రాజస్థాన్‍ కొండ కోటలు

ఉనికి: రాజస్థాన్‍
ప్రకటిత సంవత్సరం: 2013
విభాగం: సాంస్క•తికం (సీరియల్‍ సైట్‍)


ఈ సీరియల్‍ సైట్‍లో చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, సవాయి మాధోపూర్‍ ఝలావర్‍, జైపుర్‍ మరియు జైసల్మేర్‍లలో ఆరు అందమైన కోటలు ఉన్నాయి, వీటిలో విస్త•తమైన ఆస్థాన సంస్క•తులు అభివ•ద్ధి చెందాయి. ఎనిమిదో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల వరకు ఈ ప్రాంతంలో వర్ధిల్లిన రాజ్‍పుత్‍ రాచరిక రాజ్యాల శక్తికి కోటల పరిశీలనాత్మక వాస్తుశిల్పం సాక్ష్యంగా నిలుస్తుంది. రక్షణ గోడల లోపల ప్రధాన పట్టణ కేంద్రాలు, రాజభవనాలు, వాణిజ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇవి అక్కడ కోటలు కట్టడాని కంటే ముందే ఉన్నాయి. ప్రక•తి అందించే సహజ రక్షణలైన కొండలు, ఎడారులు, నదులు, దట్టమైన అడవులను ఈ కోటలు ఉపయోగించుకోవడం ఓ విశేషం. అవి విస్త•తమైన నీటి సేకరణ నిర్మాణాలను (జలాశయాలు) కూడా కలిగి ఉన్నాయి, ఇవి నేటికీ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.


ప్రాధాన్యం: (ii) (ii) అంశాలు

ప్రాధాన్యాంశం: (ii): ఈ కోటలు రాజస్థాన్‍లోని విభిన్న భౌతిక మరియు సాంస్క•తిక మండలాల్లో మధ్యయుగాల ఆరంభం మొదలుకొని చివరి కాలం దాకా కోటల ప్రణాళికలు, కళలు, వాస్తుశిల్పంలో రాజపుత్‍ ఆలోచనాసరళులు ఏవిధంగా మారుతూ వచ్చాయి, పరస్పరం ఏ విధంగా ప్రభావితం చేసుకున్నాయనే అంశాన్ని తెలియజేస్తాయి.
ప్రాధాన్యాంశం (iii): ఈ కొండ కోటలు రాజ్‍పుత్‍ పరాక్రమం, శౌర్యం, భూస్వామ్యం, సాంస్క•తిక సంప్రదాయాల నిర్మాణ స్వరూపాలు.
వాయువ్య భారతదేశంలో ఉండే రాజస్థాన్‍ ను విస్తీర్ణంలో ఫ్రాన్స్తో పోల్చవచ్చు. ఎనిమిదవ శతాబ్దం నుండి ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం వరకు రాజపుత్ర వీర పాలకుల బలమైన కోటలుగా వందలాది కోటలను కలిగి ఉంది. అవి రాజస్థాన్‍లోని భౌగోళిక, సాంస్క•తిక మండలాల పరిధిలో టైపోలాజీ, నిర్మాణం, స్థాయిలో మారుతూ ఉంటాయి.


వ్యూహాత్మక సైనిక కేంద్రాలుగా ముఖ్యమైనవి అయినప్పటికీ, ఈ కోటలు పాలకుల నివాస ప్రధాన కార్యాలయాలుగా, అలాగే మార్కెట్లుగా, సాధారణ ప్రజానీకం నివసించే ఇళ్లతో కూడిన పట్టణాలుగా కూడా పనిచేశాయి.
ఆరు కొండ కోటలు – అంబర్‍, గాగ్రోన్‍, రణతంబోర్‍, కుంభాల్‍గఢ్‍, చిత్తోడ్‍ గఢ్‍, జైసల్మేర్‍ – రాజస్థాన్‍లోని విభిన్న భౌగోళిక, భౌతిక, సాంస్క•తిక మండలాలకు చెందినవి. చారిత్రాత్మకంగా, మొత్తం ఆరు కోటలు కచ్వాహా, ఖించి చౌహాన్‍, సిసోడియా, భట్టి వంశాల రాజపుత్రుల రాజధానులు. ఇవి రాజస్థాన్‍ ప్రాంతం గుండా వెళుతున్న ముఖ్యమైన చారిత్రాత్మక వాణిజ్య మార్గాలలో ఉన్నాయి.


ప్రతి కోట కూడా తన సహజ అమరికతో విభిన్న రీతిలో ప్రక•తి ఏర్పాట్లతో మిళితమైన తీరును ప్రదర్శిస్తుంది. రక్షణ కోసం సహజ, స్థలాక•తి లక్షణాలను ఉపయోగించుకునే నిర్మాణ సాంకేతికతలను వెల్లడిస్తుంది. చిత్తోడ్‍ గఢ్‍ ఆరావళి శ్రేణిలోని అతిపెద్ద పీఠభూమిలోని కోటలలో ఒకటిగా ఉంది. ఇది 3.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చిత్తోడ్‍ గఢ్‍ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఆరావళి శ్రేణిలో కుంభాల్‍ఘర్‍ అభయారణ్యం ప్రాంతంలో
ఉంది కొండ వాలు వెంబడి విస్తరించి ఉన్న దాని స్థలాక•తికి చాలా భిన్నమైన రీతిలో ఉంటుంది. రణతంబోర్‍ దట్టమైన అడవిని, దాని మధ్య ఉన్న కొండను ‘కొండ-అటవీ’ కోటకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. గాగ్రోన్‍ కోట తన రక్షణ కోసం సహజ జలాలను ఉపయో గిస్తుంది, ఎందు కంటే అది ఉన్న కొండ మూడు వైపులా నదీ జలాలతో చుట్టబడి ఉంది. ఇక నాల్గవ వైపు నుండి ఎవరూ ప్రవేశించలేని విధంగా జలాలను కలిపే మానవ నిర్మిత కందకం స•ష్టించబడింది. అంబర్‍ అనేది ‘కొండ-లోయ కోట’కు ఒక విలక్షణ ఉదాహరణ, ఇక్కడ ప్రధాన ప్యాలెస్‍ నిర్మాణాలు లోయ ప్రాంతంలో ఉన్నాయి. చుట్టుపక్కల కొండలో కోటలతో చుట్టబడి ఉంటాయి. జైసల్మేర్‍ కోట ఒక ఎడారి ప్రాంతం మధ్యలో ఒక బహిరంగ ప్రాంతంలో ఉంది, ఇక్కడ కొండ పూర్తిగా బలమైన కోటల లోపల ఉంది. రాజ్‍పుత్‍ రాచరిక జీవితం లేదా స్థానిక ఇతర తెగలు, గిరిజన జీవన విధానాలను సమీకరించడం వంటివి ఈ కోటల లేఅవుట్‍, నిర్మాణం, స•జనాత్మక అలంకరణలో ప్రతిబింబిస్తాయి. ప్రతి సందర్భంలోనూ కోటల లోపల ఉన్న నిర్మాణాలు అసాధారణమైన భౌగోళిక నేపధ్యంలో సహజ వనరుల సంపదను ఉపయోగించి లౌకిక హిందూ రాజ్‍పుత్‍ వాస్తుశిల్పం, సాంకేతిక అనుసరణల అధునాతన, అభివ•ద్ధి చెందిన ఉదాహరణలను చూపుతాయి.


ఒక భౌగోళిక జోన్‍లోని ప్రతి కోట కూడా బయటి చొరబాట్లు, దాడులకు పూర్వపు రాజపుత్ర రాజ్యాల ప్రతిఘటనను ప్రతిబింబిస్తుంది. ప్రతి కోట కూడా దేవాలయాలు, రాజభవన వాస్తుశిల్పం, నీటి వ్యవస్థలలో స్థానిక, విదేశీ ప్రభావాల ఆసక్తికరమైన సమీకరణను చూపుతుంది.
చిత్తోడ్‍ గఢ్‍ ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు ఉన్న విస్తారమైన నిర్మాణ చిహ్నాలకు గుర్తింపు పొందింది. భారతదేశంలోనే అతి పెద్ద కోట.
కుంభాల్‍ గఢ్‍ అనేది అత్యంత సుందర ద•శ్యాలతో ఉండే ఒక అద్భుత కోట. ఇది ప్రముఖ ఆర్కిటెక్ట్ మందన మార్గదర్శకాల ప్రకారం పదిహేనవ శతాబ్దంలో ఒకే దశ నిర్మాణంలో నిర్మించబడింది.
జాతీయ ఉద్యానవనం మధ్యలో రణతంబోర్‍ ఒక ప్రధానమైన ‘కొండ-అటవీ’ కోటగా నిలుస్తుంది. రణథంబోర్‍లోని హమ్మీర్‍ ప్యాలెస్‍ భారతదేశంలో ఉనికిలో ఉన్న అత్యంత పురాతన ప్రి-ఇస్లామిక్‍ ప్యాలెస్‍ నిర్మాణం.


అల్లావుద్దీన్‍ ఖిల్జీ పద్నాలుగో శతాబ్దంలో దాడి చేసినప్పుడు జయించలేక పోయిన గాగ్రోన్‍, నీటి రక్షణతో కూడిన కొండ కోట. ఈ ఆరు కోటలలో అతి చిన్నది.
అంబర్‍ కోట చార్‍బాగ్‍ ఉద్యాన వనాలు, నీటి వ్యవస్థల అనుసరణతో పాటు, సున్నితమైన గాజు పనితో అద్భుత రాజ్‍పుత్‍-మొఘల్‍ రాజభవన నిర్మాణాన్ని సూచిస్తుంది.
జైసల్మేర్‍, ఎడారి కోట, దాని ఒకనాటి ఇళ్ళు, హవేలీలను అలాగే నిలబెట్టుకుంది. అలాగే అసాధారణమైన పటిష్ఠమైన తొంభై-తొమ్మిది బురుజులను నిలబెట్టుకుంది. స్థానిక ఓచర్‍-కలర్డ్ డ్రెస్డ్ రాతి పొడి రాతితో నిర్మించబడింది. జైసల్మేర్‍ కోట బంగారు రంగు దానికి ప్రఖ్యాత సోనార్‍ ఖిలా (బంగారు కోట) పేరు వచ్చేందుకు దారితీసింది.
చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, రణతంబోర్‍, జైసల్మేర్‍ కోటలు ఏఎస్‍ఐచే భారతదేశ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించబడ్డాయి. గాగ్రోన్‍, అంబర్‍ కోటలు రాజస్థాన్‍ రాష్ట్ర-రక్షిత స్మారక చిహ్నాలుగా గుర్తించబడ్డాయి. రాష్ట్ర స్థాయి అపెక్స్ అడ్వైజరీ కమిటీ ద్వారా మొత్తం ఆరు ఒకే సీరియల్‍ ప్రాపర్టీగా నిర్వహించబడుతున్నాయి.

  • శిఖా జైన్‍
    అనువాదం : ఎన్‍. వం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *