కొబ్బరి చెట్టు – లాభాలు


‘‘కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం’’ అనే సామెత మనం ఎక్కువగా కోస్తా జిల్లాలలో వింటాం. కొబ్బరిచెట్టు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే దానిని కల్పవ•క్షం అంటారు.
ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితమైన కొబ్బరి పంట ఇప్పుడు తెలంగాణాలో కూడా విస్తరిస్తుంది. కొబ్బరి చెట్టుకు నీరు బాగా అవసరం. తేమ వాతావరణం అనుకూలం.


తెలంగాణా రాష్ట్రం అవతరించాక సాగునీటి కరువు దాదాపు తీరిపోయింది. ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా లభించే నీరు నేలను సారవంతం చేయడమే గాకుండా వాతావరణంలో తేమను కూడా పెంచింది.


ఇటీవల కేందప్రభుత్వం తెలంగాణాలో 31 జిల్లాలు ఆయిల్‍ పామ్‍ సాగునకు అనుకూలమైనవని, శాస్త్రజ్ఞుల ద్వారా నిర్దారించి ఆయిల్‍ పామ్‍ సాగును పెద్దఎత్తున ప్రొత్సహిస్తూన్నారు.


ఆయిల్‍ పామ్‍ చెట్టుకు సోదర సమానమైనది కొబ్బరిచెట్టు. ఆవిధంగా తెలంగాణాలో అన్ని జిల్లాలు కొబ్బరి సాగుకు అనుకూలం.
కొబ్బరి సంవత్సరం పొడవునా దిగుబడినిస్తుంది. కొబ్బరిలో అంతర పంటగా పసుపు, అల్లం వంటి అధిక ఆదాయం ఇచ్చే పంటలు వేసుకోవచ్చు.
కంద, చేమదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‍, చిక్కుళ్లు తీగజాతి కూరగాయలు, మిరప, వంగ, బెండ వంటి కూరగాయ పంటలు వేరుశెనగ, అపరాలు వంటి పంటలు వేసుకోవచ్చు.


కొకో, వక్క, జాజికాయ, జాపత్రి, అరటి, బొప్పాయి వంటి అంతర పంటలతో ఆదాయం పొందవచ్చు. లాంగ్‍ పెప్పర్‍ అనబడే పిప్పళ్ళు కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. డాబర్‍ వంటి కంపనీలు బైబాక్‍ ద్వారా రైతులను పిప్పళ్ళు సాగుకు ప్రొత్సహిస్తున్నాయి.


కొబ్బరి రకాలు:


ఈస్ట్ కోస్ట్ టాల్‍ : దేశవాళీ రకం 6 సంవత్సరాల తర్వాత కాపుకొస్తుంది. సంవత్సరానికి ఒక చెట్టుకు 100 కాయలవరకు వస్తాయి.
గౌతమి గంగ : నాలుగు సంవత్సరాలకు కాపుకొస్తుంది. సంవత్సరానికి ఒక చెట్టుకు 90 కాయలవరకు దిగుబడి ఉంటుంది.
డబుల్‍ సెంచురీ : 7 సంవత్సరాలకు కాపుకొస్తుంది. ఒక చెట్టుకు 130 కాయలవరకు దిగుబడి నిస్తుంది.
గోదావరిగంగ : 4 సంవత్సరాలకు కాపుకొస్తుంది. ఒక చెట్టుకు 140 కాయలవరకు దిగుబడి నిస్తుంది.
కల్ప ప్రతిబా : 7 సంవత్సరాలకు కాపుకొస్తుంది. ఒక చెట్టుకు 105 కాయలవరకు దిగుబడి నిస్తుంది.
కీరా బస్తర్‍ : 7 సంవత్సరాలకు కాపుకొస్తుంది. ఒక చెట్టుకు 110 కాయలవరకు దిగుబడి నిస్తుంది.
కొబ్బరి చెట్ల ద్వారా కొబ్బరి కాయలే కాకుండా ఇతర ఉత్పత్తులు కూడా పొందవచ్చు.
వర్జిన్‍ కొబ్బరి నూనె: కొబ్బరి పాల నుంచి ఈ నూనెను తీస్తారు. డాబర్‍, పతంజలి మొదలైన కంపనీలు ఈ నూనెను విక్రయిస్తున్నారు.
కొబ్బరి పొడి : దాదాపు ప్రతి వంటలో కొబ్బరి పొడి వాడతారు
కొబ్బరి పాలు : చేపలు, మాంసాహారం, శాఖాహారం, మిఠాయిలు, డిజర్ట్, పుడ్డింగ్‍, కాక్‍ టైల్‍, కేక్‍, కుకీస్‍, కోకోనట్‍ జామ్‍, ఐస్‍ క్రీమ్‍ లలో వాడతారు.
కొబ్బరి పాల పొడి: ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. పైన చెప్పిన వంటకాలలో ఉపయోగిస్తారు.
కొబ్బరి క్రీమ్‍ : ఇంటి వంటకాలలో వాడతారు. ఆల్కహాల్‍ పానియాలలో వాడతారు.
కొబ్బరి చిప్స్ : చిరుతిండిగా పిల్లలకు మంచి ఆహారం, తీపి ఉప్పు రుచులలో లభిస్తుంది.
కొబ్బరి నూనె : వంటకాలలో ఉపయోగిస్తారు.
ఎండు కొబ్బరి : నూనెను తీస్తారు, ఆహారంలో ఉపయోగిస్తారు.
కొబ్బరి బొండాలు : కొబ్బరి నీరు చాలా ఆరోగ్యకరం.
కొబ్బరి వెనెగర్‍ : చేపలు, మాంసాహారం వంటకాలలో వాడతారు.
కొబ్బరి స్క్వాష్‍ : కొబ్బరి నీరు, నిమ్మ, అల్లం మొదలైన వాటితో తయారైన ఆరోగ్యకరమైన పానీయం.
నాటా-డీ-కోకో : ఇది డిజర్ట్ గా ఉపయోగిస్తారు. ఐస్‍ క్రీం, ఫ్రూట్‍ కాక్‍ టైల్‍లో ఎక్కువగా ఉపయోగిస్తారు
కొబ్బరి నీరా : మినరల్స్, విటమిన్స్ కలిగిన ఆరోగ్యకరమైన పానీయం
కొబ్బరి బెల్లం: నీరాను 118-120 డిగ్రీ సెంటి గ్రేడ్‍ వద్ద వేడి చేసి చల్లార్చిన తర్వాత గట్టిపడి కొబ్బరి బెల్లం తయారవుతుంది.
కొబ్బరి పంచదార : చిన్నచిన్న స్పటిక రూపంలో ఉంటుంది, పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
కొబ్బరి సిరఫ్‍ : నీరా ను వేడిచేసి తయారు చేస్తారు. కొవ్వు, కొలస్ట్రాల్‍ లేకుండా ఉండే సిరఫ్‍.
కొబ్బరి బిస్కెట్‍ : చిరు తిండిగా వాడతారు. తక్కువ కాలరీస్‍ ఎక్కువ న్యూట్రీషన్‍, పీచు పదార్ధం కలిగి ఉంటుంది.
కొబ్బరి క్యాండి : కొబ్బరి పాలతో తయారు చేస్తారు. పీచు పదార్ధం కలిగి ఉంటుంది.
కొబ్బరి చాకోలేట్‍ : ప్రోటీన్‍, పైబర్‍ కలిగి ఉంటుంది.
కొబ్బరి బర్ఫీ : కొబ్బరి తురుముతో తయారుచేయబడిన ఆరోగ్యకరమైన చిరు తిండి.
ఇంతేకాకుండా కొబ్బరి చిప్పల నుంచి పౌడర్‍, బొగ్గు మొదలైనవి తయారు చేస్తారు.


తెలంగాణా రాష్ట్రంలో భదాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలలో రైతులు కొబ్బరి సాగు ఎప్పటినుంచో చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఏకైక కొబ్బరి విత్తన క్షేత్రం (సీడ్‍ గార్డెన్‍) భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో ఉన్నది. ఇక్కడ ఆరు రకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటి నుండి కొబ్బరి మొక్కలు ఉత్పత్తిచేసి తెలంగాణా రాష్ట్రం నలుమూలల ఉద్యాన శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.


అశ్వరావుపేటలోని ఔత్సాహిక రైతులు కొంతమంది తెలంగాణా కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి తెలంగాణా రాష్ట్రమంతట కొబ్బరి సాగును ప్రొత్సహిస్తున్నారు. దగ్గరలోని ప్రాంతీయ కొబ్బరి అభివ•ద్ది బోర్డ్, విజయవాడ వారి సాంకేతిక సలహాలతో కొబ్బరి సాగును చేపట్టి కొబ్బరి అభివ•ద్ది బోర్డ్ వారి పథకాలు ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందేటట్లు క•షి చేస్తున్నారు.


భారతదేశ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిపాలన విభాగం ఆద్వర్యంలో కొబ్బరి అభివ•ద్ది బోర్డు పనిచేస్తుంది. కొబ్బరి అభివ•ద్ది బోర్డు ప్రధాన కార్యాలయం కేరళ రాష్ట్రంలో కొచ్చి లో ఉన్నది. కర్ణాటక, అస్సాం, తమిళనాడు, బీహార్‍, అండమాన్‍ నికోబార్‍, ఆంధప్రదేశ్‍, మహారాష్ట్రా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రాలలో ప్రాంతీయ కొబ్బరి అభివ•ద్ది బోర్డు కార్యాలయాల ద్వారా రైతులకు సేవలను అందింస్తుంది.


కొబ్బరి రైతు ఉత్పత్తి సంఘాలు – కొబ్బరి అభివ•ద్ది బోర్డును, రైతులను సమన్వయం చేస్తూ, కొబ్బరి అభివ•ద్ది బోర్డు పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో విశేషంగా క•షి చేస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో కొబ్బరి అభివ•ద్ది బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయుటకు ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి రైతు ఉత్పత్తి సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.


ముఖ్యమైన పథకాలు :


కొబ్బరి నర్సరీలు స్థాపన: కొబ్బరి నర్సరీల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్‍ నర్సరీలను ఆర్ధిక సహకారంతో ప్రోత్సహించి నాణ్యమైన కొబ్బరి మొక్కలు ఉత్పత్తిచేస్తారు.
కొబ్బరి కొత్త తోటల విస్తరణ: కొత్తగా కొబ్బరి తోటలు వేసే రైతు ఒకరికి 10 ఎకరాల వరకు ఆర్ధిక సహకారం అందిస్తారు. కొత్తగా కొబ్బరి తోటల విస్తరణ ఈ పథకం ఉద్దేశ్యం.
కొబ్బరి ఉత్పత్తుల ప్రదర్శనా కమతాల గుర్తింపు: కొబ్బరి తోటల ద్వారా రైతు నికర ఆదాయం పెంచడానికి సమగ్ర సేద్యానికి ఆర్ధిక సహకారం అందించి రైతులను ప్రోత్సహిస్తారు.
సేంద్రీయ ఎరువుల తయారీ: సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి కొబ్బరి రైతులకు ఆర్ధిక సహకారం అందిస్తారు.
ఎగుమతి అభివ•ద్ది మండలం ఏర్పాటు: కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతిదారులకు సహకారాన్ని అందించడం ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశ్యం.
కొబ్బరి తోటల పునరుద్దరణ: కొబ్బరి తోటలలో ఉత్పాదకత మరియు ఉత్పత్తిని అభివ•ద్ది చేయడానికి తెగుళ్లు ఆశించిన చెట్లను, ఉత్పత్తి మందగించిన చెట్లను, వయస్సు మీరిన చెట్లను, పాత చెట్లను తొలగించి నాణ్యమైన మొక్కలు నాటి, మిగిలిన చెట్లను సమగ్ర సదుపాయాలతో ఈ పథకం క్రింద పునరుద్ధరిస్తారు.
కీరా సురక్ష బీమా పధకం: ఈ బీమా పథకం కొబ్బరి చెట్లకు, రైతులకు మరియు కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసే శ్రామికులకు వర్తిస్తుంది.


పై పథకాలన్నీ తెలంగాణా రైతులకు అందచేయాలనే సంకల్పంతో తెలంగాణాలో ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు మహబూబ్‍ నగర్‍ జిల్లాలలో కొబ్బరి అభివ•ద్ది బోర్డ్ వారు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఉద్యాన శాఖ ద్వారా EGS పథకం మరియు కొబ్బరి అభివ•ద్ది బోర్డ్ పథకం క్రింద కొబ్బరి తోటల విస్తరణ జరుగుతుంది. ప్రస్తుతం డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం ఆయిల్‍ పామ్‍ తోటలకు మాత్రమే ఉన్నది. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‍ డాక్టర్‍ ప్రియాంక అలా,IAS, గారి ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా EGS పథకం క్రింద విస్తరించబడిన కొబ్బరి తోటలకు డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం వారు అనుమతించారు. త్వరలో తెలంగాణాలోని 31 జిల్లాలలో కూడా కొబ్బరి సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందుతారనేది నిర్వివాదాంశం.

  • సముద్రాల విజయ్‍ కుమార్‍
    ఎ: 837444992

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *