పురాచరిత్రలో కొత్త వెలుగులు

హైద్రాబాద్‍ నగరానికి సమీప మండలం బొమ్మలరామారం. పేరుకు తగ్గట్టే ఈ రామారం మండలంలో ఎన్నెన్నో రాతిచిత్రాలు లభిస్తున్న చరిత్రపూర్వయుగ క్షేత్రాలు. వాటిలో మధ్యరాతియుగం, కొత్తరాతియుగం పనిముట్లు, పెదరాతియుగం సమాధులు, కొత్త, కొత్త రాతిచిత్రాల తావులు. కుంచెలతో ఎరుపురంగు గీతలలో చిత్రించిన చిత్రాలే కాదు, చేతిలోని పనిముట్లతో రాతి ఉపరితలాల మీద గీరి, గంట్లుపెట్టి వేసిన బొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) ఎన్నెన్నో. అవి పురామానవుల జీవన సంస్క•తికి దర్పణాలు. అన్వేషిస్తున్న కొద్దీ ఈ ప్రాంత మంతా పురామానవుల ఆవాసాలున్న ఆధారాలు లభిస్తున్నాయి.


మా చరిత్రబ•ందం సభ్యు లలో అహోబిలం కరుణాకర్‍, మహమ్మద్‍ నజీర్‍, అన్వర్‍, కొరివి గోపాల్‍ బొమ్మల రామారం, చీకటిమామిడి ప్రాంతంలో తాము గుర్తించిన ప్రాక్చరిత్ర జాడలను కలిసి చూడడానికి పిలిచారు. నేను, భద్రగిరీశ్‍ సార్‍, జమ్మనపల్లి రమేశ్‍ లతో చీకటిమామిడి వెళ్ళాను. అక్కడ అందరం కలుసుకుని ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకు వెళ్ళాం. కారణాంతరాలవల్ల మధ్యాహ్నమైంది. తినడానికి ఏవేవో కొనుక్కుని బయల్దేరాం. ముందుగా మాచన్‍ పల్లి రామునిగుట్ట మీదికి వెళ్ళాం. గుట్ట మీది విశేషాలు చూసాక కిందికి దిగి, మోతుకాకుల్లో పెట్టుకుని నసీర్‍ భాయ్‍ వాళ్ళు తెచ్చిన చపాతీలు తిన్నాం. అడివిలో తిండికి రుచెక్కువ. అక్కడ నుంచి లింగాపూర్‍, మూడుచింతల పల్లిలలో మా అన్వేషణలు పూర్తయేసరికి సాయంకాలమౌతున్నది. అక్కడ నుంచి తిరుగుప్రయాణం.


మా చరిత్రబ•ందం చేసిన క్షేత్ర పరిశీలనలో, అన్వేషణలో గతంలో లభించిన చరిత్రపూర్వయుగ ప్రదేశాలకన్నా విశేషమైన తావులను గుర్తించగలిగాం. దేశంలో అరుదుగా లభించిన జియోగ్లైఫ్స్ ఈ ప్రాంతంలో దొరకడం గొప్ప సంగతి.
మేం గుర్తించగలిగిన ఎరుపురంగు రాతిచిత్రాల తావులలో కాశీపేట, ప్యారారం, లింగాపూర్‍ లున్నాయి. జియోగ్లైఫ్‍, పెట్రోగ్లైఫ్స్ లున్న మూడుచింతలపల్లి, మాచన్‍ పల్లి గ్రామాలున్నాయి.
కాసీపేట వంటి ఈ ప్రదేశా లలో మెగాలిథిక్‍ సమాధుల బంతి రాళ్ళు కనిపించాయి. ప్యారారం, కాసీపేట, మాచన్‍ పల్లిలలో మధ్యరాతియుగానికి చెందిన మైక్రోలిథ్స్, ప్యారారంలో కొత్తరాతి యుగం రాతిగొడ్డలి లభించాయి. ఈ ప్రాంతంలో చాలాచోట్ల పడిపోయిన మెన్హర్ల జాడలున్నాయి.


కాసీపేట:
కాసీపేట యాదాద్రి-భువన గిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని యావాపూర్‍ గ్రామానికి మధిర (ష్ట్ర•ఎశ్రీవ•) ఊరు. ఈ ఊరిలోని ఒక చిన్నగుట్ట మీదున్న రాతిగుహ చిత్రిత శిలాశ్రయం. ఈ రాతిచిత్రాలతావులో ఎరుపురంగులో గీయబడిన నాలుగు అడివిదున్నలు, ఎక్స్రే గీతలలో ఒక మనిషి నిలబడి కనిపించాయి. రాతిచిత్రాలలోని వస్తువు, శైలులనుబట్టి, ఇక్కడ లభించిన మైక్రోలిథ్స్ (సూక్ష్మ రాతిపరికరాలు) వల్ల ఈ బొమ్మలు మధ్యరాతియుగానికి చెందినవని నిర్ధారించవచ్చు. కత్తివంటిది పట్టుకుని నిలబడిన మనిషి చిత్రం తొలిచారిత్రకయుగానికి చెందినదై వుంటుంది. ఈ రాతిచిత్రాలు హస్తాల్‍ పూర్‍, అక్షరాలలొద్ది, రేగొండ వంటి ప్రదేశాల చిత్రాలను పోలివున్నాయి.
ఈ రాతిచిత్రాలున్న గుట్ట పరిసరాల్లో పెదరాతియుగానికి చెందిన కైరన్లు, సిస్టు సమాధుల జాడలున్నాయి. మెన్హర్లున్నాయి. వీటన్నిటిని పరిశీలించినపుడు ఇక్కడ వేర్వేరు రాతియుగాల నుంచి తొలిచారిత్రకయుగందాక మానవ ఆవాసాలుండేవని తెలుస్తున్నది.


లింగాపూర్‍:
మేడ్చల్‍-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని లింగాపూర్‍ (నిర్జనగ్రామం చినపర్వతాపూర్‍ ప్రాంతం)లో కొత్తగా వెంచర్లు చేస్తున్న భూమిలో ఒక చోట 17.636054 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.71662డిగ్రీల తూర్పు రేఖాంశంపై, సముద్రమట్టానికి 544మీ.లఎత్తులో 10అడుగుల ఎత్తైన దిబ్బమీదున్న రాతిగుహ ప్రవేశంలోనే కప్పుబండ కిందివైపు ఎరుపురంగులో వేసిన రాతిచిత్రాలున్నాయి.
ఈ రాతిచిత్రాలలో వాతావరణ ప్రభావం చేత వెలిసిపోయిన చిత్రాలున్నాయి. జననాంగంతో మూపురపుటెద్దు, ఒక మనిషి చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గతంలో పూర్వ వారసత్వశాఖ డైరెక్టర్‍ వివి క•ష్ణశాస్త్రి చెప్పిన వివరణల ఆధారంగా ఈ రాతిచిత్రాలు కాంస్యయుగానికి (కొత్తరాతి యుగం) చెందినవిగా నిర్ధారించారు. దాదాపుగా ప్రస్తుతానికి 5వేల సంవత్సరాల కిందటి ఈ రాతిచిత్రాలు ఈ ప్రాంతంలో కొత్త తెలంగాణ చరిత్రబ•ందం గుర్తించిన కాసీపేట, ప్యారారం రాతి చిత్రాలతో పోలివున్నాయి. సమ•ద్ధంగా లభిస్తున్న రాతిచిత్రాలతో బొమ్మల రామారం పరిసర మండలాలు నిజంగా బొమ్మలతావులుగా ప్రసిద్ధమవుతున్నాయి.


ప్యారారం:
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని గ్రామం. బొమ్మలరామారంలో రెండు తావుల్లో బొమ్మలున్న తావు ప్యారారం. ఈ రాతిచిత్రాలలో ప్రత్యేకత వుంది. ప్యారారం చిత్తారిగుట్టమీద పెద్దరాతిగుండుమీద ఎరుపురంగులో వేసిన రాతిచిత్రాలలో మూపురపుటెద్దులు ఆరు, రెండు జింకలు, ఒక అడివిపంది, రెండు జంటలు శ•ంగారంలో ఉన్నట్లు అగుపిస్తున్నాయి. గుట్ట కింద మధ్యరాతియుగానికి చెందిన మైక్రోలిథ్స్, కొత్తరాతియుగపు చేతిగొడ్డలి, పనిముట్లను నూరుకున్న నూరుడుగుంటలున్నాయి. రెండో రాతిచిత్రాలతావులో కనిపించిన చిత్రాలలో చూస్తే ఒక మనిషి రెండుచేతులు తలపైకెత్తి నాట్యమాడుతున్నట్లు అనిపిస్తుంది. కాని, మరొక దిశలో అది రెండువైపుల శూలం కొసలతో వజ్రంవలె కనిపిస్తున్నది. ఏ మానవ,జంతు ఆక•తి కాని, రేఖలడిజైన్ల చిత్రాలు ఈ చిత్తారిగుట్ట బొమ్మల్లో ఉన్నాయి. పదివేల సం.రాల నుంచి ఇక్కడ పురామానవులు గుంపులుగా జీవించారని, ఈ చిత్రాలు వారి సంస్క•తికి సాక్ష్యాలుగా నిలిచివున్నాయి.
ఈ రాతిచిత్రాలను గుర్తించడంలో చరిత్ర బ•ందానికి ప్లీచ్‍ ఇండియా ఫౌండేషన్‍ సీఈఓ, చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డిగారు మార్గదర్శనం చేసారు.
మాచన్‍ పల్లి:
బొమ్మలరామారం మండలం మాచన్‍ పల్లి గ్రామం రామునిగుట్ట చరిత్రపూర్వయుగం నుంచి మధ్యయుగాల దాక చారిత్రక విశేషాల కూడలి.
గుట్టమీద రామాలయం, శివాలయాలున్నాయి. రామాలయం 16వ శతాబ్దంలో నిర్మితమైంది. కాని, కొత్త విగ్రహాలను పెట్టారు. పాత దేవాలయం ద్వారస్తంభాలు బయటపడేసి వున్నాయి. శివాలయంలో విష్ణుకుండినుల (5వ శ.) కాలంనాటి పెద్ద శివలింగం ఉంది. సమీపంలో ఉన్న కీసరగుట్ట మీదున్న శివలింగాలను పోలివుంది.
మాచన్‍ పల్లి రామునిగుట్టమీద రామాలయం, శివాలయాలకు తూర్పున సహజనీటిగుండం ఒడ్డున గీయబడిన ‘లాబ్రింత్‍’ ఉంది. ఈ లాబ్రింతుల కాలం విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు జియోగ్రాఫిస్టులు 8వేల సం.రాల కిందటివని, మరికొందరు కాంస్య (చాల్కోలిథిక్‍) యుగంనాటివని అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఈ లాబ్రింతులను 17వ శతాబ్దం నుంచి తాంత్రిక గ్రంథాలలో చక్రవ్యూహాలుగా పేర్కొన్నారు. హళేబీడు దేవాలయం గోడలపై మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పాల్గొన్న ‘పద్మవ్యూహం’ చెక్కబడింది.


చక్రవ్యూహం లేదా పద్మవ్యూహంగా పిలిచే పౌరాణిక యుద్ధవ్యూహాన్ని పోలిన ఈ లాబ్రింత్‍ పెట్రోగ్లైఫ్స్ ప్రపంచమంతటా చిన్నా, పెద్ద సైజులలో కనిపిస్తున్నాయి. ఏడు వలయాల ఈ రాతిచెక్కుడు బొమ్మలో ఒకే ప్రవేశద్వారం ఉంది. ఒక అడుగు వైశాల్యంతో కనిపించే ఈ లాబ్రింత్‍ చిత్రణలో మనదేశంలోని కొంకణతీరం ఉస్గలిమోల్‍, మహారాష్ట్ర గోల్కామాన్‍ లలోని ఏ పెద్ద లాబ్రింత్‍ కు తీసిపోని విధంగా ఖచ్చితమైన గీతలలో కనిపించింది. ఈ లాబ్రింత్‍ లు మానవసాంస్క•తిక విశ్వాసాలకు సంబంధించిన మిస్టిక్‍ చిత్రం. జీవన ప్రవేశం సులువే కాని జీవన గమ్యం చేరడమే గహనం (కష్టం) అనే భావనాత్మక మైనది ఈ లాబ్రింత్‍. కొందరు పురావేత్తలు ఈ లాబ్రింతులు వేటలో ‘వలపన్నడం’ వంటి వంటారు. లాబ్రింత్‍ ఆకారంలో పన్నిన వలలో చిక్కుకున్న జంతు వులు తప్పించుకోవడం అసాధ్యం.
మాచన్‍ పల్లిలో లభించిన ఈ లాబ్రింత్‍ కన్న ముందు గాంధారికోటలో రాతిగోడమీద రెండు లాబ్రింతులను పురావస్తుశాఖ అధికారి గుర్తించారు.


మూడుచింతలపల్లి:
ప్రపంచదేశాల్లో అమెజాన్‍ వంటి ప్రదేశంలో, భారతదేశంలోని కొంకణ తీరంలో కనిపించిన గుండ్రని జియోగ్లైఫ్‍ ను కొత్త తెలంగాణ చరిత్ర బ•ందం మూడుచింతలపల్లి గ్రామం బయట గుర్తించారు. బ•ంద సభ్యులతో ఈ వ•త్తకారపు రాతి రేఖాచిత్రం (జియోగ్లైఫ్‍) ను పరిశీలించిన చరిత్రకారులు, స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి ప్రసిద్ధ పురాశాస్త్రవేత్త, ప్రముఖ పురావస్తు, శిలాయుగ చిత్రకళ నిపుణులు, ఆచార్య రవి కోరిశెట్టార్‍ ను సంప్రదించిన మీదట ఇది అరుదైన రాక్‍ ఆర్ట్ అని, ఆ రేఖాచిత్రం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఇనుపయుగానికి చెందిందని, ఆ కాలపు ప్రజలు, గుండ్రంగా నిర్మించుకునే సమాధులకు ఒక నమూనాగా ఉపయోగపడి ఉంటుందని చెప్పారన్నారు.


అయితే ప్రపంచవ్యాప్తంగా లభించిన ఇటువంటి జియోగ్లైఫ్స్ మీద పరిశోధనలు జరిపిన జియోగ్రాఫర్స్ ఇది మనిషి దైవభావనకు సంబంధించినదని వ•త్తం, వ•త్తంలోపల త్రిభుజాక•తి, రేఖాఖండాలు స•ష్టికి, ప్రజననానికి గురించి తెలిపేవని అభిప్రాయపడ్డారు.
ఈ జియోగ్రాఫ్‍ కంకణాకారంలో వుంది. దీని బాహ్యవ్యాసం 20 అడుగులు(6.1 మీ.లు) అంతరవ్యాసం 17అడుగులు(5.2 మీ.లు) వ•త్త్యంతరంలో సమద్విభుజాకారంలో రెండువైపుల సమఖండరేఖలు గీసి వున్నాయి. సరిగా ఇటువంటి జియోగ్లైఫ్‍ కొంకణ తీరంలో అగుపించింది. ఈ జియోగ్లైఫ్‍ చాలా అరుదైంది. పురామానవుల ఆలోచనా సరళిని, తాత్వికతను తెలియజేసే రాతిరేఖాచిత్రం.
మానవ నాగరికతా సంస్క•తుల వికాసాన్ని వివరించే ఈ అపురూప విశేషాలన్నీ మా చరిత్రయాత్రలో మాకు లభించిన అరుదైన చారిత్రకాంశాలు. తెలంగాణ చరిత్రతొవ్వల్లో మాకు బాట చూపిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు.


ధన్యవాదాలు:
ఈ రచనకు తోడ్పడిన తొవ్వ వెలుగులు డా. ఈమని శివనాగిరెడ్డి, డా. బండి మురళీధర్‍ రెడ్డి, చకిలం వేణుగోపాల్‍ రావు, వేముగంటి మురళీక•ష్ణ, బీవీ భద్రగిరీశ్‍, అహోబిలం కరుణాకర్‍, డా.మండల స్వామి, మహమ్మద్‍ నసీర్‍, మహమ్మద్‍ అన్వర్‍, కొరివి గోపాల్‍, జమ్మనపల్లి రమేశ్‍, భాస్కర్‍ లకు…

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *