పర్షియన్‍ శైలిలో నిర్మించిన అద్భుతకట్టడం ఫతేపూర్‍ సిక్రీ

UNESCO చే 1986లో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు

బులంద్‍ దర్వాజా లేదా ‘‘గొప్ప ద్వారాన్ని’’ 16వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్‍ పై అక్బర్‍ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన రాతి నిర్మాణం సాధారణ పర్షియన్‍-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్‍ సిక్రీ నగరానికి ఉత్తర ద్వారంగా ఉంది. బులంద్‍ దర్వాజాపై పర్షియన్‍ భాషలో 1601లో గుజరాత్‍ పై అక్బర్‍ విజయాన్ని తెలియజేసే శాసనం ఒకటి ఉంది. ద్వారం పై ఉన్న ఈ పర్షియన్‍ శాసనం అక్బర్‍ విశాలహృదయాన్ని తెలియజేస్తుంది. విభిన్న సంప్రదాయాలు, సంస్కృతుల ప్రాధాన్యతను చాటి చెప్పిన ఉదాహరణగా దీనిని చరిత్రకారులు తరచుగా ఉదహరించేవారు. ఈ విశాలమైన, దృఢమైన ఇసుకరాయి నిర్మాణం అన్ని వైపులా ద్వారాలతో ఒక పెద్ద సమాధిని పోలి ఉంటుంది. ప్రశాంతమైనదృశ్యాలను, గోడలపై ఉన్న అందమైన కళను చూసి ఆనందించడానికి అనేక మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు. బులంద్‍ దర్వాజాను ఎరుపు, పసుపు ఇసుక రాయితో నిర్మించి, తెలుపు, నలుపు చలువరాయితో లోపలి భాగాలను చెక్కారు. ఒక సౌష్టవమైన ప్రణాళికను కల్గిన అందమైన ఈ కోట బురుజు కట్టడంపైన స్తంభాలు, గొడుగులు ఉన్నాయి.


ఫతేపూర్‍ సిక్రీ ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం, నగరపాలితము కూడా. ఈ నగరాన్ని మొగల్‍ చక్రవర్తి అక్బర్‍ 1569లో స్థాపించాడు. అక్బర్‍ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధాని.


చిత్తోర్‍ రాన్తంభోర్‍ మీద విజయం సాధించిన తరువాత అక్బర్‍ తన రాజధానిని ఆగ్రా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్రీ రిట్జ్ ప్రదేశానికి తరలించాలని అనుకున్నాడు. సుఫీ సన్యాసి సలీం చిష్టి గౌరవార్ధం సిక్రీ రిట్జ్ వద్ద నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అక్బర్‍ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు. రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు, ప్రైవేట్‍ క్వార్టర్లు, ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలతో కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అక్బర్‍ చక్రవర్తి ఆ నగరానికి ఫతేహబాదు అని నామకరణం చేసాడు. అరబీక్‍ పూర్వీకమైన పర్షియన్‍ భాషలో ఫతేహ్‍ అంటే విజయం అని అర్ధం. తరువాత అది ఫతేపూర్‍ సిక్రీగా పిలువబడింది. మొగలుల సంరక్షించ బడుతున్న ప్రముఖ నిర్మాణాలలో ఫతేపూర్‍ సిక్రీ ఒకటి.


సమకాలీన చరిత్రకారులు ఫతేపూర్‍ సిక్రీ నిర్మించడానికి అక్బర్‍ చాలా ఆసక్తి చూపాడని నిర్మాణ రూపకల్పన, నిర్మాణశైలికి కూడా అక్బరు సూచనలు ఇచ్చాడని భావించారు. వారి పూర్వీకుడైన తైమూరును కీర్తిని స్పురింపజేసేలా పర్షియన్‍ శైలిలో అద్భుతమైన సభామంటపాల నిర్మాణానికి రూపకల్పన చేయబడింది. ఈ కోటను నిర్మించడానికి ఎంపికచేయబడిన భూభాగం సంపూర్ణ భారతీయత సంతరించుకున్నది. ఫతేపూర్‍ సిక్రీ పరిసరప్రాంతాలలో లభిస్తున్న ఇసుకరాయి ఈ భవన నిర్మాణానికి తోడ్పడడంతో భవనసముదాయం మొత్తం ఎర్రరాళ్ళతో నిర్మించబడింది. రాజభవన సముదాయంలో పలు ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఈ ప్రవేశద్వారాలన్నీ రేఖాగణిత ఆకారంలో రూపకల్పన చేయబడ్డాయి. ఈ డిజైన్‍ నమూనా అరబ్‍, మధ్య అసియా గుడారాల నిర్మాణాల నుండి గ్రహించబడ్డాయి. ఫతేపూర్‍ సిక్రీలో ఉన్న స్మారక నిర్మాణాలు పూర్తిగా రెండు విభిన్న భూభాగాల భవననిర్మాణశైలులను సమగ్రపరచేలా రూపకల్పన చేసిన అక్బర్‍ చక్రవర్తి మేధోశక్తికి ప్రత్యక్ష నిదర్శనం.


చరిత్ర
ఈ సుందర రాజభవనం సముదాయం అది నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కొద్ది కాలానికే 1885లో విడిచిపెట్టబడింది. ఈ రాజభవన సముదాయానికి నైరుతిదిశలో సమీపంలో రాజపుత్రులు ఉన్నందున, నీటి ఎద్దడి కారణంగా ఈ రాజభవన సముదాయం విడిచిపెట్టబడింది. రాజపుత్రుల సామీప్యం కారణంగా అప్పుడప్పుడూ ఘర్షణలు ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడడం కూడా ఈ భనాన్ని విడిచిపెట్టడానికి ఒక కారణం. తరువాత లాహోరుకు మార్చబడిన రాజధాని సామ్రాజ్యంలో నెలకొన్న అస్థిరత కారణంగా 1598 నాటికి తిరిగి ఆగ్రాకు చేరింది. ఆగ్రాచేరిన తరువాత అక్బర్‍ చక్రవర్తి ద•ష్టి దక్షిణ భూభాగం వైపు మళ్ళింది. అయినప్పటికీ 1601లో స్వల్పకాలం నివసించడం మినహా అక్బర్‍ చక్రవర్తి ఫతేపూర్‍ సిక్రీకి తిరిగి పోలేదు. తరువాత ఈ రాజభవన సముదాయాన్ని ఆక్రమించుకున్న మొగల్‍ చక్రవర్తి మహమ్మద్‍ షా ఈ రాజభవనం సముదాయం మీద కొంత కాలం (1719-1748) ఆధిపత్యం వహించాడు. ఆయన అధికారులలో ఒకరైన సయ్యద్‍ హుసైని అలీ ఖాన్‍ భాషా (సయద్‍ సోదరులలో ఒకరు) 1720లో ఇక్కడ హత్యకు గురి అయ్యాడు. ప్రస్తుతం రెండు కిలోమీటర్లు పొడవు ఒక కిలోమీటర్‍ వెడల్పైన ఈ రాజభవనం సముదాయంలో సగభాగానికి పైగా నిర్జనంగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ సుందర రాజభవనం సముదాయం వెంట మూడు వైపులా సుమారు అయిదు మైళ్ళ పొడవున గోడలు నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ రాజభవన సమూహాలే కాక మరికొన్ని భవనాలు కూడా ఉన్నాయి. పాతనగరంలో నౌబత్‍ ఖానా వద్ద ఉన్న వీధులు శిథిలాలు మినహా మిగిలిన భవనాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. వీటిలో ఆగ్రారోడ్‍ ప్రవేశం సమీపంలోని ‘‘డ్రం హౌస్‍’’ ఒకటి. రాజభవనసమూహాల పడమటి కొసలో అధునిక నగరం ఉంది. 1865 నుండి 1904 వరకు అది పురపాలక వ్యవస్థ నిర్వహణలో ఉంటూ వచ్చింది. 1901 నాటికి నగర జనసంఖ్య 7,117. దీర్ఘకాలం నుండి ఈ ప్రదేశం శిల్పకారులకు, మేస్త్రీ పనివారికి నివాస స్థలంగా ఉంటూ వస్తుంది. అక్బర్‍ చక్రవర్తి సమయంలో ఈ ప్రదేశం ఉన్ని దుస్తులకు, పట్టు వస్త్రాల తయారీకి ప్రసిద్ధిచెంది ఉంది.


ఫతేపూర్‍ సిక్రీ నిర్మాణశైలి
ఫతేపూర్‍ సిక్రీ శిలామయమైన ప్రదేశంలో నిర్మితమై ఉంది. ఈ రాజభవన సమూహాల వెడల్పు 3 కిలోమీటర్లు, వెడల్పు 1 కిలోమీటర్‍ ఉండగా రాజభవన సమూహాలు చుట్టూ ప్రదేశం మొత్తం వైశాల్యం 6 కిలోమీటర్లు. ఈ రాజభవన సమూహాల మూడు వైపులా గోడలు నిర్మించబడి ఉండగా నాలుగవ వైపు మాత్రం ఒక సరసు ఉంది. ఈ రాజభవన సమూహాల రూపశిల్పి తుహీర్‍ దాసు. నిర్మాణానికి భారతీయ విధానాలు పాటించబడ్డాయి. ఫతేపూర్‍ సిక్రీ రాజభవన సమూహాల నిర్మాణంలో పలువిధ నిర్మాణశైలిలో శిక్షణ పొందిన శిల్పులు పాల్గొన్నారు. ముఖ్యంగా గుజరాత్‍, బెంగాల్‍ శిల్పులు ఇందులో పాల్గొన్నారు. అందువలన రాజభవన సమూహాల నిర్మాణంలో దేశీయమైన శిల్పులు పాల్గొన్నారు. జైన, హిందూ శిల్పులు ఇస్లాం శిల్పులతో చేయి చేయి కలిపి ఈ రాజభవన సమూహాల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫతేపూర్‍ సిక్రీ రాజభవన సమూహాలలోని అన్ని భవనాలకు ప్రాంతీయంగా లభించిన సిక్రీ అనే ఎర్రరాయి వాడబడింది. ఈ భవనాల ద్వారాలు ఐదు మైళ్ళ గోడతో అనుసంధానించబడి ఉన్నాయి. అవి వరుసగా డిల్లీ ద్వారం, లాల్‍ ద్వారం, ఆగ్రా ద్వారం, బీర్బల్‍ ద్వారం, చంద్రపాల్‍ ద్వారం, గ్వాలియర్‍ ద్వారం, తెహ్రా ద్వారం, చోర్‍ ద్వారం, అజ్మీర్‍ ద్వారం.


చూడవలసిన ప్రదేశాలు బులంద్‍ దర్వాజా
బులంద్‍ దర్వాజా మసీదు దక్షిణ దిశలో ఉంది. ఫతేపూర్‍ సిక్రీ వద్ద ఉన్న జమా మసీద్‍ వెలుపలి నుండి చూడడానికి 550 మీటర్ల ఎత్తైన అద్భుతమైన భవనం. అయినప్పటికీ లోపలకు ప్రవేశిస్తే మనిషి ఎత్తు ఉండేలా మలచబడిన అద్భుతమీ నిర్మాణం. 1556-1577 వరకూ ఈ మసీదు నిర్మాణం కొనసాగింది. మసీదు నిర్మాణం పూర్తి అయిన ఐదు సంవత్సరాల తరువాత ద్వారం విక్టరీ ఆర్చుగా నిర్మించబడింది. అక్బర్‍ గుజరాత్‍ యుద్ధంలో సాధించిన విజయం జ్ఞాపకార్ధం ఈ ద్వారం నిర్మించబడింది. ఈ ద్వారం ఇరువైపులా వ్రాయబడిన రాతలలో ఒకటి ‘‘ఇసా (ఏసు) సన్‍ ఆఫ్‍ మేరీ సెయిడ్‍ (మేరీ కుమారుడు చెప్పాడు)’’ మాట ఒక వంతెన. దానిని దాటాలి, కాని ఇల్లు కట్టకూడదు. మధ్య పోర్టికోలో మూడు ఆర్చ్ ద్వారాలు ఉంటాయి.


జమా మసీదు
జమా మసీదు రాజభవన సమూహాలలో ఇది మొదటిదని భావించవచ్చు. మసీదులోని కుడ్యాల వ్రాతల ద్వారా 1571-1572లో మసీదు నిర్మాణం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. మసీదు నిర్మాణం పూర్తి అయిన ఐదు సంత్సరాల తర్వాత బులంద్‍ గేట్‍ నిర్మించబడింది. జుమా మసీదు ఇండియన్‍ మసీదు శైలిలో నిర్మించబడింది.


సలీం చిష్టి సమాధి
సూఫీ సన్యాసి సలీం చిష్టి పాలరాతి సమాధి (1478-1572). ఇది జుమా మసీదు ఆవరణలో నిర్మించబడిన ఒక అంతస్తు ఎత్తున్న నిర్మాణం. ఇది లోపల సెయింట్‍ సమాధి మొజాయిక్‍తో అలంకరించబడిన చెక్క పందిరి క్రింద ఉంది. చుట్టూ చెక్కబడిన జాలీలతో సందర్శకుల సందర్శనార్ధం ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. క్లిష్టమైన రేఖాగణిత రూపకల్పనతో రాతి తెరలు కట్టిన దక్షిణ ద్వారం. సమాధి ఇతర అద్భుతమైన లక్షణాలు పిట్ట గోడ చుట్టూ ఏటవాలు చూరు. సమాధి ఎడమ, తూర్పున, షేక్‍ బద్రుద్దీన్‍ చిష్టి కుమారుడు, జహంగీర్‍ పాలనా కాలంలో మొఘల్‍ సైన్యాధ్యక్షుడు అయిన షేఖ్‍ సలీం చిష్తి, మనమని ఎరుపు ఇసుకరాయి సమాధి ఉంది. సమాధి గోపురం, ముప్పై ఆరు చిన్న గోపుర చత్రీలు, షేక్‍ సలీం చిష్టీ వారసుల సమాధులు ఉన్నాయి.


దివాన్‍-ఐ-ఆం
రాజభవ సముదాయంలో సభామంటపం పేరు దివాన్‍-ఐ-ఆం. రాజు కొలువుతీర్చడానికి నిర్మించబడే ఇటువంటి సభామండపాలను అన్ని రాజభవనాలలో చూడవచ్చు. విశాలమైన పలు ప్రవేశద్వారాలు కలిగిన దీర్ఘచతురస్రాకార భవనం ఇది. సభామండపం ఎదుట విశాలమైన ఖాళీ ప్రాంగణం ఉంటుంది. దివాన్‍-ఐ-ఆం ఆగ్నేయం అరియు టర్కిక్‍ సుల్తాన్‍ గృహానికి పక్కన టర్కిక్‍ స్నాన ఘట్టాలు నిర్మించబడి ఉన్నాయి.


దివాన్‍-ఐ-ఖాస్‍
దివాన్‍-ఐ-ఖాస్‍ లేక సభా మండపం. విశాలమైన భవనం. ఈ సభామండపం మూల స్థంభం అద్భుత శిల్పచాతుర్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది. నలుచదరపు ఆధారపీఠంతో ఎనిమిది కోణాలు కలిగిన స్తంభం. రెండూ పూలతో మలచబడి అలంకరించి ఉన్నాయి. ఇక్కడ అక్బర్‍ వివిధ మతాలకు చెందిన మతప్రతినిధులతో కలిసి మతసంబంధిత విశ్వాసాలను చర్చిస్తుంటారు. అలాగే కొన్ని సమయాలలో రాజ్య ప్రజలను కూడా ఇక్కడ కలుసుకుంటాడు.


ఇబాదత్‍ ఖానా
ఇబాదత్‍ ఖానా (హౌస్‍ ఆఫ్‍ వర్షిప్‍) అనేది సమావేశ మండపం. 1575లో అక్బర్‍ చక్రవర్తి దీనిని నిర్మించాడు. ఇక్కడ అక్బర్‍ చక్రవర్తి తీన్‍-ఇ-లాహి అనే కొత్త మతం స్థాపించాడు.


అనుప్‍ తలాయో
అనుప్‍ తలాయో అనేది అలంకృత ఈతకొలను. ఈతకొలను మద్యలో వేదిక ఉంది. వేదికను చేరడానికి నాలుగు వంతెనలు ఉన్నాయి. ఇక్కడ క్వాబా (స్వప్నమందిరం, అక్బర్‍ నివాసం, పాంచ్‍ మహల్‍, దివాన్‍-ఇ-ఖాస్‍ (సాధారణ ప్రజల కూటమి), ఐదు అంతస్తుల భవనం, అంఖ్‍ మిచౌలి, ది ఆస్ట్రాలజీస్‍ స్థానం, ఆగ్నేయ మూలలో పచ్సి కోర్ట్ ఉన్నాయి.


హుజరా-ఐ-అనుప్‍ -తలాయో
హుజరా-ఐ-అనుప్‍ -తలాయో అనేది అక్బర్‍ ముస్లిం భార్య మందిరం. అయినప్పటికీ ఇది చిన్నదిగా ఉండడం పెద్ద వివాదాంశం అయింది.
మరియం-ఉజ్‍-జమానీ-భవనం
మరియం-ఉజ్‍-జమానీ-భవనం అనేది అక్బర్‍ భార్య మరియం-ఉజ్‍-జమానీ కొరకు నిర్మించబడిన భవనం. ఇది గుజరాతీ శైలిలో నిర్మించబడిన భవనం. ఏకాంతంగా నివసించడం కొరకు విశాలమైన ప్రాంగణంతో ప్రత్యేకశ్రద్ధతో నిర్మించబడిన భవనమిది.


నౌబత్‍ ఖానా
నౌబత్‍ ఖానాను నక్కర్‍ ఖానా (డ్రం హౌస్‍) అని కూడా పిలువబడుంది. ఇక్కడ ఢంకా వాయిస్తూ మహారాజు ప్రవేశించే ముందు రాజు వస్తున్నాడని ప్రకటించ బడుతుంది. ఇది హతీ పోల్‍ ద్వారం లేక ఎలిఫెంట్‍ గేట్‍ ముందుగా ఉంటుంది. రాజభవన సమూహం దక్షిణద్వారం రాజకుటుంబీకులు ప్రవేశించడానికి ప్రత్యేకించబడింది.
పచిసి కోర్ట్
ఆధునిక లూడో గేం వంటి ఆట కొరకు ప్రత్యేకించి రూపొందించిన ప్రదేశం. ఆటలో కాయలకు బదులు మనుషులు ఉంటారు.
పాంచ్‍ మహల్‍
పంచ్‍ మహల్‍ అంటే ఐదు అంతస్తుల భవనం. ఒకే కప్పు కింద ఉండే భవనం ఇది. పై అంతస్తులకు చేరే వేళకు కప్పు సైజు చిన్నదిగా ఔతూ ఉంటుంది. భవనం పలు విభాగాలుగా విభజించబడి ఉంటుంది. దీనిని అంతఃపుర స్త్రీల కొరకు నిర్మించారు. ఈ భవనం మొత్తం 176 విభాగాలు విభజించబడి ఉంది.


బీర్బల్‍ గృహం
అక్బర్‍ అభిమానపాత్రుడైన బీర్బల్‍ నివాస గృహమిది. ఇతర భవనాలు తక్సల్‍ (పుదీనా), ‘దఫ్తర్‍ ఖానా (రికార్డస్ కార్యా లయంలో), కార్ఖానాలు (రాజ కార్ఖానాలో), ఖజానా (ట్రెజరీ), టర్కిక్‍ శైలి స్నానాలు, దరోఘా యొక్క క్వార్టర్స్, లాయం, కారవాన్‍ సారాయ్‍, హకీం యొక్క త్రైమాసిక తదితరాలు ఉన్నాయి.
పాలనా వ్యవస్థ
ఆగ్రా జిల్లలోని 15 ప్రధాన కార్యాలయాలలో ఫతేపూర్‍ సిక్రీ ఒకటి. దీనిలో 52 గ్రామపంచాయితీలు ఉన్నాయి. ఫతేపూర్‍ సిక్రీ ఒక ఫార్లమెంటు నియోజకవర్గం. అలాగే 5 విధాన్‍ సభ స్థానాలున్నాయి. విభాగాలు: అగ్రా రూరల్‍, ఫతేపూర్‍ సిక్రీ, ఖెంఘర్‍, ఫతేహాబాదుజి, భాజి.
అగ్రా జిల్లాలోని ఫతేపూర్‍ సిక్రీ వద్ద ఉన్న 12 గ్రామాలు సిసోదియా రాజపుత్రులకు చెందినవి. దౌలతాబాదు, నయావాస్‍, సథ, కొరై, బ్యారా, ఉండేరా, కచోరా, సింగపూర్‍, నిద్యాపూర్‍, ఒనెరా, అరుణ.


ప్రయాణ వసతులు
ఫతేపూర్‍ సిక్రీ అగ్రా నుండి 39కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలో ఉన్న విమానాశ్రయం ఆగ్రా విమానాశ్రయం (ఆగ్రాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖజారియా విమానాశ్రయం). సమీపంలోని రైల్వే స్టేషను ఫతేపూర్‍ సిక్రీకి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఫతేపూర్‍ సిక్రీ రైల్వేస్టేషను. ఆగ్రా, పరిసర కేంద్రాలతో చక్కగా రహదారి మార్గంతో అనుసంధానించబడి ఉంది.
రక్షణ మరియు నిర్వహణ అవసరాలు
1986లో యునెస్కోచే గుర్తింపబడిన ఫతేపూర్‍ సిక్రీ నిర్వహణను ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా నిర్వహిస్తుంది. ఆస్తి యొక్క చట్టపరమైన రక్షణ మరియు దాని చుట్టూ ఉన్న నియంత్రిత ప్రాంతంపై నియంత్రణ, పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాలు (AMASR) చట్టం (1958), దాని నియమాలు (1959), సవరణ, ధ్రువీకరణ చట్టం (2010)తో సహా చట్టం ద్వారా ఉంటుంది. ఆస్తి మరియు బఫర్‍ జోన్‍ యొక్క మొత్తం నిర్వహణకు సరిపోతుంది. అదనంగా, గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ ఆఫ్‍ ఇండియా ఆదేశాలు జారీ చేయడం వల్ల స్మారక చిహ్నాల రక్షణ, పరిరక్షణలో ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియాకు సహకరిస్తుంది.


ఆర్కియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా తన నిర్వహణ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ, ఇంటిగ్రేటెడ్‍ మేనేజ్‍మెంట్‍ ప్లాన్‍కు తగిన సందర్శకుల నిర్వహణ, అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మార్గదర్శకాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇది అన్నింటిలో ముందుగా అవసరం.


ఫెడరల్‍ ప్రభుత్వం అందించిన నిధి ఫతేపూర్‍ సిక్రీ స్మారక చిహ్నాల మొత్తం పరిరక్షణ, సంరక్షణ, నిర్వహణకు సరిపోతుంది. ఇది ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా యొక్క ప్రాంతీయ కార్యాలయం యొక్క మార్గదర్శకత్వంలో పని చేసే ఒక కన్జర్వేషన్‍ అసిస్టెంట్‍ యొక్క ఉనికికి మద్దతు ఇస్తుంది. ఆస్తి కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.


-సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *