ప్రపంచ పర్యావరణం – ప్రజల భాగస్వామ్యం


(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 2021 జూన్‍ 5న ఎకో సిస్టమ్‍ రిస్టొరేషన్‍ అనే అంశంపై జూమ్‍ మీటింగ్‍ ద్వారా ప్యానెల్‍ డిస్కషన్‍ నిర్వహించింది. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్‍ పొందిన అదర్‍ సిన్హా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం సమావేశమయ్యాం. హైదరాబాద్‍ మెరుగుదల కృషిలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఫోరమ్‍ ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍కు నా అభినందనలు. హైదరాబాద్‍ అభివృద్ధితో నాకు రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఇక్కడ కలుసుకుంటున్నాం. పాల్గొంటున్న వారంతా కూడా తమ తమ రంగాల్లో ప్రముఖులే. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపిక చేసిన థీమ్‍లు, ఇస్తున్న నినాదాలు అన్నీ కూడా చూసేందుకు ఎంతో అర్థవంతంగా కనిపిస్తాయి, కాకపోతే అవి అలా ఉన్నాయా అని కూడా ఆలోచించాలి. 7 బిలియన్‍ డ్రీమ్స్, వన్‍ ప్లానెట్‍, కన్జ్యూమ్‍డ్‍ విత్‍ కేర్‍ గురించి ఐదారేళ్ల క్రితం 2015లోనే మాట్లాడుకున్నాం.


విధాన నిర్ణేతలు మాత్రమే కాదు… ప్రతీ ఒక్కరూ పర్యావరణం విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టవిరుద్ధంగా సాగుతున్న వన్యప్రాణి వ్యాపారాన్ని కూడా మనం పూర్తిస్థాయిలో అడ్డుకోవాలి. వన్యప్రాణి వ్యాపారం కూడా పర్యావరణంపై ప్రభావాన్ని కనబరుస్తోంది. ప్రజలను ప్రకృతితో అనుసంధానం చేయాలనేది నిత్యసత్యం. మనం శాంతినికేతన్‍ నమూనాను ఇప్పుడే చూస్తున్నాం. అదెలాంటి మార్పు తెస్తుందో చూడాలి. నేటి జీవితంలో ప్లాస్లిక్‍ పొల్యూషన్‍ అనేది అత్యంత ముఖ్యమైందిగా మారింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‍ మాత్రమే కనిపిస్తోంది. 2019లో వాయు కాలుష్యం అనేది థీమ్‍గా ఉండింది. మరి ఆ తరువాత ఏం జరిగింది ? 2021లో మన థీమ్‍ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. మనం మన జీవనశైలి గురించి పునరాలోచించాల్సి ఉంటుంది. అమెజాన్‍ వ్యాపార సైట్స్ ను క్లిక్‍ చేయవద్దరి సూచిస్తుంటారు. వాటిల్లో మీరు కొనేవి మీకు నిజంగా అవసరమై ఉండ కపోవచ్చు లేదా వాటిని అసలేమాత్రం ఉపయోగించక పోవచ్చు. మనం పారేసే ప్రతి ఒక్కటి కూడా పర్యా వరణానికి జోడించ బడుతుంది. పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది. అందుకే మన అవసరాల గురించి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దురాశకు చివర అంటూ ఏదీ ఉండదు. అది అలా కొన సాగుతూనే ఉంటుంది.


ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది పునర్వినియోగం. ఇది అత్యంత శక్తివంతమైంది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా మనం మనకు అవసరం లేని వాటిని చెత్తకుప్పల్లో పారేయం. వాటి నుంచి మరేదైనా సృష్టించేందుకు ప్రయత్నిస్తాం. ఇలా చెబుతుంటే నాకు నేను చదువుకున్న రోజులు గుర్తుకొస్తు న్నాయి. పనికి రాని వస్తువుల నుంచి మరేవైనా కళాత్మక వస్తువులను రూపొందించేవాళ్ళం. హ్యాండీ క్రాఫ్ట్ తరగతిలో వాటి గురించి మనకు చెప్పేవారు. నేటి పరిస్థితులు మనల్ని సాంకేతికతను వినియోగించు కునేలా, ట్యాబ్‍లను వాడేలా, మొబైల్స్ను ఉపయోగించేలా బలవంతం చేస్తున్నాయి. అయితే మళ్లీ మనం వెనక్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. వెనుకటి రోజుల్లో మనం వాడిన వాటిని మళ్లీ వాడాలి. పర్యావర ణాన్ని మనం ఏవిధంగా పునరుద్ధరించగలం? అదే అన్నిటి కంటే ముఖ్యమైంది. ఆ అవసరాన్ని మనం చాటి చెప్పాలి. ప్రతీ ఒక్కరూ దాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. అవగాహనను వ్యాపింపజేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఒకనాటి వ్యవస్థలను కాపాడాలి, పునరుద్ధరించాలి. నేటి నుంచి ఓ పదేళ్ళ పాటు దేశాలన్నీ కూడా ఎకనామిక్‍ ఎకోసిస్టమ్‍ పునరుద్ధరణకే ప్రాధాన్యం ఇవ్వాలి. 2021 నుంచి 2031 వరకు మనమంతా కూడా పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపైనే పని చేయాలి. మనం చేయాల్సింది ఎంతో ఉంది. వ్యవస్థల్లో లోటుపాట్లను సవరించు కోవాలి. సుస్థిరదాయక భవిష్యత్‍ ఉండేలా చూసుకోవాలి.


1987లో మనం సుస్థిరదాయక వనరుల గురించి మాట్లాడుకున్నాం. అది ఇవాళ్టికీ ఎంతో ముఖ్యమైంది. ఈ రోజున మనం వెబ్‍ ఆఫ్‍ లైఫ్‍ గురించి మాట్లాడుకుంటున్నాం. జూన్‍ రెండో తేదీన టైమ్స్ ఆఫ్‍ ఇండియాలో నేను ఒక ఆసక్తిదాయక వ్యాసం చదివాను. కాలిఫోర్నియా బర్క్ లీ పాలిటెక్నిక్‍ యూనివర్సిటీకి చెందిన మిల్లర్‍ ఇనిస్టిట్యూట్‍, న్యూజిలాండ్‍కు చెందిన మాసే యూనివర్సిటీ కలసి ఓ ఆన్‍ లైన్‍ సర్వే నిర్వహించాయి. అటవీ భూమి ముక్కచెక్కలు కావడం, వ్యవసాయం విస్తరించడంతో సహా అంతర్జాతీయంగా భూ వినియోగం, మార్పులు లాంటివి అందులో ఉన్నాయి. కేంద్రీకృతమైన జీవితం ఉత్పత్తిని ఆపేసింది. వైరస్‍ లకు అనుకూలమైన హాట్‍ స్పాట్‍ లను రూపొందించడం ప్రారంభించింది. గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించేందుకు అనుకూలమైన పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నాయి. మరో వైపున ఇందులో రాజకీయాలు కూడా ఉంటున్నాయి. అమెరికా రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు మనిషి ఆరోగ్యం పర్యావరణ ఆరోగ్యంపై, జీవజాలం ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉండే పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఒక చోట ఆ లింక్స్ అన్నిటినీ మనం విస్మరించాం. పట్టణమైనా…. పల్లె అయినా…. ఒంటరిగా మనం జీవించలేం. ఎక్కడో ఒక చోట మనం ఆగాలి. మనం కనుగొన్న అంశాలపై దృష్టి పెట్టాలి. జంతుజాలం నుంచి మనుషుల్లోకి వైరస్‍లు వ్యాప్తి చెందకుండా ఉండే మార్గాలను అన్వేషించాలి.


ఇతర నగరాలకు పట్టిన దుస్థితి హైదరాబాద్‍ కు పట్టకుండా చూసుకోవాలి. ఇతర నగరాల స్థితిగతులను అధ్యయనం చేయాలి. మనం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాం…. గ్రామీణ ప్రాంతాల్లోఉండేటటువంటి సమస్యలు మనకేమీ ఉండవు అని భావిస్తుంటాం. అది తప్పు. జీవులతో కూడిన పర్యావరణ వ్యవస్థ పరిసరాలతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈవిధమైన ఇంటరాక్షన్‍ జీవులపై ప్రభావం కనబరుస్తుంది. యావత్‍ జీవరాశికీ జీవించే పరిస్థితులు కావాలి. నిలకడతో కూడిన శీతోష్ణస్థితి, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, అన్ని రకాల పదార్థాలు కావాలి. అవన్నీ అమూల్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని ఉపయోగించడం లోనూ మనం అప్రమత్తత కనబర్చాలి. ఇంట్లో వాడేందుకైనా…. పరిశ్రమల్లో ఉపయోగించేందు కైనా వాటిని దుర్వినియోగపర్చకూడదు.


సుస్థిర అభివృద్ధి ఆశయాల గురించి మనం ఇప్పటికే ముచ్చటించు కున్నాం. వాటి గురించి నేను పెద్దగా మాట్లాడను. అయితే వాటిలో 17వ ఆశయం మనందరికీ మరెంతో ముఖ్యమైంది. అదే భాగస్వామ్యం. అలాంటి భాగస్వామ్యాల కల్పనకు కృషి చేస్తున్న ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ కు నా అభినందనలు. ఇలాంటి భాగస్వామ్యాల్లో ప్రజలు ఉమ్మడి అంశాలపై మాట్లాడుకుంటారు. తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రావాలని మనం కోరుకుంటున్న మార్పుకు ఇది ఒక సంకేతం. మరి ఈ భాగస్వామ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి. విద్యావేత్తలతో మనం భాగస్వామ్యాలను కలిగిఉన్నాం. ఉదాహరణకు…ఇంతకు ముందు నేను రెండు యూనివర్సిటీల గురించి చెప్పాను. అన్‍ లైన్‍ లో అనేక భాగస్వామ్యాలు కుదురుతు న్నాయి. అంతిమంగా అవి యావత్‍ మానవజాతికి మేలు చేసేవిగా ఉండాలి. భవిష్యత్‍ ను రూపొందించేలా ఉండాలి. నేటి భాగస్వామ్య కార్యక్రమంలో భాగమైనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎంతోమంది ప్రముఖులను, ఆయా రంగాల్లో చక్కటి అనుభవం ఉన్న వారిని మనం కలుసుకోగలిగాం. అర్బన్‍ మేనేజ్‍ మెంట్‍ లో, సస్టెయినబులిటీ మేనేజ్‍ మెంట్‍ లో, ఇతర సంబంధిత రంగాల్లో వారంతా ఎంతగానో సేవలందించారు. మనం ముందుకెళ్లేందుకు ఇదో చక్కటి మార్గమని నేను భావిస్తున్నాను. స్థానిక పరిస్థితులను బట్టి, ప్రాథమ్యాలను బట్టి ఇతర ఆశయాల సాధనకూ ఇదే విధంగా ముందుకెళ్లాలి. స్థానిక ఆర్థిక వ్యవస్థ, స్థానిక ప్రభుత్వం ఈ ఆశయాలకు ప్రాచుర్యం కల్పించాలి. పర్యావరణ వ్యవస్థలను ఎలా పునరుద్ధరించ గలమో ఆలోచించాలి. మనం ఎదుర్కొనే అతి ముఖ్యమైన సవాలు ఇదే.


పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ అంశానికి వస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి మనం మాట్లాడుకోవాలి. అవగాహన పెంచాలి. అది కార్యాచరణలో కనిపించేలా చేయాలి. వివిధ వనరుల నుంచి నేను ఎంచుకున్న ఈ అంశాలన్నీ కూడా మనకెంతో ముఖ్యమైనవి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారుల వంటి వాటితో పోరాడేందుకు అవెంతగానో తోడ్పడుతాయి. ఇంట్లో ఉండండి… సురక్షితంగా ఉండండి అని అంటున్నారు. మనం స్వయంగా ఏ చర్యలు తీసుకోవాలో చూడాలి. ఇంట్లో ఉండేందుకు…. సురక్షితంగా ఉండేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రస్తుత సందర్భంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యల్లో ఇవి కొన్ని. మరెన్నో ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. పర్యా వరణ వ్యవస్థల పునరుద్ధరణ విషయంలోనూ అంతే. ప్రకృతిని తిరిగి తెచ్చుకునేందుకు ఒక భాగ స్వామ్యం ఏర్పడేందుకు ఈ సమావేశం తోడ్పడగలదు. నిత్యజీవితంలో మనం ఏం చేస్తున్నామో చూడాలి. చేసే పనులకు ఎంపికలుంటాయి. మనం ఎలాంటి వాటిని ఎంచుకుంటున్నామో చూడాలి. మనం మన ప్రవర్తనలను మార్చుకోవాలి. తక్కువగా వనరులను వెచ్చించాలి. స్థానిక, అంతర్జాతీయ పర్యావరణ ఉనికి ని అధికం చేసుకోవాలి. రిఇమేజిన్‍, రిక్రియేట్‍ గురించి నేను మాట్లాడాను. ఒక ఎంపికను ఎంచుకునేందు కు గల విధానాల్లో అది ఒకటి. ఇందులో మీరు మీ అవసరాలను పరిమితం చేసుకుంటారు. వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా అది అంతర్జాతీయంగా వ్యర్థాల ఉనికిని తగ్గిస్తుంది. వనరు లు కంపెనీలకు వెళ్లడాన్ని మళ్లిస్తుంది. ప్రకృతిని తిరిగి తెస్తుంది. నేడు ఆర్గానిక్‍ సేద్యం అధికమైపోయింది. దానికి మనం ప్రాచుర్యం కల్పించాలి. అదే విధంగా మిద్దెతోటల పెంపకం కూడా అధికమైపోయింది. ఇళ్లలో నూ మొక్కలు పెంచుతున్నారు.


ఇవన్నీ చిన్న చిన్నవే…. అయినా ఎంతో మంచివే. ఇలాంటివి మరెన్నో చేయాలి. ఇవన్నీ సమాజానికి ఉపయోగపడేవే. పర్యావరణ నిపుణులు సూచించే వాటిని మనం క్షేత్ర స్థాయిలో అమలు చేయాలి. మన చుట్టూ ఉన్న వారు కూడా వాటిని చేసేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమేం చేస్తామో మన పిల్లలు దాన్నే పాటిస్తారు. ఇవన్నీ కూడా సమాజంలో మార్పును తీసుకువస్తాయి. మనం మన భావాలను పంచుకునేందుకు ఇప్పుడు మరింత అవకాశం ఉంది. అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటివన్నీ చేయడం సాధ్యమే. మనం ఎంపికలు చేసుకోవడం మాత్రమే కాదు, వాటిపై గొంతు విప్పాలి. తద్వారా కొత్త ఆలోచనలు బయటకు వస్తాయి, చర్చలు జరుగుతాయి. స్థానిక పర్యావరణాన్ని ఎలా మెరుగుపరచాలా అనే తపన వస్తుంది.


నేను గొప్ప విషయాలేమీ చెప్పలేదు. వివిధ అంశాలను అనుసంధానించేందుకు మాత్రమే ప్రయత్నించాను. వాటన్నిటికీ ఎంతో ప్రాధాన్యముంది. వాటికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. జీవవైవిధ్యం కూడా ముఖ్యమైనదే. మన ముందున్న మార్గాలు ఇవి మాత్రమే కాదు. ఇప్పుడు చెప్పినవన్నీ సూచన ప్రాయమే. మరెన్నో మార్గాలు అనుసరించవచ్చు. అంతేకాదు…వాటిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మరిన్ని ఎంపికలు చేసుకోవచ్చు. మరిన్ని చర్యలు తీసుకోవచ్చు. మనం మన గొంతును మరింత గట్టిగా వినిపించాల్సిన సందర్భం వచ్చింది. పర్యావరణ ప్రభావాలపై, సామాజిక ప్రభావాలపై అధ్యయనాలు నిర్వహించాలి. పట్టణ వ్యర్థాల నిర్వహణపై కూడా దృష్టి సారించాలి.


వరద పరిస్థితులను కూడా ప్రధానంగా చాటిచెప్పాలి. హైదరాబాద్‍ లో పట్టణ నీటి నిర్వహణపై శీతోష్ణస్థితి ప్రభావం పెరిగిపోతున్నది. తాగు నీళ్లు, భూగర్భ జలాలు లేదా వరద నీళ్లు…. వీటన్నిటి సమస్యలు ఎదు ర్కొంటున్నాం. ఇక్కడ మనం వాన నీటితో ప్రారంభించాలి. దాన్ని నిల్వ చేసుకోవడం మొదలుపెట్టాలి. తద్వారా అది భూగర్భజలాల్లోకి వెళ్తుంది. వర్షపు నీటిని ఇళ్లలో ప్రాసెస్‍ చేయడం కూడా చేస్తారు. అంతి మంగా అది సుస్థిరదాయకతకు దారి తీస్తుంది. ఎస్టీపీ తరహాలో ఇళ్లలో ప్రాసెస్‍ను డిజైన్‍ చేయాలి. వరద నీటి కాలువలు వరదను చెరువుల్లోకి తీసుకెళ్లగలగాలి. వీటన్నిటినీ ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. వీటన్నిటి కోసం గ్రీన్‍ క్లైమేట్‍ ఫండ్‍ ఉండాలి. ఈ కార్యక్రమంపై మీ సూచనలను ఆహ్వానిస్తున్నాం. ప్లాంట్‍ టిష్యూ కల్చర్‍ ల్యాబ్‍ టెక్నిక్‍ ల పై కూడా మనం ప్రచారం చేయాల్సి ఉంది. మనం జీవవైవిధ్య అధ్యయనాలు కూడా నిర్వహిస్తున్నాం. మనం గాలి నాణ్యతను పరీక్షించేందుకు అధునాతన ల్యాబ్‍ లను కలిగిఉన్నాం. అంతేగాకుండా పటిష్ఠ రీతిలో స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తున్నాం. ఆన్‍ లైన్‍ శిక్షణ సదుపాయం కూడా ఉంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో రెండు వారాల పాటు 6 దేశాల నుంచి 82 మంది పాల్గొన్నారు. పర్యావరణ ప్రభావం మదింపు, సహకారం అంశంపై ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.


వాననీటిని సంరక్షించి దానితో చేసిన పనులు కూడా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ప్రాంతంలో పునరుద్ధరణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పలు రకాల జీవజాలం నెలకొంది. వలస పక్షులు కూడా వస్తున్నాయి. ఇది కాంక్రీట్‍ జంగిల్‍ అయిన గచ్చిబౌలిలో ఉన్నప్పటికీ, అక్కడి ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంది. ఇరవై ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంతంలో మొక్కలు, చెట్లు బాగా ఉన్నాయి. బిల్టప్‍ ఏరియా బాగా తక్కువగా ఉంది.


ఇక మనకు వారసత్వ కట్టడాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ముచ్చటించుకోవాలి. మన క్యాంపస్‍ పాత కాలపు శైలిలో నిర్మించబడింది. శిలల ప్రాధాన్యం గురించి కూడా చాటి చెబుతున్నాం. వివిధ రకాల శిలా నిర్మాణాలపై అధ్యయనం నిర్వహిస్తున్నాం. వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ముందుకు వెళ్లేందుకు మార్గం భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడమే. అది ఏ ఒక్కరితోనో… ఒక్క సంస్థతోనో జరుగదు. అంతా కలసి ముందుకు రావాలి. వనరులను మనం కాపాడుకోగలిగితే, మనం సుస్థిరదాయక జీవితం గడప గలుగుతాం. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *