Day: April 1, 2021

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత

కళకు, కులానికి మధ్య అనుబంధం వేల ఏళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. ఒక సృజనాత్మకత కళ పేరు చెబితే కులం గుర్తుకురావడం, కులం పేరు చెబితే ఆ కళ సృజనాత్మకత గుర్తుకు రావడం సహజమే. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి ముందు గ్రామాల్లో ప్రజలు చేతివృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవనం కొనసాగించేవారు. ఉమ్మడి కుటుంబంలో చిన్నా, పెద్దా అంతా కూడా ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. ఈ చేతివృత్తుల్లోనే వివిధ కళలు చోటు చేసుకునేవి. వాటిల్లో సృజనాత్మకత కూడా ఎంతగానో వెల్లివిరిసేది. …

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత Read More »

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. తొలుత అనాదిగా తెలంగాణ వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థకు ఆదరవులుగా ఉన్న గోలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించడానికి మిషన్‍ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినప్పటికీ ప్రభుత్వాలు భూసేకరణ జరపకపోవడం, నిధులు సమకూర్చకపోవడం, పర్యావరణ, అటవీ అనుమతులు పొందలేకపోవడం, నిర్వాసిత గ్రామాల పునరావాసంపై దృష్టి పెట్టకపోవడం, అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించకపోవడం, రోడ్డు, రైల్వే క్రాసింగుల అనుమతులు పొందకపోవడం …

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!

(గత సంచిక తరువాయి)మొదటి దశ : వాయురూపంలో అతివేడిగా వున్న గోళం, చల్లబడుతున్న క్రమంలో పై భాగాల్లో అతిశీతల మంచు, కొంత మేర వివిధ వాయువుల సమ్మేళనంతో వాతావరణం, దీంతో నేల, జీవపదార్థం ఆవిర్భవించడం జరిగింది. భూభ్రమణంతో ఈ పరిణామాలు వేగవంతం కావడం జరిగింది.రెండో దశ : ఈ దశలో వాయువులలోని వివిధ రసాయనిక చర్యలతో గోళం ఉపరితలంపై గల ఆవిరి, అప్పుడే ఏర్పడుతున్న ద్రవం (వివిధ మూలకాలతో), నీరు (H2O) మంచు ఖండికలు కలిసి, తేమగా …

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »

కోర్టు వాదనల్లో సాహిత్యం..

న్యాయవాదులూ న్యాయమూర్తుల్లో కవులూ రచయితలూ తక్కువ. కానీ చాలా మంది న్యాయవాదులకి న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ. సాహిత్యం మీద ఇష్టం వున్న న్యాయ వాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో కవితా చరణాలను ఉదహరిస్తూ వుంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తూ వుంటారు.వానదల్లోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్యన జరిగే సంభాషణల్లో కూడా కథలూ కవిత్వమూ అప్పుడప్పుడూ వస్తుంది.ఓ చిన్న కథ, కవిత్వం చేసే పని ఓ గంట ఉపన్యాసం కన్నా ఎక్కువ. …

కోర్టు వాదనల్లో సాహిత్యం.. Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

(గత సంచిక తరువాయి)పశువుల ఫారాల నిర్మాణం ఎలా ఉండాలి?ఫారం నిర్మాణం : పశువుల ఫరాల్ని ఎంపికచేసిన స్థలంలో ఇ, యు, ఎల్‍, సి, ఎఫ్‍ అక్షరాలలాగా నిర్మించుకుంటే, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది.పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరక్టుగా పడకుండా తూర్పు-పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని కూడా దిశను మార్చుకోవచ్చును. తీరప్రాంతాలలో గోడ, గాలివీచే దిశకు అడ్డుగా, ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో నేల తొందరగా ఆరడానికి ఉత్తర-దక్షిణ దిశల్లో, అధిక ఉష్ణోగ్రత ఉండే …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

కళావరు రెండు

గుహనిండా చెల్లా చెదరుగా పడి ఉన్న రాళ్ళ మధ్య వాళ్లు నలుగురూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నించున్నారు. గుహ బయట ఉన్న రాళ్ళు, రప్పలు, తుప్పలు, ఆకుపచ్చని వెలుగులో తళ తళలాడిపోతున్నాయి. ఆ రాళ్ళ మధ్య వాళ్ళు వచ్చిన అంతరిక్ష నౌక ‘పినాకిని’ నిశ్చలంగా ఉంది. గుహ బయట వాళ్ళకు ఎదురుగా పర్వతంలా ఉన్న ఒక భయంకరమైన జంతువు నిలబడి ఉంది. ఆ జంతువు పెద్ద లోహపు ముద్దలా ఉంది. దాని వీపు నిండా ఉన్న ముళ్ళు …

కళావరు రెండు Read More »