ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ

ముడుమాల గ్రామం, నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని పరిరక్షించడానికి, డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ పరిశోధనలు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో పరిశోధనా బ•ందంతో కలిసి 2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు అధ్యయనం చేశారు.


డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ 2023 సంవత్సరం జూన్‍ నెలలో, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమి ట్రస్ట్తో నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ముడుమాల గ్రామంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని పరిరక్షించడానికి, పరిశోధనలు సాగించడానికి ఒప్పందం చేసుకున్నది.
ఈ సైట్‍లో పరిశోధనను పరిశోధక బ•ందం చురుగ్గా చేపడుతోంది. ఈ ప్రాంత పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టారు. సప్తర్షి మండలం ఉన్న రాతి చుట్టూ ఇనుప కడ్డీలతో అడ్డు కట్ట ఏర్పాటు చేసారు. సందర్శకుల సౌకర్యార్థం దారిలో సూచికా ఫలకాలను పెట్టారు. నిలువు రాళ్ళవద్ద ఇంకా నక్షత్ర మండలాలు ఉన్న చోట్లలో చారిత్రక, సాంస్క•తి ప్రాధాన్యతను సూచించే ఫలకాలను ఏర్పాటు చేసారు.


మహబూబ్‍ నగర్‍ – రాయచూరు రహదారిలోని గూడేబెల్లూరు గ్రామం వద్ద జాతీయ రహదారి నుండి పర్యాటకులు సులభంగా అక్కడికి చేరుకోవడానికి వీలుగా ఈ ప్రదేశానికి దారితీసే రహదారి వెంట సూచికలను ఏర్పాటు చేశారు.


అధ్యయనంలో భాగంగా, Er. వేదకుమార్‍ మణికొండ, చైర్మన్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో పరిశోధనా బ•ందంతో కలిసి 2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు పర్యటించి ముడుమాల్‍ మెన్హిర్స్ సైట్లో పరిశోధనలు, పరిశీలనలు జరిపారు.


పరిశోధనలో భాగంగా, 21.12.2023న అంతరిక్ష చరిత్రలో జరిగే ఒక అద్భుతం ‘‘the Day of Winter Solstice’’ను వీక్షించారు.
హెరిటేజ్‍ తెలంగాణ శాఖ అధికారులు డిప్యూటీ డైరెక్టర్‍ శ్రీ రాములు నాయక్‍, డిప్యూటీ డైరెక్టర్‍ శ్రీ నాగరాజ్‍, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్‍ శ్రీ పద్మనాభం, నారాయణపేట జిల్లా యంత్రాంగం తరఫున రెవెన్యూ శాఖ క•ష్ణామండల్‍ ఎమ్మార్వో శ్రీ దయాకర్‍ రెడ్డి, శ్రీ అమర్‍నాథ్‍ ఆర్‍ఐ, ఎన్‍. తాహెర్‍, రిటైర్డ్ Dy డైరెక్టర్‍, ఏఎస్‍ఐ & అసోసియేట్‍ ప్రొఫెసర్‍ ప్రగతి, JBRAC, Ar. శశాంక్‍, క్షేత్ర, & సర్వేయర్‍ శ్రీ జయశంకర్‍లు కూడా పర్యటనలో పాల్గొన్నారు.


Er. వేదకుమార్‍ మణికొండ ఈ ఆరు నెలల్లో చేపట్టిన పనులను అంచనా వేసి, ఈ కాలంలో జరిగిన వివిధ పనుల ప్రదర్శన ఛాయాచిత్రాలను ప్రదర్శించి, DHAT బ•ందంతో సంభాషించారు, తరువాత ప్రధాన మెన్హిర్స్ అలైన్‍మెంట్స్ సైట్‍ను సంయుక్తంగా సందర్శించారు మరియు కంచె వేసిన ప్రదేశం యొక్క కల్చర్‍ బోర్డు మరియు భౌతిక స్థితితో సహా అలైన్మెంట్లతో మెన్హిర్లను చూశారు.


తరువాత కొత్తగా కనుగొన్న నక్షత్ర చార్ట్కు వెళ్ళారు. ప్రొఫెసర్‍ కె.పి.రావు కొత్తగా కనుగొన్న ప్రతినిధి బ•ందానికి నక్షత్ర చార్టు గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. తరువాత 13 ఎకరాల 7 గుంటల ప్రాంతంలో ఉన్న మెగాలిథిక్‍ శ్మశానాలు మరియు సర్క్యులర్‍ స్టోన్‍ అలైన్‍ మెంట్‍ సైట్‍, ఉర్సా మేజర్‍ (URSA Major) సైట్‍కు వెళ్లారు.


జుతీ. వేదకుమార్‍ మరియు ప్రొఫెసర్‍ కె.పి.రావు మరియు ఇతర సాంకేతిక బ•ందం ఉర్సా మేజర్‍ (URSA Major) సైట్‍లో ఉర్సా మేజర్‍ చుట్టూ ఏర్పాటు చేసిన కల్చర్‍ బోర్డులు మరియు సేఫ్టీ బార్‍లు ఏర్పాటు చేసిన విధానాలను వివరించారు.


పరిశోధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వారసత్వ తెలంగాణ శాఖ మరియు దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీలు తవ్వకాల కోసం 2 రకాల మహారాతి యుగ సమాధులను గుర్తించారు.


డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ, జిల్లా యంత్రాంగం పరిష్కరించాల్సిన మరిన్ని అంశాలను వివరించేందుకు చివర్లో సమావేశం నిర్వహించారు.
మధ్యాహ్న భోజనం అనంతరం క•ష్ణా మండల ఎమ్మార్వో సర్వేయర్‍ను అదే రోజు సాయంత్రానికల్లా ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించాలని ఆదేశించారు. సర్వేయర్‍ 13 ఎకరాల 7 గుంటల ప్రాంతంలో సరిహద్దుల మార్కింగ్‍ చేసిన సరిహద్దులను చూపించారు.


2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో డిపార్ట్ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ మరియు పరిశోధనా బ•ందం, అధికారుల పర్యటన, పనుల పురోగతి, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ప్రతిపాదనలు, తదుపరి చర్యల కోసం 2023 డిసెంబర్‍ 27న హెరిటేజ్‍ తెలంగాణ విభాగానికి నివేదికను పంపించారు.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *