వందేండ్ల వసంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా హైదరాబాద్‍ పబ్లిక్‍ స్కూల్‍ కార్నివాల్‍ మంత్రముగ్ధులను చేసిన వింటేజ్‍ కార్‍ షో

హైదరాబాద్‍ నగరం బేగంపేటలోని హైదరాబాద్‍ పబ్లిక్‍ స్కూల్‍ శతాబ్ది ఉత్సవాలు చిరకాలం గుర్తిండిపోయేలా కొనసాగాయి. డిసెంబర్‍ 24 ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ వేడుకల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తాము చదువుకున్న పాఠశాలలో, గడిపిన మధురాను భూతులను సన్నిహితులతో పంచుకుంటూ సరదాగా గడిపారు. కార్నివాల్‍లో స్టేజీ షో, వింటేజ్‍ కార్‍ షో, యూత్‍ పార్లమెంట్‍, బుక్‍ రీడింగ్‍ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


కార్నివాల్‍లో స్టేజీ షో..
హోరెత్తించే డీజే పాటలకు స్టెప్పులతో కార్నివాల్‍లో స్టేజీ షో ఉల్సాసంగా సాగింది. సాంస్క•తిక కార్యక్రమాలు, చిన్నారుల సాంప్రదాయక న•త్యప్రదర్శనలు చూపరులను మంత్రముగ్దులను చేశాయి. అదేవిధంగా ఫుడ్‍ కోర్టులు, ప్లే జోన్‍, మారథాన్‍ నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలు సందర్శకుల నోరూరించాయి. ట్రెడిషనల్‍, వెస్ట్రన్‍తోపాటుగా నిజాం కాలం నాటి ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. శతాబ్ది ఉత్సవాలను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహిస్తున్నామని హెచ్‍పీఎస్‍ సొసైటీ ప్రెసిడెంట్‍ గుస్తీ నోరియా తెలిపారు.


విపత్కర పరిస్థితుల్లో ఏం చేద్దాం..?
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హెచ్‍పీఎస్‍ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బుక్‍ రీడింగ్‍ కార్యక్రమంలో అనేక అంశాలను వెల్లడించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో కూడా విద్యార్థులు తమకు తాముగా వివరించారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంత సాహసాలతో కూడిన ఆలోచనలు నేర్పిస్తే.. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను నిర్భయంగా ఎదుర్కొని పరిష్కరించే వీలుంటుందని సందర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బుక్‍ రీడింగ్‍ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తాము సాధించే విషయాలను తెలిపారు.


పొలిటికల్‍ లీడర్లను తలపించిన యూత్‍ పార్లమెంట్‍
‘‘స్పీకర్‍ మేడమ్‍.. ఆయామ్‍ ద రిప్రజంటేటివ్‍ ఆఫ్‍ కర్ణాటక స్టేట్‍. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పొంచి ఉన్న ఉగ్రవాదం, దేశ భద్రతను సవాల్‍ చేస్తున్నది. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి లేకుండా చేస్తున్నాయి. ఇలా విద్యా, ఉద్యోగ, వైద్య సంక్షేమాన్ని అందించే పాలసీలను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది’’ అంటూ విద్యార్థులు చేసిన ప్రసంగం అబ్బురపరిచింది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన యూత్‍ పార్లమెంట్‍లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు.


నిరుద్యోగం, టెక్నాలజీ, రక్షణ రంగం, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ వంటి అంశాలపై పార్లమెంట్‍ ప్రవర్తన నియమావళి తరహాలో విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, పార్లమెంట్‍ సభ్యులను తలపించారు. పార్టీల వారీగా, రాష్ట్రాల వారీగా యూత్‍ పార్లమెంట్‍లో పాల్గొని నిర్దేశిత అంశాలను చర్చించారు. 8-10వ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులు పాల్గొనగా, ఇందులో ఒకరు స్పీకర్‍ బాధ్యతను నిర్వర్తించారు. ఉపాధ్యాయులు, సీనియర్‍ విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన పార్లమెంట్‍ సమావేశాలు పేరెంట్స్, సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


పాతకాలపు కార్ల ప్రదర్శనతో.. పరవశించి పోయిన సందర్శకులు

హైదరాబాద్‍ పబ్లిక్‍ స్కూల్‍ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వింటేజ్‍ కార్‍ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. తీరొక్క కార్లతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. కార్ల వద్ద ఫొటోలు, సెల్ఫీలతో సందర్శకులు సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వింటేజ్‍ కార్ల ప్రదర్శనలో 1923 నుంచి మొదలుకొని 1964వరకు ఆయా మాన్యుఫాక్షరింగ్‍ సంస్థలకు చెందిన కార్లు ఎగ్జిబిషన్‍లో దర్శనమిచ్చాయి.


ఆకట్టుకున్న షాదాన్‍ గ్రూప్‍ కార్లు..
వింటేజ్‍ ఎగ్జిబిషన్‍లో షాదాన్‍ గ్రూప్‍ కార్లు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడికి వచ్చిన కార్లలో 26 రకాల వింటేజ్‍లను ప్రదర్శనలో పెట్టామని షాదాన్‍ ప్రతినిధి అఖిల్‍ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలాస వంతమైన కారుగా గుర్తింపు పొందిన కారును ఆస్ట్రేలియాలోని రోల్‍స రాయిస్‍ ఇంజన్‍తో తయారు చేసినట్లు వెల్లడించారు. ఇది 1954లో డోడ్జ్ పేరుతో బయటకి వచ్చిందని తెలిపారు. అయితే అన్నింటికంటే ఎక్కువగా 1926లో ఆస్టిన్‍ గులాబీ కార్‍ (ఏపీఎక్స్6715)ను చూడాలని తహతహలాడారు. ఆయా కార్లలో కూర్చొని డ్రైవింగ్‍ సైతం గావిం చారు. 1923లో రూపుదిద్దుకున్న రైలింజన్‍ ఆకారంలో కలిగిన బ్లాక్‍ కలర్‍ వింటేజ్‍ వద్ద సెల్ఫీల సందడి అంతా ఇంతా కాదు.


ఆకర్షణగా నిలిచిన ప్రెసిడెంట్‍ కారు..
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే హెచ్‍పీఎస్‍ సొసైటీ ప్రెసిడెంట్‍ గుస్తీ నోరియా పాతకాలపు కారు ఆకర్షణగా నిలిచింది. 1933లో తయారైన చెవర్‍లెట్‍ కారుకు గుస్తీ నోరియా ఓనర్‍గా ఉన్నారు. ఈ కారును నిజామ్స్ ఆర్థిక సలహాదారు ఖాన్‍ బహదూర్‍ ఉపయోగించినట్లు తెలిసింది. ఇక 1964కు చెందిన ఓల్డస్మొబిల్‍-జెడ్‍85 కారును ప్రిన్స్ ముఖర్రం ఝా బహదూర్‍కు పట్టాభిషేకం సందర్భంగా బహుమానంగా ఇచ్చారు. 1951లో తయారైన డిడ్జ్ కార్నెట్‍-6 కారును 7వ నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ తనకు ఎంతో ఇష్టంగా నచ్చిందని కొనుగోలు చేశారు. దీనికి ప్రత్యేకమైన అలారాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇలా అనేక పాతకాలపు కార్లు వీక్షకులను ఎంతగానో అరించాయి.


ఆకట్టుకున్న సూపర్‍ కార్‍ షో
సూపర్‍ కార్లు.. అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. ఒకసారి కారు ఇంజిన్‍ స్టార్ట్ అయ్యిందంటే రయ్యుమంటూ దూసుకుపోతాయి. క్షణాల్లో పదుల కిలోమీటర్ల పికప్‍ను అందుకునే ఈ కార్ల ఖరీదు కూడా అందనీ ద్రాక్షలాగా కోట్లలోనే ఉంటాయి. హైదరాబాద్‍ కేంద్రంగా రాకెట్‍ వేగంతో దూసుకుపోయే స్పోర్టస్ కార్లను బేగంపేట్‍లోని హైదరాబాద్‍ పబ్లిక్‍ స్కూల్‍ శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రదర్శించారు.
వందేళ్ల పండుగలో భాగంగా వింటేజ్‍ కార్లను ప్రదర్శించగా… మంగళవారం స్పోర్టస్ కార్లతో సూపర్‍ కారు షోను ఏర్పాటు చేశారు. నేటితరం యువతను ఎంతగానో ఆకట్టుకునే లగ్జరీ కార్లు హెచ్‍పీఎస్‍లో సందడి చేశాయి. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకల్లో 12కిపైగా ఇంటర్నేషనల్‍ బ్రాండ్‍కు చెందిన కార్లను ప్రదర్శించారు. వీటిలో లంబోర్గిని, పోర్ష్తోపాటు, బీఎండబ్ల్యూ, ఆడీతోపాటు, ఫెరారీ వంటి కార్లు ఉన్నాయి. ఇందులో చర్మాస్‍ అధినేత పే స్తోంజీ 8 కార్లు, మహబూబ్‍ ఆలమ్‍ఖాన్‍ గారి 6 కార్లు పాల్గొన్నాయి.


Er. వేదకుమార్‍ మణికొండ, చైర్మన్‍, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీకు ఆటోమొబైల్స్పై మక్కు ఉంది. విల్లీస్‍ స్టేషన్‍ వ్యాగన్‍ (Willys Station Wagon) కార్లు అందరికీ సరఫరా చేయబడలేదు. ఈ వాహనంపై మక్కువ పెంచుకున్న ఆయన 90వ దశకం ప్రారంభంలో అగ్నిమాపక శాఖ నుంచి APY 5685 వాహనం కొనుగోలు చేశారు. వేదకుమార్‍ గారు ఈ కారును మూడు దశాబ్దాలుగా కలిగి ఉన్నారు. 2000లలో ఈ కార్లు అరుదు. వీటిని 15-20 సంవత్సరాలుగా దీనిని ఉపయోగించి, దేశంలోనే అనుభవజ్ఞుడైన అయిన బి. కేశవరావు ఈ కారులను అసలు స్థితికి పునరుద్ధరించారు. ఇవే కాకుండా వేదకుమార్‍కు ఆరుకు పైగా వింటేజ్‍ కార్లు ఉన్నాయి. హైదరాబాద్‍ నిజాంలకు చెందిన 1947 డాడ్జ్ బస్‍ బీ సిరీస్‍, 1960 విల్లీస్‍ పిక్‍ అఫ్‍ వ్యాన్‍, 1952 లో బ్యానెట్‍ విల్లీస్‍ జీఫ్‍, 1949 ప్లైమౌత్‍, మార్క్ -lll అంబాసిడర్‍, ప్రీమియర్‍ పద్మిని ఫీయట్‍ తదితర కార్లు ఉన్నాయి.


రీ యూనియన్‍ మ్యూజిక్‍ కన్సర్ట్..
కార్నివాల్‍ సంబురాల్లో భాగంగా హెచ్‍పీఎస్‍ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక మ్యూజికల్‍ షో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి కార్నివాల్‍ సందడి మొదలు కాగా తొలుత హెచ్‍పీఎస్‍ మ్యూజికల్‍ బ్యాండ్‍ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఎంతగానో అలరించింది. సాయంత్రం 6 గంటల నుంచి రీయూనియన్‍ మ్యూజికల్‍ కన్సర్ట్ పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో కలిసి మ్యూజిక్‍ షోతో ఆకట్టుకున్నారు.


మ్యూజికల్‍ ట్రియోతో ముగింపు
భారతీయ సంగీతత్రయంగా శంకర్‍ మహాదేవన్‍, ఎహ్సాన్‍ నూరానీ, లాయ్‍ మెండోన్సాలతో కూడిన బ•ందం జరిపిన లైవ్‍ మ్యూజికల్‍ షోతో శతాబ్ది వేడుకలు ముగిసాయి. హెచ్‍పీఎస్‍ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఈ ముగ్గురు సంగీత కళాకారుల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, ఇంగ్లిష్‍ భాషల్లో ఉన్న వీరి పాటలకు విశేష ఆదరణ ఉండగా, హెచ్‍పీఎస్‍ వేడుకగా నిర్వహించే కార్యక్రమంలో ఈ మ్యూజికల్‍ ట్రయోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • కె. సచిన్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *