ఉమ్మడి నల్గొండ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 14,170 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. దీనికి ఉత్తరాన మెదక్‍, వరంగల్‍ జిల్లాలు, పశ్చిమంలో రంగారెడ్డి, మహబూబ్‍నగర్‍ (కొంత భాగం), తూర్పు ఖమ్మం, కృష్ణా (ఏ.పి.), దక్షిణంలో మహబూబ్‍నగర్‍, గుంటూరు (ఏ.పి) జిల్లాలు కలవు. హైదరాబాద్‍-విజయవాడ నేషనల్‍ హైవే (ఎన్‍హెచ్‍-9), హైదరాబాద్‍- కాజీపేట, హైదరాబాద్‍ – గుంటూరు బ్రాడ్‍ గేజి రేల్‍ వే లైన్స్ ఈ ప్రాంతంగుండా వెళ్తుంది.


ఈ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలోని కొంత భాగం తప్ప మిగతా ప్రాంతం ఒక మోస్తరి ఎత్తు పల్లాలతో, చిన్న చిన్న గుట్టలు ఇన్‍సెల్‍బర్గ్లతో కూడి వుంటుంది. దక్షిణ ప్రాంతంలో కృష్ణానదికి ఉత్తరాన ఓక ప్లాటూగా ఉన్నది. ఈ ప్రాంతంలోని మీన్‍ ఎలివేషన్‍ 150ఎ ఎ•శ్రీ పైన. మరియు జెనరల్‍ స్లోప్‍ సౌత్‍ ఈస్ట్ దిశలో కలది. డ్రేనేజ్‍ ప్యాటర్న్ గ్రానైట్‍. నైస్‍ ఉన్న ప్రాంతంలో డెన్‍డ్రిటిక్‍ నుండి సబ్‍ డెన్‍డ్రిటిక్‍గా ఉంటుంది. మరియు సౌత్‍లో సెడిమెంటరీస్‍లో ట్రెల్లిస్‍, రెడియల్‍గా ఉంటుంది. ఈ ప్రాంతంలో పారే ప్రముఖమైన నదులు కృష్ణా, డిండి, పెద్దవాగు, మూసి, ఆలేరు, హల్లియా, కొంగల్‍, పల్లేరు ఇవన్ని కృష్ణా నది యొక్క ఉపనదులు. ఇవన్ని సౌత్‍ ఈస్ట్ దిశలో పారుతది. నాగార్జున సాగర్‍ డ్యామ్‍ ఈ ప్రాంతంలోనే వున్నది. దీని యొక్క లెఫ్ట్ బ్యాక్‍ కెనాల్‍, ఈ జిల్లాలో చాలా ప్రాంతానికి నీరు అందిస్తుంది. ఈ జిల్లాలోని చాలా భాగం రెడ్‍ సాండ్‍ సాయిల్‍ ఉన్నది. దక్షిణ ప్రాంతంలో కృష్ణానది తీరాన బ్లాక్‍ కాటన్‍ సాయిల్‍ని చూడగలము.


సీస్మ లాజికల్‍ స్టడీ ద్వారా నాగార్జునసాగర్‍ ప్రాంతంలో రెండు ఆర్త్క్వేక్‍ ఎపి సెంటర్స్ ఉన్నట్టుగా నిర్ధారించారు. అవి దేవరకొండ, హుజూర్‍నగర్‍ పరిసరాలలో వీటి తీవ్రత రీశటర్‍ స్కేల్‍లో 2.1-2.4 ఉన్నట్టు. ఇది సంభవించిన తేదీలు 7 ఏప్రిల్‍ 1969 మరియు 20, 21 సెప్టెంబర్‍ 1969.
ఈ జిల్లాలోని ప్రాంతం స్థిరమైన ఈస్ట్ర్న్ ధార్‍వార్‍ క్రేటాన్‍లోని భాగంగా గుర్తింపబడినది. చాలా వరకు ఈ ప్రాంతంలో పెనిన్‍సులర్‍ నైసిక్‍ కాంప్లెక్స్లోని పలు రకాల నైస్‍లు, గ్రానైట్‍లు, ఈ నైసెస్‍లో ఎన్‍క్లేవస్‍ రూపంలో ధార్‍వార్‍ సూపర్‍ గ్రాప్‍కు చెందిన మెటమార్ఫిక్స్ మరియు ఇదే గ్రూప్‍కు చెందిన పెదవోరా శిస్ట్బెల్ట్, దక్షిణాన కడపా సూపర్‍ గ్రూప్‍ మరియు కర్ణూల్‍ గ్రూప్‍కు చెందిన సెడిమెంటరీన్‍ని చూడగలము.
గ్రానైట్‍లు చాలా వరకు గ్రానోడైయొరైట్‍, టోనలైట్‍, ట్రాన్జ్మైట్‍ కాంపోజిశన్‍లో ఉన్నవి. శిస్ట్బెల్ట్లో హౌర్నబ్లెండ్‍ బయొటైట్‍ శిస్ట, మెటబెసాల్ట్, మెటారయొలైట్‍ మరియు బ్యాండెడ్‍ హెమటైట్‍ క్వార్ట్ జైట్‍ ఉన్నవి. ఈ గ్రానైట్‍ -నైసెస్‍లోకి డోలరైట్స్ గ్యాబ్రోలు, లాంప్రైట్‍లు క్వార్ట్జ్‍ ఇన్‍ ట్రూడ్‍ అయినది దక్షిణ ప్రాంతలో కడపాస్‍కు చెందిన క్వార్ట్జైట్‍, శేల్‍ (కుంభం ఫార్మేశన్‍), స్రీసైలమ్‍ క్వార్ట్జైట్‍ మరియు కర్ణూల్‍ గ్రూప్‍కు చెందిన నార్జీ లైమ్‍స్టోన్‍, బనగానపల్లి క్వార్ట్జైట్‍లని చూడగలము.


ఖనిజ సంపద : ఈ జిల్లాలో పుష్కలంగా సిమెంట్‍ గ్రేడ్‍ లైమ్‍స్టోన్‍, డైమెన్ష్న్‍ స్టోన్‍, క్లే, కొరండమ్‍, డైమండ్‍, ఫెల్స్ పార్‍, లైమ్‍ కంకర్‍, లెడ్‍ ఓర్‍, సోప్‍ స్టోన్‍ మరియు క్వార్టజ్ నిక్షేపాలు కలవు.
లైమ్‍ స్టోన్‍ : సిమెంట్‍ గ్రేడ్‍ లైమ్‍ స్టోన్‍ నిక్షేపాలు వజీరాబాద్‍, మెడ్ల చెరువు పరిసరాలలో పుష్కలంగా కలవు. ఫ్లక్స్ గేడ్‍ లైమ్‍స్టోన్‍ నిక్షేపాలు పెద్ద మొత్తంలో వజీరాబాద్‍, రఘునంద పాలెం, యాప్రాల్‍ – మాధవరం ప్రాంతాలలో వున్నది. ఈ ఫ్లక్స్ గ్రేడ్‍ లైమ్‍ స్టోన్‍లో Cao 40% నుండి 50% వుంటుంది. ఇది పర్పుల్‍ నుండి పింక్‍ రంగులలో ఉంటుంది. ఈ లైమ్‍స్టోన్‍ నార్జి ఫార్మేషన్‍కు చెందినది.
డైమెన్‍షన్‍ స్టోన్స్ : పింక్‍, గ్రే గ్రానైట్స్ దేవరకొండ ప్రాంతానికి చెందిన పర్యెడ్ల, ఘనాపూర్‍, చింతకుంట పరిసరాలలో క్వారీ చేయబడుతున్నది. బ్లాక్‍ గ్రానైట్‍ (డోలరైట్‍) క్వారీస్‍ కోదాడ, కట్టంగూర్‍, వెల్లిగుండు, నూతన్‍కల్‍, కాతేపల్లి, నకిరేకల్‍ మరియు మున్నిగల్‍ మండలాల్లో కలవు. వీటిని కన్‍స్ట్రక్షన్‍ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
క్లే : కెయొలినొస్డ క్లే కర్నూల్‍ గ్రూప్‍కు చెందిన లైమ్‍స్టోన్‍, శేల్‍శిలల్లో చింత్రియాల్‍ వద్ద కృష్ణా నదికి ఉత్తరంలో ఉన్నది. దీన్ని సెరామిక్‍, టెక్స్టైల్‍, పేపర్‍, ఫర్టిలైజర్‍ మరియు పెస్టిసైడ్‍ పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. వీటి నిల్వలు సుమారు 81,200 టన్నులుగా నిర్ధారించారు.
కోరండమ్‍ : కోరండమ్‍ క్రిస్టల్స్ సాయిల్స్లో పెద్దగూడెం, లింగంపల్లి, అన్వల్‍గూడెం పరిసరాలలో దొరుకుతుంది. ఇది సెమి ప్రీశ్వస్‍ స్టోన్‍ జెమ్‍స్టోన్‍గా మరియు అబ్రేసివ్‍గా ఉపయోగిస్తారు.


డైమండ్‍ : ప్లేసర్‍ డైమండ్స్ కృష్ణానది యొక్క ప్లడ్‍ ప్లేన్‍లోని గ్రావెల్స్లో నల్గొండ – గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో వున్నవి. ఇది కొల్లూరు వద్ద పలు ఓల్ట్ వర్కింగ్స్ ఉన్నవి. చారిత్రాత్మికి ‘కోహినూర్‍ డైమెండ్‍’ ఈ ప్రాంతం నుండి రికవర్‍ చేసినట్టు రికార్డు చేయబడినది.
ఫెల్స్పార్‍ : వీటి నిక్షేపాలు పెగ్మటైట్స్లో నిడమనూరు, దామర్‍చెర్ల, చారాకొండ ప్రాంతాలలో ఉననవి. దీనిని గ్లాస్‍ మరియు సెరామిక్‍ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
లైమ్‍కంకర్‍ : లైమ్‍ కంకర్‍ పాకెట్స్ రూపంలో 34-51 శాతం Cao తో కూడి యున్న నిక్షేపాలు నెలికల్‍, సపదాని తాండ, నర్సాపూర్‍, అడివిదేవపల్లి, వీర్లపాలెం కన్నెకల్‍, ఉత్కుర్‍, ముపవరం మరియు ఎర్రపల్లి పరిసరాలలో ఉన్నవి. దీనిని లైమ్‍ కిల్‍న్స్లో
ఉపయోగిస్తారు.
లెడ్‍ ఓర్‍ (గెలీనా) : ఇది స్ట్రింజర్స్, డిస్సెమినేశన్స్ రూపంలో గ్రానైట్‍ శిలల్లో కాల్‍సైట్‍ బ్యాండ్స్ ప్రక్కన దొరుకును. ఇది పెద్ద అది సర్లపల్లి చింతకుంట్ల, మల్లెపల్లి పరిసరాలలో దొరుకును.
సాప్‍స్టోన్‍ (టాల్క్) : దీనిని నిక్షేపాలు బల్క్మ్‍ అని అందరు. దీని నిక్షేపాలు కుల్కుట్‍పల్లి, జూపల్లి, దామర్‍చెర్ల ప్రాంతాలలో దొరుకును. దీనిని లోకల్‍గా డొమెస్టిక్‍ స్టోన్‍వేర్‍ మరియు స్లేట్‍ పెన్‍సిల్స్లో ఉపయోగిస్తున్నారు.
క్వార్టజ్ : గ్లాస్‍ పరిశ్రమకు మరియు ఫెర్రో అల్లాయ్‍స్‍ పరిశ్రమలకు పనికి వచ్చే క్వార్టస్ వీన్స, రీఫ్స్ రూపంలో గ్రానైట శిలల్లో దొరుకుతుంది. ఇవి దొరికే ప్రాంతాలు, మిర్యాలగూడ రామన్నపేట, హుజూర్‍నగర్‍ మరియు దేవరకొండ.

  • కమతం మహేందర్‍ రెడ్డి,
    ఎ : 91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *