మన భద్రత మన చేతుల్లోనే…
ప్రకృతిని ఎంతగా వినియోగించుకుంటే నాగరికత అంత అభివృద్ధి చెందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. ప్రకృతిని వినియోగించుకునే విధానం నాగరికత అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఆ జీవిత విధానాలనే సంస్కృతి అంటారు. ప్రకృతి అనేక సహజ నిర్మాణాలతో కూడుకొన్నదే అయినా నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ దాని నిర్మాణ రూపాలు మారిపోతాయి. వినియోగం అనేదానిలోనే విధ్వంసం దాగి ఉంటుంది. సమతుల్యతను భంగపరుస్తుంది. ప్రకృతిలో సంభవించే ఈ అసమతుల్యతనే పర్యావరణ సంక్షోభం అంటాం. దీన్ని నివారించడమే పర్యావరణ పరిరక్షణ. ఈ పరిరక్షణ అనేది …