సికింద్రాబాద్ 215 సంవత్సరాల మనుగడ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‍లో ప్రత్యేక గోష్టి
తురగా వసంత శోభ, కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్, వసామహా కన్సల్టెంట్స్, హైద్రాబాద్
ఇస్లామిక్ చాంద్రమాన కేలండర్ ప్రకారం పద్దెనిమిది వందల ఆరు (1806) సంవత్సరంలో మూడవ నిజాం సికందర్ రాజా బహదూర్ రబీ ఫుల్ అవ్వల్ ముస్లిం మాసంలో ఇరవై అయిదువ రోజున (25 th Rabi-Ul- Awwal)) హుస్సేన్ సాగర్‍కు ఉత్తరంగా ఉన్న నగరం పేరు సికిందరాబాద్‍గా ప్రకటిస్తూ ఒక ఫర్మాన్ జారీ చేశారు. అక్టోబర్ 31, 2021 నాటికి ఈ నగరం 215 సంవత్సరాల మనుగడను పూర్తి చేసుకుంది.
సికింద్రాబాద్ చరిత్ర ప్రకారం బ్రిటిష్ సైనికులకు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో నిజాంతో ఉండే విధంగా సబ్సిడియరీ అలయన్స్ ఆఫ్ బ్రిటిష్ అనుమతించింది. హుస్సేన్‍సాగర్ చెరువు ఉత్తరాన ఉన్న ఆవాసప్రాంతం మరింతగా పెరిగి విస్తరించింది. హైద్రాబాద్ దర్బార్ లో ఎనిమిదవ బ్రిటిష్ రెసిడెంట్ కెప్టెన్ థామస్ సై డెన్హామ్ నిజాంకు ఒక విజ్ఞప్తి చేస్తూ పద్దెనిమిది వందల ఆరులో లేఖ రాశారు. దేవుడి దయవల్ల ఈ ప్రాంతమంతా రెజిమెంట్లు కంటోన్మెంట్ వల్ల ఆవాస ప్రాంతంగా మారింది. అందువల్ల ఇప్పుడు దానికి మనం ఒక పేరు పెట్టాలి అని. అందుకు స్పందనగా జారీచేసిన ఫర్మానాలో మన రాష్ట్రానికి ఇంగ్లిష్ ప్రభుత్వానికి మత్స్య గల సమైక్యత సహకారం కారణంగా ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అని పేరు పెడుతున్నామని ఇదే పేరుమీద భవిష్యత్తులో కూడా ఈ నగరాన్ని వ్యవహరిస్తామని ఫర్మాన్‍లో పేర్కొన్నారు.
ఆ విధంగా హైద్రాబాద్‍కు జంట నగరం ఆవిర్భవించింది. బ్రిటిష్ సైన్యం ఆల్వాల్, తిరుమలగిరి ప్రాంతాలను ఆక్రమించి, బొలారం వైపుగా ముందుకి సాగింది. ఈ ప్రాంతాలకీ, హైద్రాబాద్‍కీ మధ్య ప్రస్తుతం MG రోడ్, కింగ్స్వే, జేమ్స్ స్ట్రీట్ అనుసంధానంగా ఉండేవి. లష్కర్, అంటే సైన్యంగా వ్యవహరించే సికింద్రాబాద్, స్వాతంత్య్రం అనంతర కాలంలో కంటోన్మెంట్‍గా, హైదరాబాద్ నగరంలో భాగంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్‍లో అనేక ప్రముఖ చర్చిలు, కాన్వెంట్లు, కేథడ్రల్స్, రైల్వే కట్టడాలతో పాటు, మహంకాళి ఆలయం, జాతరకి కూడా ప్రసిద్ధి చెందింది.
హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ విడిదిగా 1860లో నిర్మించిన రాష్ట్రపతి నిలయం, ప్రస్తుతం భారత రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా ఉంది. సికింద్రాబాద్‍లో పెరేడ్ మైదానం, క్లాక్ టవర్లు, సికింద్రాబాద్ క్లబ్, మోండా మార్కెట్, స్పానిష్ మాస్క్, జనరల్ బజార్ మార్కెట్, వైఎంసీఏ, పార్శీ టెంపుల్, పాత థియేటర్లు తమ పాత వైభవంతో కొనసాగుతున్నాయి. ఒక జీవన శైలికి సంకేతంగా నిలిచాయి. పారసీలు, ఆంగ్లో ఇండియన్స్ తమిళులు, మళయాళీలు, మార్వాడీలు ప్రధాన జనాభా వర్గాలుగా ఉన్న ఈ ప్రాంతం బహుళ సంస్కృతులకు ఆలవాలం. స్వామీ వివేకానంద తన ప్రసిద్ధ చికాగో యాత్ర ముందు ఇక్కడ మహబూబ్ కళాశాలలో ఉపన్యాసం చేశారు.
సికింద్రాబాద్ జంక్షన్ భారత్‍లోనే అతి పెద్ద స్టేషన్లలో ఒకటి కావడంతో పాటు దక్షిణ మధ్య రైల్వేకి కేంద్ర కార్యాలయంగా ఉంది. ఈ స్టేషన్‍ను 1874లో నిర్మించారు. కింద్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి – ప్రస్తుత గాంధీ ఆసుపత్రి స్థాపన – 1851లో జరిగింది. మోండా మార్కెట్ సమీపంలో ప్రస్తుత వారసత్వ కట్టడం అయిన ఓల్డ్ జైలు సముదాయం కూడా చెప్పుకోదగిందే. సర్ విన్ స్టన్ చర్చిల్ సికింద్రాబాద్‍లో బ్రిటిష్ సైన్యంలో భాగంగా పని చేయగా, సర్ రోనాల్డ్ రాస్ బిల్డింగ్ మరియు మలేరియాపై తన కీలక పరిశోధన సికింద్రాబాద్‍లోనే చేశారు.
రెండువేల ఆరు సంవత్సరంలో సికింద్రాబాద్ 200 ఉత్సవాన్ని జరుపుకున్నాం. CSIIT స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆరు నెలలపాటు ఎగ్జిబిషన్లు, పోటీలు, సెమినార్లు, ఉపన్యాసాలు మొదలైన కార్యక్రమాలు జరిగాయి. సికింద్రాబాద్ రన్ కూడా ఒక ఆకర్షణగా నిలిచింది. ప్రజలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ వ్యక్తిగత అనుభవాలను, సికింద్రాబాద్ పట్ల తమ అనుభూతులను పంచుకున్నారు. సికింద్రాబాద్ నగరం సంస్కృతి వాస్తు శిల్పం వారసత్వం ప్రజలు మళ్లీ మళ్లీ స్మరించుకుని, ఎంతగానో ఆనందించి ఉత్సవం చేసుకున్నారు.
నగరాల్లో ప్రదర్శనలు ఆవిర్భవించిన తేదీలను గుర్తుచేసుకుని ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అప్పుడే గతం తాలూకు మధుర స్మృతులు తరువాతి తరానికి పంపిణీ అవుతాయి. ముఖ్యంగా వేగంగా పెరుగుతున్న ప్రపంచం, భౌగోళిక సమీకరణ నేపథ్యంలో భూ గ్రహం చిన్నదైపోయి సరిహద్దులు డిజిటల్ జీవన శైలి నేపథ్యంలో కరిగిపోతున్న ఈ తరుణంలో ఇది మరింతగా ముఖ్యమైనది. సికింద్రాబాద్ తన చరిత్ర సంస్కృతి గుర్తింపు కల ఒక ప్రత్యేక నగరం. ఒక స్వతంత్ర ఆవాసం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‍లో ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేయడంతో సికింద్రాబాద్ కూడా ఇప్పుడు హైద్రాబాద్‍లో ఒక భాగంగా మారింది. నగరానికి సంబంధించిన తేదీలను గుర్తు చేసుకోవడం ద్వారా ప్రజలు చారిత్రాత్మక నగరాలకు సంబంధించిన తమ జ్ఞాపకాలను, అనుభవాలనూ, అనుభూతులనూ పంచుకునేందుకు తమ మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు వీలు పడుతుంది.
ఈ అవసరాన్ని గుర్తించి హైదరాబాద్ జంట నగరమైన సికిందరాబాద్ రెండువందల పదిహేను సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 31 అక్టోబర్ రోజు, నగరం వాస్తు, శిల్పం, చరిత్ర, వారసత్వ సంస్కృతి, ప్రజలు ప్రదేశాలు గుర్తింపు మొదలైన అంశాల పైన ఒక చర్చా కార్యక్రమం జరిగింది. సెంటర్ ఫర్ వీనస్, వసామహా కన్సల్టెంట్స్, ఆల్టర్నేటివ్ అర్బనిజం అండ్ మేనేజ్మెంట్ హైద్రాబాద్ సంస్థల ఆధ్వర్యంలో ఫస్ట్ స్టెప్ పరంపరలో భాగంగా సికింద్రాబాద్ పై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ కోర్సులో భాగంగా చేసే ప్రాజెక్టులను గురించి వివరించేందుకు ఫస్ట్ స్టెప్ ఒక వేదికగా ఏర్పాటైంది.
తేజ సాయి చంద్ర గట్టి సికింద్రాబాద్‍పై తన థీసిస్ ప్రెజెంటేషన్ చేసిన అనంతరం చర్చ జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్టులు శంకర నారాయణ, సికింద్రాబాద్ 200 ఉత్సవం సమన్వయకర్త ప్రొఫెసర్ నహీమా షానవాజ్ ఈ చర్చలో ప్యానెల్ స్పీకర్లుగా ఉండగా, కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్, వసామహా కన్సల్టెంట్స్కి చెందిన తురగా వసంత శోభ పరిచయం అందించారు. అర్బన్ నిపుణురాలు, AUMకి చెందిన అంజు మణికోత్ వ్యాఖ్యాతగా ఉన్నారు.
ఈ చర్చా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు విశ్వనాథ్ శిష్టా (మాజీ డైరెక్టర్ HMDA), మణికొండ వేదకుమార్ (ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్), అనురాధ రెడ్డి (ఇంటాక్ హైదరాబాద్), పంకజ్ సేథీ (చరిత్రకారుడు), అనంత్ మరింగంటి (హైదరాబాద్ అర్బన్ ల్యాబ్), సూర్యనారాయణ మూర్తి (క్షేత్ర కన్సల్టెంట్స్), జె కేదారేశ్వర (మాజీ డైరెక్టర్ పురావస్తు శాఖ) కల్పనా రాఘవేంద్ర (సెంటర్వీ ఫర్ వీనస్) సికింద్రాబాద్ నగరం ఉత్సవం ప్రాశస్త్యం, చారిత్రిక నగరాలను పరిరక్షించుకోవడానికి పద్ధతులు మొదలైన వాటి గురించి వివరించారు.
వసామహా కన్సల్టెంట్స్, ఆర్కిటెక్టస్, వారసత్వ పరిరక్షకులు-నగర ప్రణాళికా నిపుణులతో కూడిన సంస్థ. గత 25 సంవత్సరాలుగా ఈ సంస్థ సామాజిక, సాంస్క•తిక, పర్యావరణ రంగాల్లో కన్సల్టెన్సీ, డాక్యుమెంటేషన్, రీసెర్చ్, ప్రచురణలు, నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములతో కలిసి పని చేస్తోంది.
- దక్కన్‍న్యూస్ ఎ : 9030 6262 88