తురగా ఫౌండేషన్‍ – బాల చెలిమి


తురగా జానకీరాణి పిల్లల కథల పోటీలు జులై-సెప్టెంబర్‍ 2021
పోటీ ఫలితాల ప్రకటన


తురగా ఫౌండేషన్‍, బాలచెలిమి పత్రికతో కలిసి, జులై 2021లో తురగా జానకీరాణి పిల్లల కథల పోటీ ప్రకటించింది. చివరి తేదీ అయిన జులై 31కి మాకు 550కి పైగా కథలు అందాయి.
word,pdf.email,text, చేతి రాతతో రాసి ఫోటో తీసిన కథలు, పోస్టులో వచ్చినవి… ఇలా 550కి పైగా…. ఒక దఫా ఫిల్టరింగ్‍ చేయగా, అంటే రిపీట్‍ లు, నిబంధనలకు సరిపడనవి..అలా రకరకాల కారణాలతో… మొత్తం 315 మంది రచయితులు/రచయిత్రుల నుంచి వచ్చిన 370 కథలు తేలాయి. పోటీకి పంపిన వారిలో చేయి తిరిగిన writers ఉన్నారు. నిన్న మొన్న రాయడం ప్రారంభించి పేరు గడించిన వారు ఉన్నారు. లేత చిన్నారులు ఉన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలు, పల్లెల నుంచే కాదు, దేశంలో వివిధ ప్రాంతాలు, అమెరికా కెనడా వంటి దేశాల నుంచి కూడా entries వచ్చాయి.
550 కథలు.. మల్లెల వర్షం కురిసినట్లు మేము తడిసి, మురిసిపోయాం… అంత మంచి స్పందన వచ్చినందుకు ధన్యులం అయ్యాము.
తురగా ఫౌండేషన్‍ టీమ్‍ ఫిల్టర్‍ చేసి, కోడ్‍ చేసిన 370 కథలని మా జడ్జిలకి అందించగా, రెండు నెలలు కనబడకండి, కథలు చదవాలని వాళ్ళు మమ్మల్ని కోప్పడి, ఓపికగా చదివి ఫలితాలు అందచేశారు.
వారి సిఫారసుల మేరకే ఈ ఫలితాలు, ఈ బహుమతుల పంపకాలు. ఒకటి, రెండు, మూడు బహుమతులను ఇద్దరికి చొప్పున పంచడం వారి సిఫారసుల్లో ఒకటి.
గెలిచిన కథలే కాక, వేరే ఎంపిక చేసిన కథలను కూడా బాలచెలిమి పత్రికలో ప్రచురించడం జరుగుతుంది. వీలుంటే ఒక పుస్తక సంపుటి కూడా.


నగదు బహుమతి, సర్టిఫికెట్‍ అందచేస్తాం. ఎంతో కల్పన, ఇంకెంతో భాష, భావ వ్యక్తీకరణ, అన్నింటినీ మించి ఉత్సాహం, మా మీద అభిమానం… కథలు రాసి, మాకు పంపే శ్రమపడ్డ ప్రతి ఒక్కరికీ వెయ్యి నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ మేము పోటీలు పెడుతూనే ఉంటాం. మళ్ళీ మళ్ళీ మీరు రాయాలి. ఓపికగా ప్రతి కథ చదివి ఎంతో ఆలోచించి బహుమతులు సూచించిన మా జ్యూరీ సభ్యులకి ధన్యవాదాలు.


వీరే విజేతలు:
మొదటి బహుమతి: ఇద్దరు విజేతలు: 5,000 రూ. x 2
సూర్యుడు – బుజ్జిమొక్క: అనసూయ అడుసుమిల్లి- హైదరాబాద్‍
సా-భో : రవి శంకర్‍ ఉండి
రెండో బహుమతి: ఇద్దరు విజేతలు – =Rs. 3,500/- x 2
అడవిలో ఆట: వీ. రమేష్‍ కుమార్‍ , విజయనగరం
ఉమ్మడి సొత్తు : వల్లూరి శివ ప్రసాద్‍, గుంటూరు
మూడో బహుమతి: ఇద్దరు విజేతలు- = Rs . 2,500/- x 2
అమ్మ మాట: అనసూయ కన్నెగంటి, హైదరాబాద్‍
కాకిపిల్ల: కే వరలక్ష్మి, హైదరాబాద్‍
ప్రోత్సాహక బహుమతులు = Rs . 2000 x 3
చిన్నారి స్నేహం: హర్షశ్రీ, సిద్ధిపేట
చిట్టి: పీవీ పద్మావతి, ప్రకాశం జిల్లా
పరుల కోసం: రావూరి రమాదేవి, సూర్యాపేట

  • వసంత శోభ తురగా
    984803512

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *