తప్పెటగుళ్ళు – నీలబోను సత్యం
‘‘నారాయణ, శ్రీమన్నారాయణ’’ అనే ఒక పదం ‘రంగస్థలం’ సినిమా స్వరూపాన్నే మార్చి చిట్టిబాబు అన్నను చంపిన హంతకులను హతమార్చి రంగస్థలంకు క్రొత్త సర్పంచ్‍ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేస్తుంది. నృత్యం చేస్తూ గంభీరమైన ముఖ వర్చస్సుతో, పొడగాటి జుట్టు, మెలితిరిగిన మీసాలతో ‘శ్రీమన్నారాయణ’ అనే పదాన్ని పాటరూపంలో పలికిన వ్యక్తి పేరే ‘నీలబోను సత్యం’. అతడు ఆడిన నృత్యం పేరే ‘తప్పెటగుళ్ళు’. ఛాతిపైన ఒక తప్పెటగుండు (బోలుగా ఉన్న చిన్న గుండ్రటి డప్పు) గజ్జెలలాగు, కాళ్ళకు గజ్జెలు, ఒకేరంగుతో …