Day: February 1, 2021

విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక!

హైద్రాబాద్‍ నగరం రోజురోజుకీ విస్తరిస్తున్నది. స్థానికులతో పాటు ఉపాధి కోసం నగరానికి వచ్చేవారితో జనాభా కూడా పెరుగుతున్నది. ప్రజావసరాలకు అనుగుణంగా విభిన్న వ్యవస్థలు ఎప్పటికప్పుడు రూపొంది, అభివృద్ధి చెందడం అత్యవసరం. ప్రతి వ్యవస్థకూ దానికంటూ కొన్ని ప్రత్యేక ప్రణాళికలున్నప్పటికీ ఆ వ్యవస్థలను రూపొందించడానికి, అమలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉమ్మడిగా సమగ్రమైన ప్రణాళికలు అవసరమవుతాయి. ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి ప్రభావప్రేరితాలు. ఈ వ్యవస్థల మధ్య సమన్వయమే ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకమవుతుంది. ప్రజాజీవనం సుదీర్ఘమైనది. నగర భౌగోళిక …

విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక! Read More »

ఆరుట్ల కమలాదేవి

జనసంద్రంలో విరిసిన అరుణారుణ కమలం, నల్లగొండ నుండి వీరవిహారం చేసిన ఓరుగల్లు రుద్రమకు ప్రతిరూపం. విప్లవాల ముగ్గుపరిచిన నవనవోన్మేష క్రాంతి, మానవత్వానికి నిలువెత్తు తార్కాణం. నిర్మల స్వభావం, అన్యాయాన్నెదిరించే అగ్నిశిఖ. వీరోచిత సాహసాలకు ఎక్కుపెట్టిన ఆయుధం. పోరాట కాన్వాస్‍పై చెరగని చిత్రం. హక్కులకై కదం తొక్కిన ధీశాలి. సాయుధ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం. ఆమెనే ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల రామచంద్రారెడ్డికి జీవిత సహచరి అయిన కమలాదేవి రాజకీయప్రస్థానంలోనూ అతని సాహచర్యాన్ని వదలలేదు. తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ వేంకటేశ్వర రెడ్డిలు. …

ఆరుట్ల కమలాదేవి Read More »

మనం మరిచిన మహా విమర్శకుడు ఆచార్య గోపాలకృష్ణారావు (జననం : 24 ఫిబ్రవరి, 1926)

మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో గత ఎనిమిది వందల యేండ్లుగా వన్నె తరగకుండా దేదీప్యమానంగా వెలుగుతున్న పక్రియ ‘శతకం’. శతక సాహిత్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు సమకాలీన చరిత్రకు అద్దం పట్టింది. పాండిత్యానికి పెద్ద పీట వేసింది. కన్నడ, సంస్కృత భాషల్లో ఈ పక్రియ కనుమరుగవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం కొత్తరూపు సంతరించుకుంటూ ముందుకు పోతుంది. పండితులే గాకుండా గువ్వల చెన్నడి లాంటి సామాన్యులు కూడా ఈ శతకాలను రాసి రంజింప జేసిండ్రు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చిండ్రు. …

మనం మరిచిన మహా విమర్శకుడు ఆచార్య గోపాలకృష్ణారావు (జననం : 24 ఫిబ్రవరి, 1926) Read More »

హైదరాబాద్‍ క్రికెట్‍

బ్రిటిష్‍ సైన్యం హైదరాబాద్‍ ప్రజానీకానికి క్రికెట్‍ను పరిచయం చేసింది. సుమారుగా 1880 ప్రాంతంలో నగరంలో క్రికెట్‍కు బీజాలు పడ్డాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్‍ 1930/31కు పూర్వం హైదరా బాద్‍లో ఫస్ట్ క్లాస్‍ క్రికెట్‍కు సంబంధించి ఏ రికార్డులు లభ్యం కావడం లేదు. 19వ శతాబ్ది చివరికాలం, 20వ శతాబ్ది మొదట్లో రాజా లోచన్‍ చంద్‍ ఈ ఆటకు ప్రధాన పోషకుడిగా ఉన్నట్లు చెబుతారు. మసూద్‍ అహ్మద్‍, అహ్మద్‍ అలీ, నజీర్‍ బేగ్‍, ఖుర్షీద్‍ బేగ్‍ లాంటి క్రికెటర్లు …

హైదరాబాద్‍ క్రికెట్‍ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-6 జినవల్లభుని మూడుభాషల కుర్క్యాల శాసనం (క్రీ.శ.940)

ఆ శాసనం ఎర్రటిరంగు పులుముకొన్న బొమ్మల నడుమ ఉంటుంది. కొంచెం కష్టపడి, కొండెక్కితేగానీ కనిపించదు. ఆ శాసనం క్రీ.శ.940-45 మధ్య కాలంలో చెక్కబడింది. అప్పటి ప్రజలకు అర్థమయే తెలుగు, కన్నడ భాషల్లోనూ, పండితులకర్థమయే సంస్కృతంలోనూ, అధికారిక సమాచార పత్రంగా ప్రకటించబడింది. వెయ్యేళ్లకు పైగా, అక్కడే అక్షర రూపంలో నున్న ఈ శాసనం, ఒకనాటి చారిత్రక సంఘటనకు మౌనసాక్షిగా ఇప్పటికీ నిలిచే ఉంది. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే జానపద గాధల్ని, పాటల్ని సేకరించే నిమిత్తం తెలంగాణలోని ఊరూ, వాడా …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-6 జినవల్లభుని మూడుభాషల కుర్క్యాల శాసనం (క్రీ.శ.940) Read More »

మహారాజా కిషన్‍ పర్‍షాద్‍ దేవుడీ

‘‘షాద్‍’’ అన్న తఖల్లూస్‍తో (కలంపేరు) ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో కవిత్వం రాసినది ఎవరో తెలుసా? ఆరవ నిజాంకు దివాన్‍గా పనిచేసిన మహరాజా కిషన్‍ పర్‍షాద్‍. ఆయన జాగీరు గ్రామం పేరే షాద్‍నగర్‍. నగరంలో కిషన్‍భాగ్‍ దేవాలయం ఆయన కట్టించినదే. ఆయన అధికార నివాసభవనం ‘‘దేవుడీ’’ షాలిబండాలో ఉంది. కరిగిపోయిన కమ్మని కథలకు ప్రతిరూపమే ఆ దేవుడీ. ఆ దివాణం చుట్టూ అల్లుకున్న కమ్మని కథలు ఎన్నెన్నో!వీరు ఖత్రీ కులానికి సంబంధించినవారు. వీరి మాతృభూమి పంజాబ్‍. వీరు …

మహారాజా కిషన్‍ పర్‍షాద్‍ దేవుడీ Read More »

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!

(గత సంచిక తరువాయి)మొదటి హైపర్‍లూప్‍ మార్గం ఎక్కడ?ఎలనమస్క్ మొట్టమొదటిసారిగా ఈ హైపర్‍లూప్‍ని అమెరికాలో లాస్‍ ఏంజెల్స్ నుండి శాండియాగో, లాస్‍ వేగాస్‍ని కలుపుతూ శాన్‍ఫ్రాన్సిస్‍స్కో వేద్దామని నిర్ణయించారు. అయితే లాస్‍ ఏంజెల్స్ నుండి శాన్‍ఫ్రాన్సిస్కోకి కాలిఫోర్నియా హైస్పీడ్‍ రైల్‍ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో, ఈ మార్గంలో హైప్‍లూప్‍ నిర్మాణం ఆలస్యమవుతోంది. కానీ చికాగో, క్లీన్‍లాండ్‍, వాషింగ్టన్‍ మరియు న్యూయార్క్ నగరాలకు మధ్యలో ఈ హైపర్‍లూప్‍ మార్గాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైపర్‍లూప్‍ టెక్నాలజీ – భారతదేశం: …

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!! Read More »

సైబర్‍ సెక్యూరిటీ

ఐటీ రంగంలో పలు దేశాలు వేగంగా అభివృద్ధి చెందు తున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భౌతిక యుద్ధాలు అవసరం లేదు. వాటి సమాచార వ్యవస్థను ఛేదిస్తే చాలు. అందుకే రోజూ ఎన్నో రకాల సైబర్‍ దాడులు జరుగు తుంటాయి. మన దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.కమ్యూనికేషన్‍ వ్యవస్థ, కంప్యూటర్‍, నెట్‍వర్క్ రంగాల్లో …

సైబర్‍ సెక్యూరిటీ Read More »

కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం

రాష్ట్రకూటులకాలంలో కొలనుపాక ప్రాంతంలో విరివిగా జైనబసదులు నిర్మాణమైనాయి. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని బంధువు, పాణూర వంశానికి చెందిన శంకరగండరస మహామండ లేశ్వరుడిగా కొలనుపాక-20,000లనాడు పాలించేవాడు. శంకర గండరస దిగంబరజైనానికి చెందినవాడు. శంకరగండరస శాసనాలు వేలుపుగొండ (జాఫర్‍ గడ్‍), ఆకునూరు, ఇంద్రపాల నగరం, మల్లికార్జునపల్లి, ఆమనగల్లులలో లభించాయి. ఈ స్థలాలలో కొన్నింటిలో జైనబసదు లున్నాయి. ఇతని ఏలుబడిలో కొలనుపాక కేంద్రంగా ఈ ప్రాంతంలో జైనం విస్తరించింది. రాష్ట్రకూటుల తర్వాత పాలకులైన కళ్యాణీ చాళుక్యరాజులలో కొందరు జైనాన్ని అభిమానించారు. పోషించారు …

కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం Read More »

తెలంగాణ ఘనవారసత్వాన్ని కాపాడుకుందాం!

తెలంగాణ!ప్రాచీన కాలం నుంచి మొదలుకొని భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడడం వరకు ఎన్నో ఘనతలు తెలంగాణ సొంతం. ఇంతటి ఘనతలు తెలంగాణ పొందడానికి ప్రధాన కారణం తరతరాలుగా వివిధ రూపాల్లో మనం పొందుతూ వచ్చిన మన ఘనవారసత్వమే. ప్రపంచంలో, భారతదేశంలో ‘తెలంగాణ’ అంటూ మనకు ఒక ఉనికి ఏర్పడిందంటే అందుకు కారణం మన వారసత్వమే. అలాంటి వారసత్వం గత ఆరు దశాబ్దాల కాలంలో గత పాలకుల హయాంలో ఎంతగానో నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో మనం ‘ప్రపంచ …

తెలంగాణ ఘనవారసత్వాన్ని కాపాడుకుందాం! Read More »