సిరి ధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?
ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి?
(గత సంచిక తరువాయి)
మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు :
మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా సేవించడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం. పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ సేవనం. వందల కొద్దీ రసాయనాలు వేసిన – ప్యాక్ చేసిన ఆహారం కొనుక్కొని తినడం, తీవ్ర వత్తిడితో కూడిన జీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఎమోషన్స్, వ్యాపారంలో నష్టాలు, ప్రేమ వైఫల్యాలు క్లోమ గ్రంథిని ఆవహించిన ఇన్ఫెక్షన్లూ, యాంటి బయాటిక్ల విపరీత ఫలితాలు ఇందుకు చెప్పుకోదగ్గ కొన్ని కారణాలు.
గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ‘మధుమేహం’ మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. ఇది కళ్ళకూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హ•దయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడుకూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది.
‘మధుమేహం 2 రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతు లవడానికీ, దాన్ని దూరంగా ఉంచేందుకు పది సూత్రాలు :
- 8 నుండి 12.5% పీచు పదార్ధం లేదా ఫైబర్ కలిగిన సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా స్వీకరించడం. వరి, గోధుమలతో పీచుపదార్థం/ఫైబర్ 0.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి ఫాలిస్ చేస్తే పోతుంది. కానీ సిరి ధాన్యాలలో పీచు పదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటికి వరకూ పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూరటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటంలో సులువు తెలిసినట్లే.
- రోజుకొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి. ఇలా 5 ధాన్యాలనూ రోజుకొకటి తినాలి. కుటుంబంలో అందరికీ చిన్న నాటి నుండే అవగాహన పెంచాలి.
- రోజూ 50 నుండి 70 నిముషాలు నడవటం అవసరం.
- అధికంగా ఆకు కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపంలో తినడం.
- మునగ ఆకు, మునగ కాయలూ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామ కాయల వాడకం పెంచుకోవాలి. జామ, మామిడి ఆకుల కషాయాన్ని
ఉదయాన్నే త్రాగాలి. - పాల వాడకం మానివేయాలి. పెరుగు, మజ్జిగల రూపంలోనే స్వీకరించటం, కొని తినే ప్యాకెట్ ఆహారాలను దూరం పెట్టాలి.
- మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి. కట్టె గానుగ నూనెలు గాని, organic cold – pressed నూనెలు వాడుకోవాలి.
- మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి.
- వరి అన్నం, గోధుమలు, మైదాతో కూడిన పదార్థాలూ అతి తక్కువ వాడటం లేదా పూర్తిగా దూరంగా ఉంచాలి.
- HFCSపై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చక్కెరలు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవాలి.
- మధుమేహం 2- అందరికీ వచ్చేదే కదా అనే ‘అల్ప ధోరణి’ లేకుండా ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించడం వ్యాధి వస్తే సరైన ఆహారం, మారిన జీవనశైలితో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంటకీ రక్త పరీక్షలు కాకుండాHbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి.
మానవుడికి ఆనందం స్వేచ్ఛ నుండి లభిస్తుంది. స్వేచ్ఛ రోగాల నుండి, ఆరోగ్య సంబంధమైన కష్టాల నుండి పొందాల్సి ఉంది. మన దేశాన్ని పరిసరాల్ని, మన కుటుంబాన్ని ప్రేమిస్తూ, శ్రమ జీవి అయిన ప్రతి మానవుడికి డబ్బు సంపాదన కష్టం కాదు. తద్వారా ఆనందమూ సాధ్యమే. కానీ రోగాలు – ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు మన ఆనందాలను హరిస్తాయి.
ఎందుకంటే వైద్యానికి పోయి మరిన్ని పరీక్షలూ, మరింత సంక్లిష్టమైన అర్థంకాని రోగాల విషవలయంలో ఇరుక్కొని వ్యాధి నివారణ కనుచూపు మేరలో లేకుండా పోతున్నది. అశాంతికి కారణ మవుతోంది. అందుకే మన ఆరోగ్యాన్ని మేలైన ఆహారం ద్వారా మనమే పట్టు బిగించి సాధించుకోవాలి. పోలిష్ చేయని సిరి ధాన్యాలు మనకు శక్తిని ప్రసాదిస్తాయి.
పోలిష్ చేయని సిరి ధాన్యాల ద్వారా మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. రోగాలను దూరం పెట్టగలుగుతాం. అన్ని విధాలా మన బలాన్ని పెంచుకోగలుగుతాం.
అతి సామాన్యంగా ఈనాటి ఆహార వ్యవహారాల వల్ల వచ్చేది డయాబెటిస్ / చక్కెర / మధుమేహం వ్యాధి. ఇది ఒక చేదు ‘ఆరంభం’ మాత్రమే. క్రమంగా మన నేత్రాలు, మూత్ర పిండాలు, ఎముకలు, రక్త పీడనం (బీ.పి.), పునరుత్పత్తి మండలం, హృదయ ఆరోగ్యం – అన్నింటిపై దీని ప్రభావం ఉంటుంది. పలు రోగాలకు కారణమౌతుంది.
‘మన ఆహారం నుండి మన రక్తంలోకి వచ్చే గ్లూకోజు యొక్క నియంత్రణే మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది’ సిరిధాన్యాలే సమర్ధవంతంగా, సరైన ఫైబర్ కలిగి, మన రక్తంలోని గ్లూకోజు నియంత్రణ చేయగలవు. అతి తక్కువ ఫైబర్ లేదా, పూర్తిగా ఫైబర్ (పీచు పదార్థం) లేని మైదా, వరి అన్నం, ఈనాటి గోధుమలూ మన ఆరోగ్యానికి దోహదం చేయవు.
సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రం నుండి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటంలో సులువు తెలిసినట్లే. చక్కెర వ్యాధి, అధిక రక్తపోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తంలో పెరిగే ట్రైగ్లిసెరైడ్స్, కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీసులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ – ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
పోలిష్ చేయని సిరిధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జను ఉత్తేజపరచటం, రక్తశుద్ధి, థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, స్త్రీలలో ఆశించేPCOd, ఇతర పునరుత్పత్తి మండల సమస్యలు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.
వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు. సిరి ధాన్యాలతో పాటు కొన్ని రకాల ఆకుల కషాయాలను సేవించటం ద్వారా క్యాన్సర్ వంటి పెద్ద రోగాల బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది దైనందిన జీవనం గడుపడం సాధ్యమని డాక్టర్ ఖాదర్ తెలియజేశారు. ఎంతోమంది తిరిగి తమ జీవితాలను పునరుద్ధరించుకుంటున్నారు.
-ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు
డా।। ఖాదర్ వలి రచించిన
‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ నుంచి