మన సాహిత్యంలో దైనందిన జీవితంలో వజ్రం అనే పదాన్ని తరచుగా వింటుంటాము. ధ•ఢమయిందీ, మన్నికైనది దేన్నయినా వజ్రంతో పోలుస్తారు. వజ్రకాయము, వజ్ర సంకల్పము, వజ్రసన్నిభము ఇలా.. శక్తివంతంగా పనిచేసేదాన్ని దేనినైనా వజ్రాయుధంతో పోలుస్తారు.
వజ్రానికి పర్యాయపదాలు:
‘‘హీరక, వజ్ర, దధీత్యస్థి, సుచీముఖం, వరారకం, ఇంద్రాయుధం, భిదూరం, లోహజిత్, కులిశం, పబిః మరియు అభేద్యం’’
ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన వజ్రం సామాన్యుడి నుండి రాజుల వరకు చిరపరిచితం. అందరికి అందుబాటులో లేకున్నా వజ్ర లక్షణాలైన మెరుపు, కఠినత్వం గురించి తెలియని వారు ఉండరు. రత్నాలన్నిటిలో అతి ముఖ్యమైంది కాబట్టి వజ్రానికి రత్నముఖ్య మనే పేరు కూడా ఉంది. ఇతర రత్నాల వలె కాకుండా ఇది ఒక సాధనంగా మరియు ఆయుధాలుగా ఉపయోగించబడినది. దీనికి సహజంగానే అనేక దివ్యశక్తులు ఆపాదించ బడ్డయి. తెలుగులో దీన్ని ‘రవ్వ’ అని ప్రాక•తంలో ‘వైరమ్’ అంటారు, ఇది సంస్క•తంలో వజ్రంగా మార్పు చెందిందని ఒక వాదన కూడా ఉంది. రవ్వ మరియు వైరమ్ బహుశా భాషాపరమైన అనుబంధం కలిగియుండ వచ్చు.
వజ్ర చరిత్ర:
వేదకాలం నుండి వజ్రాలు మన నాగరికతకు సుపరిచితాలు. ఐతరేయబ్రాహ్మణ్యంలో దీని గురించి తొలిసారిగా కనిపిస్తుంది ఋగ్వేదంలో కూడా వజ్ర ప్రసక్తి కనిపిస్తుంది. ఈ పదం ఆయుధం అనే అర్ధం లో ఉపయోగించబడింది.
ఉదాహరణకి ఋగ్వేద సూక్తం:
‘ధిశ్వ వజ్రో గభస్త్యో రక్షోహత్యాయ వజ్రివః
సాదహిష్ఠా అభి స్ప•ధః’
అంటే వజ్రాయుధము (పిడుగుపాటును) కలిగినవాడా, రాక్షసుల నాశనానికి ఆయుధాన్ని నీ చేతుల్లోకి తీసుకో, నిన్ను ధిక్కరించే వారిని పూర్తిగ పడగొట్టు అని అర్థం.
పురాణాలు ఇతిహాసాల్లో వజ్ర శబ్దం వ్యక్తుల పేర్లలో, సైనిక వ్యూహ సంబంధితముగ, రసశాస్త్రములో ఔషధము గాను బౌద్ధ,జైన వాంగ్మయాలలో వివిధ ఉత్పత్తి అర్ధాలలో కనిపిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కూడా వజ్రాలు దొరికే స్థలాల ప్రసక్తి కనిపిస్తుంది. ఆ కాలంలో వజ్రాలు దొరికిన ‘సభారాష్ట్రకం, మధ్యమరాష్ట్రకం, కాశ్మకరాష్ట్రకం, శ్రీకటనకం మొదలైన’ ప్రదేశాల పేరుతోనే వాటిని గుర్తించేవారు.
దైవ సంబంధమైన కౌస్తుభమణి, శ్యమంతకమణి వంటి ప్రస్తావనలు చరిత్రలో భాగం కాకపోయినా వజ్రం యొక్క ప్రాచీనత ప్రముఖతను తెలియచేస్తాయి.
మన పూర్వీకుల నమ్మకం ప్రకారం ఇవి దధీచి ఎముకల నుండి పుట్టాయని అంటారు. బలి చక్రవర్తి శరీర భాగాలు వజ్రాలతో సహా భూమి పైన రత్నాలుగా మారాయని ఇంకో నమ్మకం.
క్షీరసాగర మధనంలో కౌస్తుభమణి వంటివి ఉద్భవించాయని మరొక నమ్మకం.
వరాహమిహిరుడు బ•హద్సంహితలో పూర్వపు నమ్మ కాలను సంగ్రహంగా ఇలా వర్ణించాడు.
రత్నాని బలాద్దైత్యద్ధిచ్తోన్యే వదన్తి జాతని కేచిద్భ్వః స్వభావాద్వైచిత్య్రాన్ ప్రాహురూపాలానామ్.
ఈ శ్లోకంలో వరాహమిహిరుడు పైన పేర్కొన్న దదీచి, బలాదిత్య ఎముకలు కాకుండ రత్నాలు భూమిలో కూడా పుడతాయి అని ఆ కాలంలో ఉన్న నమ్మకాలను సంగ్రహ పరిచాడు.
వేణానది ఒడ్డున లభించే వజ్రాలు అత్యంత స్వచ్ఛమైనవి. కోసల దేశంలో లభించే వజ్రాలు శిరీష పుష్పం (తెల్లటి పసుపు) ఛాయ ఉంటుంది. సౌరాష్ట్రలో ఎర్రటి మెరుపు, సర్పరాదేశానికి చెందినవి ముదురు రంగులో ఉంటాయి. హిమాలయ ప్రాంతపు వజ్రాలు కొద్దిగా ఎరుపురంగులో ఉంటాయి. మాతంగదేశంలో ఉన్నవి బూడిద రంగులో ఉంటాయి (వల్ల పువ్వు). కళింగదేశంలో పసుపు ఛాయ, పౌండ్రదేశంలో నలుపు (నీలం) రంగు వజ్రాలు లభిస్తాయని వరాహమిహిరుడు పేర్కొన్నాడు.
ఈ స్థానాలన్నింటికీ స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు లేవు. అంతే కాకుండా వాణిజ్య కేంద్రాలు మరియు ఉత్పత్తి స్థలాలు కలిపి ప్రస్తావించబడ్డాయి. వరాహమిహిరుడి జ్ఞానం అనుభావిక మైనది కనుక ఈ రకమైన అస్పష్టత సహజం. ఇంకా వరాహమిహిరుడు ఎవరు ఎలాంటి వజ్రాలు ధరించాలి, ఏ దేవతలకు ఎలాంటి రంగు ఆకారం వజ్రాలు ఆపాదించబడ్డాయో, వజ్రాలకు వాటి స్వచ్ఛత బరువు ఆధారంగా ఎలా విలువ కట్టాలి అనే అనేక అంశాలు బ•హద్సంహితలో చర్చించటం జరిగింది. ఇవన్నీ శాస్త్రీయ వాస్తవాలు కాదు నమ్మకాలు మాత్రమే.
వజ్రాలకు విలువ కట్టే విషయంలో మాత్రం కొన్ని ప్రమాణాలు వివరించాడు. వాటి ప్రకారం స్వచ్ఛమైన వజ్రం బరువు పెరిగినకొద్ది ద్రవ్యరూపంలో దాని విలువ ద్విగుణీక•తం అవుతుంది. వజ్రాల ధర అంచనా వెయ్యడంలో ఈ పద్ధతి నేటికీ కొంతవరకు పాటిస్తున్నారు.
ఏడవ శతాబ్దం దీ.• నుండి 1728 వరకు బ్రెజిల్‍లో వజ్రాలు కనుగొనబడే వరకు భారతదేశం వజ్రాలకు మూలం. ఇక్కడ చాలా పెద్దవి, అత్యుత్తమ నాణ్యతగల వజ్రాలు ఇక్కడ లభించాయి. ప్లినీ మరియు టోలెమీ వంటి గ్రీకు మరియు రోమన్ రచయితలు భారతదేశాన్ని వజ్రాలకు ఒక మూలంగా పేర్కొన్నారు. మార్కో పోలో రచనలలో వజ్రాల ప్రసక్తి ఉంది.
వజ్రాల ఉనికి:
వజ్రాల ఉనికి యొక్క మొదటి వివరణాత్మక రికార్డ్ టావెర్నియర్ (1605 నుండి 1689) అందించారు.
అన్ని ముఖ్యమైన డైమండ్ క్షేత్రాలు దక్కన్ పీఠభూమి అంచులలో పెన్నార్ నది (14 N LATTITUDE) నుండి గంగానది దిగువ ఉపనదుల వరకు (25 N LATTITUDE ) విస్తరించి ఉన్నాయి.
భారతదేశంలోని వజ్రాల క్షేత్రాలు నాలుగు ప్రాంతాలుగా విభజించబడ్డాయి. అవి:
- ఆంధప్రదేశ్ మరియు తెలంగాణలతో కూడిన దక్షిణ భారత ప్రాంతం: కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, క•ష్ణా మరియు మహబూబునగర్ లోని కొన్ని ప్రదేశాలు ఇందులో ఉన్నాయ్.
- పన్నా బెల్ట్తో కూడిన మధ్యప్రదేశ్ మధ్య భారతీయ ప్రాంతాలు.
- బెహ్రాదిన్ – రాయ్‍పూర్ జిల్లాలోని కొడవలి, ఛత్తీస్‍గఢ్, బస్తర్ జిల్లాలో తోకపాల్ దుగపాల్ మొదలైనవి ప్రాంతం,
- తూర్పు భారతదేశ ప్రాంతాలు, ఎక్కువగా ఒరిస్సా మహానది మరియు గోదావరి లోయల మధ్య ప్రాంతాలు
ఆంధప్రదేశ్‍లోని పెన్నా క•ష్ణ మరియు గోదావరి నది ప్రాంతాల్లో కనిపించే వజ్రాలు మచ్చలేని, రంగులేని కన్నీటిబొట్టు వలె ఉండేవి గోల్కొండ వజ్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వజ్రాలు దొరికే ప్రాంతాలన్నీ పూర్వపు గోల్కొండ రాజ్యంలో భాగంగా ఉండేవి కాబట్టి ఆ పేరు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ గుంటూరు సమీపంలోని కొల్లూరులో లభించింది.
అన్ని వజ్రాలు రత్నాలుగా అర్హత పొందవు. దోషరహితమైనవి మరియు మంచి రంగురాళ్లు రత్నాలుగా పనికివస్తాయి. రంగు తక్కువ, లోపభూయిష్టమైన రాళ్లు, చిప్స్ ముక్కలు, చిన్న కణాలు మరియు రజను, పరిశ్రమలో ఉపయోగించబడతాయి.
వజ్రాలలో రకాలు-వనరులు:
వజ్రాలు వాటి ఉపయోగాన్ని బట్టి 3 కేటగిరీలు.
1.రత్నం గ్రేడ్: 2.37% వనరులు ‘రత్న’ రకాలు. (gem grade)
2.పరిశ్రమ గ్రేడ్: 64% పారిశ్రామిక రకం industrial grade
3.వర్గీకరించబడనివి (unclassified): అత్యధిక వనరులు ఇంకా (95%).
స్థూలంగా పారిశ్రామిక వజ్రాలు 3 రకాలు
1. Balls: చిన్న వజ్రాల సమూహం, cleavage ఉండదు.
2.Borts: పసుపు బూడిద నుండి నలుపు రంగు లోపభూయిష్ట లేదా సక్రమంగా ఆకారంలోలేనివి
3.Carbonado: నలుపు చాలా కఠినమైన అపారదర్శక మరియు cleavage లేకుండా ఉండేవి.
ఇండస్ట్రియల్ క్వాలిటీ వజ్రాలను కుడా ఆభరణాలుగా ఉపయోగించడం ఇప్పుడు ట్రెండ్.
భారతదేశంలో డైమండ్ నిలువలు:
UNFS సిస్టమ్ ఆధారంగా NMI డేటా ప్రకారం భారతదేశంలోని డైమండ్ నిలువలు (రిజర్వ్/వనరులు కలిపి) 31.83 మిలియన్ క్యారెట్లుగా అంచనా వేయబడ్డాయి. వీటిలో 0.95 మిలియన్ క్యారెట్లు రిజర్వ్గాను, మిగిలినవి వనరులుగా గుర్తించబడ్డాయి.
వజ్రాల నిలువలు మధ్యప్రదేశ్‍లో 90.18%, ఆంధ్ర ప్రదేశ్ 5.72% మరియు ఛత్తీస్‍గఢ్ నుండి 4.09% ఉన్నాయి.
వజ్రాల ఉత్పత్తి మరియు నిలువలు:
పన్నా మధ్యప్రదేశ్ నుండి 2016లో 36516 క్యారెట్లు ఉత్పత్తి చేయబడ్డాయి ఇందులో 37% rough అన్‍కట్ మరియు మిగిలినవి పారిశ్రామిక నాణ్యత గల వజ్రాలు.
భారతదేశంలోని ప్రసిద్ధ వజ్రాలు:
కోహినూర్, హోప్, డ్రెస్డెన్ గ్రీన్ ఫ్లోరెంటైన్, గ్రేట్ మొఘల్, ఓర్లోఫ్ డైమండ్, పిట్ (రీజెంట్) డైమండ్ వంటివి బాగా ప్రచారంలో ఉన్న భారతీయ వజ్రాలు.
ప్రజలకు తక్కువగా తెలిసిన కొన్ని వజ్రాల వివరాలు:
అక్బర్ షార్ (గొర్రెల కాపరి రాయి): 1739 లో లభించింది. 71.70 క్యారెట్ లా వైట్ డ్రాప్ ఆకారపు రాయి ప్రస్తుతం బరోడాకు చెందిన గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉంది. ఇది ఒకప్పుడు నెమలి సింహాసనంలో భాగం.
నలుపు ఓర్లాఫ్ (eye of Brahma): 67.50 క్యారెట్ కుషన్ ఆకారంలో ఉన్న నల్లవజ్రం ప్రస్తుతం చార్లెస్ ఎఫ్ విన్సమ్ ఎన్ వై యాజమాన్యంలో ఉంది. ఇది ఒకప్పుడు 195 క్యారెట్‍లు. పాండిచ్చేరిలోని ఒక పుణ్యక్షేత్రం నుండి దొంగిలించ బడినట్లు చెప్పబడింది.
భారతదేశానికి చెందిన బ్రియోలెట్టి (Briolette of India) 93.83క్యారెట్ బ్రయోలెట్ ఆకారపు వజ్రం 1971లో ఐరోపాలో విక్రయించబడింది.
దర్యా ఇ నూర్ : 1739 కు ముందు దొరికిన వైట్ టేబుల్ కట్ డైమండ్ నాదిర్షా ద్వారా ఇరాన్ చేరింది. ఇప్పుడు ఇరాన్ ట్రెజరీలో భాగం. Great Table అనే ఈ పింక్ 242 క్యారెట్ల టేబుల్ కట్ వజ్రం 1677 కు ముందు దొరికింది . ఇరాన్ యొక్క దరియా ఇ నూర్ ఇదే కావచ్చు.
దర్యా ఇ నూర్ (ఢాకా) 150 క్యారెట్ల కుషన్ కట్ వైట్ డైమండ్ ప్రస్తుతం ఢాకా నవాబ్ వద్ద ఉంది.
బంగారు మహారాజు (Golden Maharaja): 65.60 క్యారెట్స్ గోల్డెన్ పియర్ ఆకారపు వజ్రం ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీతో
ఉంది.
Hortensia(Hydrangea): 20 క్యారెట్ల పింక్ డైమండ్, ఫ్రెంచ్ అధికారిక ఆభరణాలలో భాగం.
జహంగీర్: 83.00 క్యారెట్ల తెల్లని బేరీపండు ఆకారముగల వజ్రం ప్రస్తుత యజమాని సి పటేల్ ఇండియా. ఒకప్పుడు ఈ చెక్కబడిన రాయి నెమలి సింహాసనం లోని నెమలి ముక్కు నుండి వేలాడబడింది.
నాసిక్ వజ్రం: నాసిక్‍లోని శివాలయంలో భాగమైన 43.38 క్యారెట్ల తెల్లని ఎమరాల్డ్ కట్ ప్రైవేట్ యాజమాన్యంలోని వజ్రం.
నేపాల్ వజ్రం: 79.41 క్యారెట్ల వైట్ పియర్ కట్ గోల్కొండ Diamond ప్రైవేట్ యాజమాన్యం.
నిజాం వజ్రం: 277 క్యారెట్ల తెల్లని వజ్రం గోల్కొండ గనుల నుండి 440 క్యారెట్ల బరువును కలిగి ఉంది.
Piggott Diamond : 49 క్యారెట్ వైట్ బ్రిలియంట్ కట్. ఇది లార్డ్ పిగ్గోట్, మద్రాసు గవర్నర్కు భారతీయ యువరాజు సమర్పించినది. ప్రస్తుతం దీని జాడ తెలియని పరిస్థితి.
సాన్సీ (Astor) వజ్రం : 1593 కు పూర్వం దొరికిన ఇ వైట్ పియర్ కట్ 55 క్యారెట్ డైమండ్ ఇప్పుడు ఆస్టర్ ఎస్టేట్‍లో భాగం. హెన్రీ తన బట్టతలని కప్పుకోవడానికి ధరించినట్లు చెప్పాడు.
Shah Diamond: 1591 ముందు 88.70 క్యారెట్ వైట్ బార్ కట్ కనుగొనబడింది. ప్రస్తుత యజమాని రష్యా. 1829లో పర్షియా ద్వారా జార్‍కు బహుమతిగా ఇచ్చినట్టు చెప్పబడింది.
షా ఆఫ్ పర్షియా : 1739కు ముందు దొరికిన 99.52 క్యారెట్ల పసుపు రంగు కుషన్ కట్ డైమండ్ . నాదిర్ షా 1739లో ఢిల్లీ నుండి పట్టుకు పోయినది.
Star of East: 26.16 క్యారెట్లు తెలుపు Brilliant కట్.
Wittelsbach (The Great Blue) : 1722కు ముందు దొరికిన 35.56 క్యారెట్ల ఓవల్ కట్ బ్లూ డైమండ్. ఆస్ట్రియా యువరాణి మరియా అమేలియా పెళ్లికానుకలో భాగం.
తాజ్ ఇ మాహ్ (Crown of the Moon):1739కి ముందు దొరికిన తెల్లటి 115.05 క్యారెట్ రోజ్ కట్ డైమండ్ ఇప్పుడు ఇరాన్ ట్రెజరీలో భాగం. దరియా ఇ నూర్‍తో పాటు బ్రాస్‍లెట్‍లో జతగా సెట్ చేయండి.
వజ్రఖనిజ సమాచారం:
రసాయనిక ఫార్ములా ప్రకారం కార్బన్ డైమండ్‍లోని ప్రతి కార్బన్ పరమాణువు చుట్టూ మరో నాలుగు కార్బన్ పరమాణువులు ఉంటాయి. బలమైన సమయోజనీయ బంధం (covalent bond) ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ పరమాణువుల అమరిక వజ్రం యొక్క మన్నిక మరియు బహుముఖ ప్రత్యేకతలకు కారణం. వజ్రాలు వాటి కాఠిన్యం ఔజ్వల్యం మరియు అత్యధిక ఉష్ణ వాహకతకు ప్రసిద్ధి చెందాయి.
వజ్రాల రంగులు: చాలా వజ్రాలు గోధుమ రంగు, నలుపు లేదా పసుపు రంగులో ఉంటాయి. అవి రంగులేనివిగా కూడా ఉంటాయి. గులాబీ ఆకుపచ్చ మరియు ఎరుపు మరియు నీలం రంగులలో అరుదుగా ఉంటాయి.
streak:
చాలా కఠినంగా ఉండటం వల్ల ఎటువంటి గీత పడదు.
lustre:
అడమంటైన్, అలోహ (non metalic) ఖనిజాల అన్నీటికన్నా అత్యధిక స్థాయి మెరుపు ఉంటుంది.
Diaphanity (ప్రకాశ పారగమ్యత): పారదర్శక, అర్ధపారదర్శక మరియు అపారదర్శక.
Cleavage:పర్ఫెక్ట్ ఆక్టాహెడ్రల్ చీలిక నాలుగు దిక్కులలో.
కాఠిన్యం: మొహ్స్ స్కేల్‍లో – 10వ స్థానం. మరే ఇతర ఖనిజాలకన్న ఎక్కువ.
విశిష్ట గురుత్వం: 3.4 to 3.6.
క్రిస్టల్ సిస్టమ్: ఐసోమెట్రిక్
వజ్రాల ఉపయోగం:
అధిక విలువ గల ఆభరణాలు, అధికార చిహ్నాలు, అధిక విలువ కరెన్సీ గానే కాక, అనేక పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నయి. కాఠిన్యం కారణంగా వాటిని కటింగ్ డ్రిల్లింగ్ మరియు పాలిషింగ్‍లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వైద్యంలో, సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగాలు అనేకం. నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‍ల అభివ•ద్ధితో రోజురోజుకూ దీని ఉపయోగాలు పెరుగుతున్నాయి.
వజ్రాల లభ్యత:
కింబర్లైట్ మరియు లాంప్రోయిట్స్ అనే రెండు రకాల శిలలు వజ్రాలకు ప్రాథమిక వనరులు. క•ష్ణానది గులకరాళ్ళలో వజ్రాలు సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ ఉన్నాయి. తెలంగాణలో కింబర్‍లైట్ శిలలు కొల్లాపూర్, నారాయణపేట ప్రాంతాల్లో బయటపడ్డాయి. మూసీనది పరివాహక ప్రాంతం లో కూడా వజ్రాలు దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో లాంప్రోయిట్స్ ఉన్నట్టు తెలిసింది.
ఏవి వజ్రాలు?
150 నుండి 700 కి.మీ లోతులో వజ్రాలు ఏర్పడతాయి. అవి కింబర్లైట్ శిలాద్రవం విస్ఫోటనం వల్ల పైకి వస్తాయి. ఈ విస్ఫోటనాలు వేగంగా మరియు అకస్మాత్తుగా ఉంటాయి. కింబర్‍లైట్ అనేది సిలికా తక్కువ మెగ్నీషియం సమ•ద్ధిగా ఉన్న అంతర్గమ శిల (intrusive rock) యొక్క పేరు. ఇవి పైప్ (pype) ఆకారంలోను (dyke) డైక్ లాగ ఉంటాయి. లాంప్రోయిట్స్ (lamproits) మరియు మెగ్నీషియం సమ•ద్ధిగా ఉన్న స్ఫటికీకరించ బడిన ఇంట్రూసివ్ శిలకి ఉన్న పేరు. దీనిలో క్రస్టల్ ఖనిజం ఫెల్డ్స్పార్ ఉండదు. లాంప్రోయిట్‍లు చాలా తరచుగా కనిపిస్తుంటాయి కానీ కింబర్‍లైట్‍తో పోలిస్తే ఇందులో వజ్రాలు చాలా అరుదుగా దొరుకుతాయి.
వజ్రాలు-గుడులు:
భారతదేశంలోని అన్ని ఆలయాలలో దేవుండ్ల ఆభరణాలలో వజ్రాలు ఒక ముఖ్యమైన భాగం. ప్రసిద్ధి చెందిన ఎర్రటి వజ్రంతో సహా తిరుపతి దేవస్థానం వజ్రాలు అందరికీ తెలిసినవే. మెల్కోటే దేవస్థానం యొక్క వైరముడి సేవను ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శిస్తారు. భద్రాచల రామదాసు రాములవారికి చేయించిన కలికి తురాయి, రవ్వలమొలతాడు మొదలయినవి చాలా ప్రసిద్ధం.
జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్యను ఆయనకు ఉన్న వజ్రాల పరిజ్ఞానం వల్ల వజ్రాల వెంకయ్య అని కూడా అనేవారు.
-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్‍ఐ(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698