ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది మన ‘ఓటే’
ఓటు ఎంత వ్యక్తిగతమో అంత సామాజికమైనది. మనం బ్రతక వలసిన సమాజపు రూపురేఖల్ని నిర్ధారించి విధానాలను రూపొందించే నిర్మాణశక్తి ‘ఓటు’. ప్రపంచ దేశాల ముందు మనల్ని గౌరవంగానో, అగౌరవంగానో నిలబెట్టేది మన ఓటు ద్వారా నిర్మితమైన వ్యవస్థే. ప్రపంచంలోనే అతి పెద్దప్రజాస్వామిక దేశంగా మన దేశానికి గుర్తింపు, విలువా ఉన్నాయి. దీనికి కారణం మన వారసత్వపు ప్రజాస్వామిక దృక్పథం. దేశానికి స్వాతంత్య్రం వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ, అంతర్గత ఘర్షణలతో దేశం అల్లకల్లోలం అయిపోతుందనీ పాశ్చాత్య దేశాలు …