వన్య సంరక్షణ


పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.


పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.


ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు – 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి – వేదకుమార్‍ మణికొండ


బాల్యం నుండి ప్రక•తి ఒడిలాంటి పల్లెటూర్లో పెరిగి బతుకుదెరువు కోసం పట్నం చేరాను. అమ్మానాన్నలకు నేను ఒక్కగా నొక్క కూతుర్ని. అందుకే వారిని కూడా నాతోపాటు తీసుకువచ్చాను. సిటీ దగ్గర్లో ఒక ఇల్లు కొన్నాను. చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇప్పుడిప్పుడే ఇండ్లు కడుతున్నారు. అమ్మానాన్నలు ఇంట్లోనే ఉండే వారు. నేను ఉద్యోగానికి వెళ్లి వచ్చేదాన్ని. కొన్నాళ్ళకే, ఇండ్లు ఫ్యాక్టరీలు కట్టారు. అక్కడక్కడా ఒకటి, రెండు చెట్లైనా కనిపించేవి. ఇప్పుడు అవి కూడా లేవు. ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక అలా వరండాలో ఛాయ్‍ తాగుతూ కూర్చున్నాను. కొన్ని కోతులు ఒక్కసారిగా మా ఇంటి పైకి వచ్చాయి. తర్వాత ఇంట్లోకి వచ్చాయి. అమ్మ నాన్న బయట ఉన్నారు. నాకేం చెయ్యాలో తోచలేదు. ఇల్లంతా చెల్లా చెదురు చేసేశాయి. వాటిని చూస్తుంటే బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి. వంటగది అంత చింతరవందర చేసాయి. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. కోతులు ఇటు వైపు ఎందుకు వచ్చాయో అనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. కాసేపయ్యాక, అవి వాటి ఆకలి తీర్చుకొని వెళ్లిపోయాయి. దారి తప్పి వచ్చినట్టున్నాయి అని అమ్మ అంది. మా ఇంటి చుట్టూ గమనించాను. చెట్లన్నీ నరికి వేశారు. కొంత దూరం వెళ్ళాక ఒక ముసలవ్వ కనిపించింది. ఆమెని కూర్చో బెట్టుకొని, ఆ కోతుల విషయం చెప్పాను. ఆమె ముఖంలోనే ఏంతో బాధ కనబడుతుంది. ‘‘గీ జాగంతా ఓ అడివి లెక్క ఉండేది. ఈ అడవిలో, కోతులు, నెమళ్ళు, పక్షులు ఇలా ఎన్నో జీవులు ఉండేవి. ఆయుర్వేదం మందులు కూడా అడివిలోకి వెళ్ళి తెచ్చేటోళ్లం. అభివ•ద్ధి అంటూ చెట్లు కొట్టేసి ఇండ్లు, ఫ్యాక్టరీలు కడుతుండ్రు. జంతువులకు ఉండడానికి స్థలం లేక ఊర్లల్లకు వస్తున్నాయ్‍.’’ అని ముసలవ్వ చెబుతుంటే అవ్వ కన్నులు చెమ్మ గిల్లాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు.


తెల్లారింది. పేపర్‍ బాయ్‍ సైకిల్‍ బెల్‍ కొడుతూ పేపర్‍ గేట్‍ లోపలికి విసిరాడు. వేడి వేడి ఛాయ్‍ తాగుతూ చదవడం మొదలు పెట్టా. చివరి పేజీలో ఓ కథనం. నా గుండె పిండేసింది. కన్నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. ఆస్ట్రేలియా దగ్గర్లో ఉన్న లార్డ్ హోవ్‍ (lord howe) అనే ఐలాండ్‍లో 70 శాతం పక్షులు ప్లాస్టిక్‍ తిని చనిపోతున్నాయట. చెట్ల పండ్లు తింటూ హాయిగా ఎగరాల్సిన పక్షులు రంగు రంగులుగా కనిపిస్తున్న ప్లాస్టిక్‍ కవర్లను తిని చనిపోతున్నాయి.
ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తుండగా పెద్ద శబ్దం ఇంటి వెనక నుంచి. వెళ్లి చూస్తే ఉన్న కాస్త చెట్లను కూడా నరికి వేస్తున్నారు. నేను ఒక్కదాన్ని చెప్తే వాళ్లు వినరు. మా కాలనీ వాళ్లకి ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి చెప్పా. అందులో కొంత మంది వారికి అవసరం లేదన్నట్టు వెళ్లిపోయారు. మరికొందరు సమస్యపై ఆలోచించారు. వెంటనే అందరం కలిసి చెట్లని నరకవద్దని వాళ్లకి గట్టిగా చెప్పాం. వాళ్ళు వినడం లేదు. అనాడు చిప్కో ఉద్యమంలో చెట్లని నరకొద్దని వాటిని గుండెకి హత్తుకొని, చెట్లతో పాటు మమ్మల్ని నరకండని అడ్డు కున్న తీరు గుర్తొచ్చి అందరికి ఆ ఉద్యమాన్ని తెలియజేశాను. పక్షులు చెట్ల పండ్లు దొరక్క ప్లాస్టిక్‍ తిని చనిపోతున్నాయి. వీటిని కాపాడాలంటే ఒక్కటే మార్గం. చెట్లను రక్షించాలి అంటూ నినాదాలు చెప్పాను. నా మాటలు విన్న వారిలో ఓ చిన్న పాప వెళ్లి చెట్టుని గట్టిగా హత్తు కుంది. తనని చూసి స్ఫూర్తి పొంది నాతో వచ్చినవాళ్లు చెట్లను హత్తు కున్నారు. అది చూసి వాళ్ళు చెట్లను నరకడం ఆపేసారు. ‘‘ప్రాణ వాయువుని ఇచ్చే ప్రక•తిని ప్రాణాలు పెట్టి కాపాడు కున్నాం.’’ మా ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో కూడా చెట్లను నాటాము.


నాకు అక్కడున్న పరిస్థితిని తెలియజేసిన ముసలవ్వ మా ఇంటికి వచ్చి జంతువులను, ప్రక•తిని మరియు ఆయుర్వేద వైద్యాన్ని కాపాడానని అభినందించింది.


-పి. భవాని, ఫోన్‍ : 995125639

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *