ్ని పర్వతాల ద్వారా, మనిషి చేసే చర్యల ద్వారా (వాహనాలు నడపడం ద్వారా వచ్చే CO2 ద్వారా) కృత్రిమ కాలుష్యం ఏర్పడుతుంది. తాత్వికమైన కాలుష్య భావజాలం లేదా భావ జాల కాలుష్యం మనుష్యుల్లో సాటి మనుషుల మీద ఆధిపత్యం చెలాయించడానికి వాడే కాలుష్యం. దీనిని భావ జాల కాలుష్యం అంటారు.
ఉదా: జర్మనీ హిట్లర్‍ వాడిన భావజాల కాలుష్యం. ఇటలీలో ముస్సోలిని వాడిన భావజాల కాలుష్యం.
ఈనాడు ముఖ్యంగా కృత్రిమ కాలుష్యాల వల్ల మనిషితో పాటు 83 కోట్ల జీవరాశులు ప్రమాదంలో పడడం జరిగింది. అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రభుత్వాలు శబ్ద కాలుష్య నియంత్రణకు చట్టాలు చేశాయి. అందులో భాగంగా మన భారతదేశం 2000 కాలుష్య నియంత్ర మండలి చట్టం చేసింది.

ధ్వని కాలుష్య : నియంత్రణ నిబంధనలు
ఈ చట్టాన్ని 2,000ల సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను జారీ చేసింది. రోజురోజుకు ధ్వని కాలుష్యం పారిశ్రామిక కార్యకలాపాల వల్ల Generators వల్ల loud Speakers వల్ల బహిరంగ సమావేశాల వల్ల సంగీత వాయిద్యాల వల్ల, వాహనాల ధ్వనుల వల్ల మొదలైన కార్యకలాపాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతుంది. ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి కొన్ని నిబంధనలు జారీ చేయడం జరిగింది.
ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోని ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా, మండలాలుగా, వాణిజ్య మండలాలుగా,  గృహ సమూదాయ మండలాలుగా, నిశబ్ద మండలాలుగా వర్గీకరించారు. ఎటువంటి మండలంలో ఎంత మేరకు ధ్వనిని అనుమతించవచ్చు అనే అంశం గురించి ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం తప్పక తమ నిబంధనలను రూపుదిద్దుకోవాలని సూచించడం జరిగింది.

ముఖ్యమైన నిబంధనలు :

 1. 277 సెక్షన్‍ ప్రకారం ఎవరైనా బుద్ది పూర్వకంగా చెరువులను కానీ, బావులను కానీ, రిజర్వాయర్లను కానీ నీటిని కలుషితం చేసినట్టయితే శిక్షార్హమైన నేరంగా పరిగణించ బడుతుందని ఈ Section తెలుపుతుంది.
 2. 278 సెక్షన్‍ ప్రకారం కాలుష్యం ఒక ప్రాంతంలోని వాతావరణాన్ని విషతుల్యం చేస్తే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి లేదా వ్యాపారం చేసుకుంటున్న వారికి ఆరోగ్యానికి హాని కలిగితే 500/-ల వరకు జరిమానా విధించవచ్చు. కానీ ఈ జరిమానా సరిపోదు. మన దేశంలో భౌతిక నేరానికి ఉన్న ప్రాముఖ్యత పర్యావరణ నేరానికి లేకపోవడం జరుగుతుంది.
 3. సెక్షన్‍ 272 ప్రకారం ఆహార పానీయాలను విషతుల్యం చేయడం నేరం. ఎవరైనా ఆహార పానీయాలను కల్తీ చేసి వాటిని విక్రయించినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష గానీ 1000/- వరకు జరిమానా వేయించవచ్చు. కానీ ఈ జరిమానా సరిపోదు.
 4. ఈ మద్య కాలంలో నీటిలో కల్తీ చెయ్యడం సాధా రణమై పోయింది. మనదేశంలో ఇది విషతుల్యంగా రోజు రోజుకు వ్యాపిస్తుంది. దానికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉంది.
 5. 274 విషతుల్యమైన వస్తువుల ఎడల నిర్లక్ష్యత ఎవరికైనా ప్రాణాపాయం గానీ, ప్రమాదం గానీ, సంభవించే అవకాశం ఉండే విధంగా విషతుల్యమైన వస్తువుల ఎడల నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరించితే ఆరు మాసాల వరకు జైలుశిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు.

సెక్షన్‍ 286 : ఈ సెక్షన్‍ ప్రకారం ఎవరికైనా హాని కలిగించిన లేదా గాయపరిచిన ఆరు మాసాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1000/- వరకు జరిమానా లేదా రెండు కూడా విదించవచ్చు.
సెక్షన్‍ 269 : నిర్లక్యంగా కావాలని రోగాలను వ్యాప్తి చేయుట. కావాలని లేదా పనిలో భాగంగా నిర్లక్ష్యంగా రోగాలు వ్యాప్తి చెందితే ఆరు మాసాల వరకు జైలు శిక్ష గానీ లేక జరిమానా గానీ లేదా రెండు విధించవచ్చు.

శబ్ధ కాలుష్యాన్ని నివారించాలంటే మనం ఏం చేయాలి :

 • శబ్ద కాలుష్యాన్ని నివారించాలంటే మనం పైన ఉన్న చట్టంతో పాటు ప్రజల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు పౌరస్పృహను పెంచాలి. విధి నిర్వహణను అలవాటు చేయాలి.
 • శబ్ద కాలుష్యం వల్ల మానవుడికి తీవ్రమైన గుండె, ఊపిరితిత్తులకు నష్టం కలుగుతుంది.
 • శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టం గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
 • శబ్ద కాలుష్యం మీద వివిధ చర్చలు, ఉపన్యాసాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
 • శబ్ద కాలుష్యం 2000ల చట్టాన్ని ప్రజల్లో బాగా వ్యాప్తి చేయాలి.
 • శబ్ద కాలుష్య నివారణ గురించి ఉపాధ్యాయులను, విద్యార్థులను, మేధావులను భాగస్వామ్యం చేసి శబ్ధ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కలిగించాలి.

ముగింపు :
శబ్ధ కాలుష్యం పైన ప్రజల్లో అవగాహన కలిగించి ‘‘శబ్ద కాలుష్య రహిత’’ సమాజంగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

ముత్తన్నగారి రాజేందర్‍ రెడ్డి
9908240768

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *