ప్రకృతివరణంకు (డార్వినిజం) దారితీసిన పరిస్థితులు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!!శాస్త్రపరిశోధనలన్నీ సందర్భోచితంగా, సమస్యల పరిష్కారానికి దోహదపడేలా జరుగుతాయి. కొన్ని శోధించి సాధించబడితే, మరికొన్ని కాకతాళీయంగా జరిగిన సంఘటనల ఆధా రంగా సిద్ధాంతీకరించ బడతాయి. అత్యధిక పరిశోధనలన్నీ ప్రకృతి దృగ్విషయాల నేపథ్యంలో జరిగితే, మరికొన్ని భౌతిక, రసాయనిక, భౌగో ళిక, ఖగోళ, భూగర్భ, సముద్ర సంబంధిత పదార్థాల, జీవుల మధ్యన జరిగే పరస్పర చర్యల ఆధారాలతో ముడిపడి వుంటాయి. ఏ పరిశోధన అయినా, పరిశోధకుల ఊహ ప్రతిపాదనలతో, పరికల్పనలతో (hypotheses ప్రారంభమై ప్రయోగాలతో, క్షేత్ర పరిశీలనలతో కొనసాగు తాయి. సేకరించిన దత్తాంశాల్ని, సాధించిన ఫలితాలు విశ్వజనీనం చేయబడుతాయి. నేటి అత్యాధునిక అభివృద్ధి, ఆవిష్కరణలు, మాన వాళి అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ ఈ విధంగానే అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటి వెనుక వందల వేలమంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, అజ్ఞాత సూరీళ్ళు నిరంతరం శ్రమించడమే కాక, అనేకమంది తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. గతంలో (7వ కథనం) కొందరి శాస్త్రజ్ఞుల ఆవిష్కరణల్ని, వారి త్యాగాల్ని చూసాం!


గత సంవత్సరం జులై నుంచి ప్రకృతివరణం (Natural Selection) అనే పతాకంతో (tag) కథనాల్ని రాస్తున్న విషయం తెలిసిందే! కొందరు పాఠకులు ఈ ట్యాగ్‍ గూర్చి ప్రస్తావించడం జరిగింది. ప్రకృతివరణం అనే పదాన్ని మొట్ట మొదటగా, శాస్త్రీయంగా వాడుక లోకి తెచ్చింది మాత్రం చార్లెస్‍ రాబర్ట్ డార్విన్‍ (Darwin) అనే ఆంగ్ల ప్రకృతివాది (naturalist). ‘డార్వినిజం’ అనే సిద్ధాంతంతో యావత్‍ ప్రపంచానికి డార్విన్‍ పరిచయస్థుడే! పోతే, ఈ సిద్దాంత ఆవిష్కరణ ఓ పరికల్పనతో (hypothesis) కాకుండా, సముద్రయానం చేసే అవకాశం రావడం, దీన్ని డార్విన్‍ సద్వినియోగం చేసుకోవడంతో సిద్దాంతీకరించ బడింది.


ఈ పరిశోధనకు దారితీసిన పరిస్థితులు కాకతాలీయంగా జరిగినా, పోగుపడిన శాస్త్రీయ ఆలోచనల్ని సమాజంకు తెలియ జెప్పడానికి నాటి పరిస్థితులు అనుకూలంగా లేకుండే! క్యాథలిక్‍ చర్చి ఆలోచనలు బలంగా వున్న నాటిరోజుల్లో దేవుడి సృష్టి సిద్ధాంతాన్ని తప్పుబట్టడం ఓ సాహసోపేత చర్యనే! అందుకే జీవుల పుట్టుక, కాలానుగత మనుగడ (adaptation), పరిణామం అనే దృగ్విషయాల్ని గ్రంథస్థం చేసిన రెండు దశాబ్దాల దాకా (1859) బాహ్య ప్రపంచానికి జీవుల పుట్టుక (Origin Of Species) గూర్చి డార్విన్‍ తెలుపలేక పోయాడు. ఈ సందర్భంగా డార్విన్‍ మత పెద్దల నుంచి, సంప్రదాయ వాదుల నుంచి అనేక బెదిరింపుల్ని, ఒత్తిళ్ళను, సవాళ్ళను ఎదుర్కొన్నాడు. ఈ సిద్ధాంతాన్ని దైవదూషణగా (Heresy) భావించిన కొన్ని దేశాలు, డార్విన్‍ సిద్ధాంతంపై నిషేధాన్ని విధించాయి. అమెరికా లాంటి దేశాల్లో నైతే ఏకంగా ‘డార్వినిజం’పై కోర్టులో కేసులు వేసారు. ఈ మధ్యనే ఈ కేసుల్ని కోర్టు అర్థరహితమని కొట్టివేసాయి.


ప్రపంచ వ్యాపితంగా మత వాదులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ సిద్ధాంతం, చారిత్రిక భౌతిక వాదానికి, మార్క్సిజానికి బీజాలు వేయగా, ప్రపంచ గమనానికి, మార్పుకు, చివరికి సోషలిస్టు విప్లవా లకు ఆయువుపట్టుగా మారడం గమనార్హం!


ప్రకృతివరణం అంటే..?
ప్రకృతివరణం అనే పదం నిజానికి డార్విన్‍ ప్రవచిత సిద్దాంతమే అయినా, ఈ కథనాల్లో దీన్ని యావత్‍ సౌర, భూమండలానికి వర్తింపజేయడం జరుగుతున్నది. అనగా బిగ్‍బ్యాంగ్‍ సిద్ధాంతం నుంచి సూర్యకేంద్ర సిద్దాంతం దాకా ఖగోళంలో నిగూఢమైన పదార్థాల స్థితిమార్పుల ద్వారానే జరుగుతున్నదని, ఇప్పటిదాకా గుర్తించిన మూడు పదార్థాలకు (ఘన, ద్రవ, వాయు) గల మూడు ధర్మాల (ద్రవ్యరాశిని కలిగి వుండడం, స్థలాన్ని ఆక్రమించడం, పీడనాన్ని కలుగ జేయడం) ఆధారంగానే సృష్టి లయలు జరుగుతున్నాయని, ఈ లయల కారణంగానే జీవం ఏర్పడి పరిణామ చెందిందని, ఇంకా చెందుతూనే వుందని దీని సారాంశం! ఇతిహాసాలు, మత గ్రంథాలు ప్రవచిస్తున్నట్లుగా, ఏ లయ కారుడు, లయకారిణి ఈ సృష్టికి మూలం కాదని ఈ సిద్దాంతం ఆధారాలతో నిరూపించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే, యావత్‍ ఖగోళమార్పులు ద్రవ్యనిత్యత్వ నియమం (Law of Conservation of Mass) కు లోబడే జరుగుతాయనేది ఓ నగ్న సత్యం!
నిజానికి డార్విన్‍ మొదట భౌగోళిక అంశాలపై దృష్టిసారించి, చివరికి జీవుల పుట్టుక గూర్చి ఆలోచించడం మొదలు పెట్టాడు. దీనికి ఆయనకు ప్రేరణ కల్గించినవి వివిధ జంతువుల శిలజాలు. తర్వాత జంతువులపై, పక్షులపై, కీటకాలపై, మొక్కలపై దృష్టిసారించి అవి బతికి బట్టగట్టే విధానంపై, సంతానాన్ని అందించి మనుగడ సాగించడంపై పరిశీనలు మొదలుపెట్టి, ఈ జీవులన్నీ ఒకే జీవినుంచి ఉద్భవించాయని తేల్చిచెప్పాడు. ఈ పరిణామ క్రమానికి భౌతిక, రసాయనిక పక్రియలతోపాటు, వాతావరణం దోహదపడడం జరిగింది. అందుకే ప్రకృతివరణం సార్వజనీనమైన విశాల ఆలోచనా దృక్పథం! అన్ని అంశాల్ని ఇది తడుముతూ, ఓ శాస్త్రీయ అవగాహ నను, భావజాలాన్ని దృఢంగా పెంపొందిస్తుంది. ఈ దృక్కోణంతోనే ఈ ట్యాగ్‍ను ఈ కథనాలకు ఓ పతాకంగా పెట్టడం జరిగింది. కాబట్టి, ఈ కథనంలో డార్వినిజంకు దారితీసిన పరిస్థితుల్ని చూద్దాం!


తండ్రి మాటను కాదని ప్రకృతి ఒడిలోకి…
చాలామంది శాస్త్రజ్ఞుల్లా కాకుండా, డార్విన్‍ది ఆర్థికంగా బాగున్న ఉన్నత కుటుంబం. తాత స్వేచ్ఛా మనస్తత్వంగల వైద్యుడు, కవి! శరీర అవయవ నిర్మాణ సూత్రాలు (The Laws of Organic Life) పుస్తక రచయిత. తల్లిదండ్రులిద్దరు వైద్యులు. 18 ఫిబ్రవరి 1809న జన్మించిన డార్విన్‍ 8 సం।।లకే తల్లిని కోల్పోయాడు. డార్విన్‍ను అక్కలు పెంచి పోషించారు. చిన్ననాటి నుంచే శరీర నిర్మాణశాస్త్రం గూర్చి, మానసికశాస్త్రం గూర్చి డార్విన్‍కు తండ్రి బోధించేవాడు. చదువుపై శ్రద్ధ చూపని డార్విన్‍ పాఠ శాలలో ఏడు సం।। (1818- 1825) అయిష్టంగా గడిపాడు. చర్చి కనుసన్నల్లో సాగే విద్య (Anglican) డార్విన్‍కు ఇబ్బందికరంగా వుండేది. నాటి ఇంగ్లీష్‍ పబ్లిక్‍ స్కూళ్ళలో విజ్ఞాన శాస్త్రాన్ని అమానవీయంగా (dehumanizing) భావించేవారు. ఇతర సబ్జెక్ట్సుకన్నా డార్విన్‍కు రసాయనశాస్త్రం పట్ల మక్కువగా వుండేది. ఇది గ్రహించిన ప్రధానోపాధ్యాయుడు డార్విన్‍ను నిత్యం నిందించగా తోటి విద్యార్థులు ‘gas’ అంటూ గెలి చేసేవారు.


పాఠశాలపట్ల విముఖత చూపిన డార్విన్‍ను 16వ ఏటనే ఎడన్‍బరో విశ్వ విద్యాలయంలో వైద్యవిద్యను అభ్యసించడానికి తండ్రి చేర్పించాడు. పేరుకు వైద్యవిద్యనే అయినా శాస్త్రవిజ్ఞానానికి ప్రాధాన్యత లేకపోగా, శస్త్రచికిత్సలన్నీ మత్తుమందు లేకుండా (నాటికి మత్తుమందు లేదు) జరిగేవి. రోగులు ఆ సందర్భంగా అరుపులు పెట్టడంతో డార్విన్‍కు బాధకలిగేది. ఈ విధానాన్ని మార్చాలని తలిచేవాడు. దీనికి తోడు వ్యవసాయ క్షేత్రాల్లో, రాచరిక కుటుంబాల్లో, బహిరంగ మార్కెట్లలో నల్లజాతీయుల్ని బానిసలుగా చూడడం డార్వినుకు మింగుడు పడేదికాదు. దీంతో వైద్యవిద్యను ఓ పీడకలగా భావించి రెండు సంవత్సరాలకే (1825-27) వదిలి వేసాడు. ఈ సమయంలో కూడా డార్విన్‍ ఆరుబయట తిరుగుతూ, ప్రకృతిని పరిశీలించేవాడు. పగలంతా రాళ్ళు వేడెక్కి రాత్రుళ్ళు చల్లబడడం ఎలా జరుగుతుందని ఆలోచించేవాడు. సముద్రపు ఒడ్డుకు వెళ్ళి రకరకాల గువ్వల్ని, గవ్వల్ని, శంఖుల్ని (shells) సేకరించి పరిశీలించేవాడు. మొక్కల రకాలను, వాటి మధ్యన గల సంబంధాల్ని పోల్చుకునేవాడు. పక్షుల ఆహార సేకరణ విధానాన్ని, వాటి ముక్కుల నిర్మాణాన్ని నిశితంగా చూసేవాడు. ఆయా ప్రాంతాల్లో లభించే ఖనిజాల్ని సేకరించి వాటితో చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. కీటకాలు పక్షుల్లా ఎగిరినా, శరీర ఆకృతి తేడాల్ని పోల్చుకునే వాడు. భూమికి, భూమి పుట్టుకకు (primitive Earth), జీవుల పుట్టుకకు గల సంబంధం గూర్చి తర్కించుకునే వాడు.


అదే సమయంలో ఎడిన్‍బరో మ్యూజియంలో పనిచేసే స్వేచ్ఛను పొందిన ఓ నల్ల జాతీయుడైన జాన్‍ ఎడ్మన్‍స్టోన్‍ (Edmonstone) పక్షుల నమూనాల్ని (specimen) లోపలి అవయవాల్ని తొలగించి (sttuffed), పక్షి ఆకారంతో (taxidermy) నిజమైన పక్షుల్లా ఎలా వుంచాలో డార్విన్‍కు చెప్పేవాడు. దీంతో డార్విన్‍కు పక్షలు ముక్కుల (beaks) నిర్మాణంను పోల్చుకునే అవకాశం ఏర్పడింది.


ఆశించిన విధంగా కొడుకు వైద్య విద్యను అభ్యసించక పోవడంతో, కనీసం తత్వశాస్త్రంలో నన్నా, ప్రావిణ్యున్ని చేస్తే మత బోధకుడిగా (clergy) నన్నా స్థిరపడతాడని భావించిన తండ్రి, డార్విన్‍ను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో (1828) బిఎ చదవమని చేర్పించాడు. ఇక్కడా తత్వశాస్త్రంకన్నా ప్రకృతి దృగ్విష యాలపట్ల డార్విన్‍ మక్కువను పెంచు కున్నాడు. అయినా 1831లో పదవ స్థానంలో నిలిచి పట్టభద్రు డయ్యాడు. ఇక్కడే డార్విన్‍ ఆలోచనలకు మరింత సహకారం లభించింది.


ఆలోచనలకు అంకురార్పణ :

చదువుపై ఎంత నిరాసక్తతనో, ప్రకృతి, భౌగోళిక విషయాలపట్ల డార్విన్‍కు అంత మక్కువ. దీంతో, ఆయన ఆలోచనలకు దగ్గరగల విద్యార్థులతో, ప్రొఫెసర్లతో పరిచయాలు పెరిగాయి. తోటి స్టూడెంట్స్ డార్విన్‍కు ఖండాంతర సైన్స్ (Continental Science) గూర్చి పరిచయం చేసారు. ఆంగ్లికన్‍ విద్యను వ్యతిరేకించే వారితో పరిచయం ఏర్పడింది. చర్చి భావించినట్లుగా మానవ శరీర ధర్మశాస్త్రం పవిత్రమైనదేమి కాదని, మానవ శరీరం కూడా ఇతర జంతువుల నిర్మాణం లాంటిదేనని వీరంతా నమ్మేవారు. మానవ మేధస్సు మత, వేదాంత శాస్త్రాలు విశ్వసించినట్లుగా ఓ బ్రహ్మపదార్థం కాదని, ఇది కూడా ఇతర వస్తువుల్లా, అవయవాల పదార్థాల (మూలకాల) సమ్మేళనమని వారు చర్చించేవారు. ఈ చర్చలు డార్విన్‍ ఆలోచనలకు చాలా దగ్గరగా వుండేవి.


ఈ సందర్భంగానే ఫ్రెంచ్‍ ప్రకృతి శాస్త్రవేత్త లామార్క్ శిష్యుడు పరిణామ సిద్దాంతవాది (evolutionist) రాబర్ట్ ఎడ్మండ్‍ గ్రాంట్‍ (Edmond Grant) డార్విన్‍కు పరిచయ మయ్యాడు. అప్పటికే ఈయన స్పాంజ్‍ల (Sponges) జీవ రసాయనిక అంశా లపై, సంబంధాలపై అవగాహన కల్గివున్నాడు. దీంతో డార్విన్‍ ఈయనను తన గురువుగా (ఎవఅ•శీతీ) భావించేవాడు. ఎడ్మండ్‍ వెన్నెముక లేని సముద్ర ప్రాథమిక జీవుల పెరుగుదల, సంబంధాల గూర్చి డార్విన్‍కు వివరిస్తూ, వీటి నుంచే ఇతర సంక్లిష్ట జీవులు ఉద్భవించాయని ఎడ్మండ్‍ స్పష్టీకరించేవాడు. ఈ విధంగా లభించిన జ్ఞానంతో సముద్రతలంపై వుండే లార్వాలపై, వాటి కాలనీల నిర్మాణంపై దృష్టిసారించిన డార్విన్‍, తాను గుర్తించిన అంశాల్ని విద్యార్థులతో చర్చించేవాడు. అలాగే వృక్ష పరిరక్షకుడైన జాన్‍ స్టీవెన్‍ హెన్స్లో (Steven Henslow)తో పరిచయం కాగా, 1831లో జంతు ప్రపంచంపై దూరదృష్టిగల రెవరెండ్‍ ఆడమ్‍ సెడ్జ్విక్‍ (Adam Sedgwick) డార్విన్‍ను భూగర్భశాస్త్ర పరిశీలన నిమిత్తం విజ్ఞాన యాత్రపై వేల్స్ (Wales)కు తీసుకెళ్ళాడు.
ఇలా పాఠశాల, వైద్య విద్యల సందర్భంగా డార్విన్‍ కోల్పోయిన విద్యావిషయాల్ని తిరిగి కేంబ్రిడ్జిలో పొందడంతో ఎనలేని సంతోషానికి గురైయ్యాడు. ఇదే సమయంలో ఓ ప్రొఫెసర్‍ డార్విన్‍ను ఒక ఓడ కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍కు పరిచయం చేసాడు. కాకతాలీయంగా జరిగిన ఈ పరిచయం డార్విన్‍ జీవిత దశనే కాకుండా, జీవుల పుట్టుక రహస్యాన్ని చేధించడానికి దారి తీయడం యాదృశ్చికం కాదా..!


అనుకోని అవకాశం – మలుపు తిరిగిన జీవితం!

మందకొడిగా సాగిన విద్యా భ్యాసంతో కేంబ్రిడ్జి క్రిస్టికాలేజి ఆవరణ డార్విన్‍ జీవిత గమనానికి నిచ్చెనలను వేసింది. అక్కడే పరిచయం చేయబడ్డ కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍ (Vice Admiral Robert FitzRoy), బ్రిటీషు రాయల్‍ నౌకకు అధిపతి. మొట్టమొదటి వాతావరణ అంచనా వేత్తగా (Metrologist)గా గుర్తింపు పొందిన ఫిట్జ్రాయ్‍ రాబోయే వాతావరణ సూచన (forecast) అనే పదాన్ని 1854లో మొదటిసారి పరిచయం చేసాడు. రాచరికపు నౌక హెచ్‍ఎంఎస్‍ (HMS) బీగల్‍ (Beagle)కు ఈయన కెప్టెన్‍గా వున్నాడు. భూ, భౌగోళిక పరిశోధనలకోసం 1831లో చేపట్టిన సముద్రయానంకు, ఓ ప్రకృతి శాస్త్రవేత్త వుంటే బాగుంటుందని భావించిన ఫిట్జ్రాయ్‍, శాస్త్రవేత్త కాకున్నా, కనీస అర్హతలేకున్నా, డార్విన్‍ పరిచయం కావడంతో, డార్విన్‍ను తనతో రమ్మని కోరాడు. అంతే, ఎగిరి గంతేసిన డార్విన్‍, తండ్రి వద్దంటున్నా యాత్రకు సిద్ధమయ్యాడు.


సంప్రదాయ ఆలోచనలకు సమాధి కట్టిన బీగల్‍ యాత్ర :

అనుకోకుండా వచ్చిన అవకాశంతో డార్విన్‍ బీగల్‍ నౌకను ఎక్కేసాడు. డార్విన్‍తో కలిసి మొత్తం 74 మంది సిబ్బందితో బీగల్‍ ఇంగ్లాండ్‍లోని డెవన్‍ పోర్టు (Devenport)లోని ప్లైమౌత్‍ సౌండ్‍ (Ply mouth Sound) ప్రదేశం నుంచి 27 డిసెంబర్‍ 1831లో బయలు దేరింది.


HMSఅనగా His or Her Majesty’s Ship అనే రాచరికపు హుందాగల అని అర్థం. బీగల్‍ అనగా నేలపై వాసన చూస్తూ వేటాడే వేటకుక్క అని! మొత్తంగా ఈ నౌక, భూ, సముద్ర వేటకు అనే అర్థంతో బయలుదేరిన రెండవ యాత్ర. అంతకు ముందు 1826-30 మధ్యన దక్షిణ అమెరికాలోని పాటగొనియా (Patagonia), టియెర్రాడెల్‍ ఫ్ల్యూగో (Tierradexl Fuego) ప్రాంతాల్ని చుట్టి వచ్చింది. ప్రస్తుత యాత్ర రెండు సంవత్సరా లని అనుకున్నా, అయిదు సంవత్సరాల పాటు సాగి, అక్టోబర్‍ 2, 1830న తిరిగి వచ్చింది. ఈ మొత్తం కాలాన్ని డార్విన్‍ సద్వినియోగం చేసుకొని ప్రపంచ ఆలోచన గతిని మార్చే డార్వినిజానికి మూల కారకుడయ్యాడు.


బీగల్‍ నౌక యాత్ర వాతావరణ, భూగోళ సంబంధిత పరిశీలనల కోసం కాబట్టి, వీరి వెంట దూరాల్ని కొలిచే సాధనమైన థియోడోలైట్‍ను, సమయాన్ని గుర్తించే కాలలేఖినిని (Chronometer), వాతావరణాన్ని కొలిచే భారామితిని (Barometer) తీసుకెళ్ళేవారు. డార్విన్‍ ప్రయా ణించిన సందర్భంగా మాత్రం అదనంగా తుఫానులను పసిగట్టే బ్యూఫోర్డ్ లేఖినిని (Beaufort Scale) కూడా ఉపయోగించారు. (వచ్చే సంచికలో యాత్రా లక్ష్యాల్ని చూద్దాం!)

డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *