తెలంగాణలో పుష్కలంగా వారసత్వ సంపద


ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హెరిటేజ్‍ పరిరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సు


ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHA), ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ ఆన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్ వింగ్‍ ఆఫ్‍ ఇండియా (ICOMOS), తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) అభివృద్ధి సంస్థ సహకారంతో హెరిటేజ్‍ పరిరరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సును ఏప్రిల్‍ 18న బేగంపేట్‍లోని హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍, యువజన సర్వీసులు, స్పోర్టస్, టూరిజం, సంస్కృతి అండ్‍ పురావస్తుశాఖ మంత్రిచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమ ప్రారంభోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హెరిటేజ్‍ వాక్‍ నిర్వహించే ప్రధాన లక్ష్యం వారసత్వం. సంస్కృతి గురించి భవిష్యత్‍ తరాలకు అవగాహన కల్పించడం వారసత్వాన్ని పరిరక్షించడంలో కూడా వారు బాధ్యత వహించాలని తెలియజేయలన్నారు. తెలంగాణాలోని అన్ని ప్రదేశాలలోనూ వారసత్వ సంపద పుష్కలంగా ఉందని, ప్రధానంగా గోల్కొండ, చార్మినార్‍, పైగా ప్యాలెస్‍, చౌమహల్లా ప్యాలెస్‍ మొదలైనవి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు. రామప్పకు వారసత్వ హోదా లభించడం తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్‍ గుప్త చైర్మన్‍, టీఎస్‍టీడీసీ మాట్లాడుతూ చార్మినార్‍, గోల్కొండ, కుతుబ్‍షాహీ సమాధులు, భువనగిరి కోట, కృష్ణా, గోదావరి నదులు వంటి అనేక వారసత్వ ప్రదేశాలు ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. అలాగే భూదాన్‍ పోచంపల్లి గ్రామం కూడా ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రదేశంగా ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదాను పొందిందని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని, పర్యాటకుల సౌకర్యార్థం యాదాద్రిలో హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‍ సెంటర్లను 250 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. టీఎస్‍టీడీసీ సహాయంతో నాగార్జున సాగర్‍ వద్ద బుద్ధవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అభివృద్ధి చేస్తోందన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలకు చేరుకోవడానికి ఏసీ బస్సులు, స్లీపర్‍ బస్సులను పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడానికి టీఎస్‍టీడీసీ శాఖ యోచిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి టీఎస్‍టీడీసీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని, ఈ దిశగా హెరిటేజ్‍ వాక్‍లు, గెట్‍ టు గెదర్‍లు, సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనను ఆయన స్వాగతించారు. అర్బన్‍ & రీజినల్‍ ప్లానర్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ చైర్మన్‍, పర్యావరణ ప్రేమికులు మణికొండ వేదకుమార్‍ మాట్లాడుతూ.. యునెస్కో 1983 ఏప్రిల్‍ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగాను, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లో ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్ ఎండీ మహ్మద్‍ సఫీయుల్లా, కన్జర్వేషన్‍ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, హెరిటేజ్‍ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‍ నారాయణ, ఎండీ, టీఎస్‍టీడీసీ మనోహర్‍రావు, నగరంలోని చరిత్రకారులు, స్కూల్‍ ఆఫ్‍ ఆర్కిటెక్చర్‍ & ప్లానింగ్‍, జెబీఆర్‍ ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍ మొయినాబాద్‍, వైష్ణవి ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍, అరోరా ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍, శ్రీ వెంకటేశ్వరా కాలేజ్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ కాలేజ్‍ తదితర కళాశాలలు, ఆక్స్ఫర్ట్ గ్రామర్‍ స్కూల్‍ హిమాయత్‍నగర్‍ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


హైదరాబాద్‍ నగరంలో ప్రతి వారం హెరిటేజ్‍ వాక్‍
నగరంలోని చారిత్రక కట్టడాలను విశేషాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి వారం హెరిటేజ్‍ వాక్‍లు నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు మున్సిపల్‍, పరిపాలన శాఖ స్పెషల్‍ చీఫ్‍ సెక్రటరీ, ఎన్‍ఐయుఎం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‍ జనరల్‍ అర్వింద్‍ కుమార్‍ తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, ఐకోమోస్‍ సహకారంతో దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ఆధ్వర్యంలో చార్మినార్‍ వద్ద హైదరాబాద్‍ హెరిటేజ్‍ వాక్‍ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అర్వింద్‍ కుమార్‍ జెండా ఊపి ఈ వాక్‍ను ప్రారంభించారు. ఈ వాక్‍ చార్మినార్‍ (ముర్గి చౌక్‍) నుంచి కిల్‍వత్‍ వరకు కొనసాగింది. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా చుడీ బజార్‍ పునరుద్ధరణ పక్రియకు సంబంధించి అబల్‍ అంబా గ్రూప్‍ డిజైన్‍ చేస్తోందని చెప్పారు. సర్దార్‍ మహల్‍ చరిత్రకు సంబంధించిన కథలను శిల్పాల రూపంలో రూపొందించడం ద్వారా ఆర్టిస్ట్ విలేజ్‍గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి వారం నగరంలోని హెరిటేజ్‍ వాక్‍ నిర్వహణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాక్‍లో పాల్గొనే వారికి జిహెచ్‍ఎంసి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా స్నాక్స్, మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పారు. డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ చైర్మన్‍ ఎం. వేదకుమార్‍ మాట్లాడుతూ యునెస్కో 1983లో ఏప్రిల్‍ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించిందని అప్పటి నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్‍లో ప్రతిఏటా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వారసత్వ పరిరక్షణకు మున్సిపల్‍ శాఖ స్పెషల్‍ చీప్‍ సెక్రటరీ అర్వింద్‍ కుమార్‍ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న 30 మెట్ల బావులు, గేట్‍వేస్‍, క్లాక్‍ టవర్స్, టూంబ్స్, మెహబూబ్‍ చౌక్‍, మిరియాలం మండి, మొజాంహీ మార్కెట్‍, ముర్గీ చౌక్‍, పైగా టూంబ్స్, సెవన్‍ టూంబ్స్, సీతారాంభాగ్‍ టెంపుల్‍, చర్చిలు, బార్‍ కమానులు తదితర వాటిని పునరుద్ధరించడం పట్ల వేదకుమార్‍ హర్షం వ్యక్తం చేశారు. ఈ వాక్‍లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‍ ఇండియా సూరిడెండింట్‍ డా. స్మిత ఎస్‍ కుమార్‍, టీఎస్‍టీడీసీ ఎండీ బి. మనోహర్‍రావు, ఐకోమోస్‍ ఇండియా సౌత్‍జోన్‍ కన్వీనర్‍ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తితో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *