ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి!


గత కథనాల్లో సముద్రమథనం గూర్చిన తొలినాటి ప్రయత్నాల్ని చూసాం. మానవుడి మేధస్సుకు అందనంతగా సముద్ర లోతులున్నట్లు గుర్తించాం. వీటి అంతర్భాగాల గూర్చి తెలియకముందు వివిధ దేశాల్లో, ప్రజల్లో అనేక అభిప్రాయాలుండేవి. సనాతన దేశాలైన రోమ్‍, గ్రీస్‍, రష్యా, చైనా, భారత్‍ లాంటి దేశాల్లో సముద్రాలు దేవుడి ఆవాసాలని నమ్మేవారు. ఇవే నమ్మకాలు ఎత్తైన పర్వతాలపై కూడా ఉన్నాయి.


ఉత్తరాఖండ్‍ను, కేరళను ఇప్పటికి దైవభూమి అని సంబోధించడం తెలిసిందే! మనం నమ్మే భాగవతంలో పాలసముద్రంపై మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించగా, లక్ష్మీదేవి ఆయనకు సపర్యలు చేస్తున్నట్లుగా ప్రతీకలుంటాయి. దీన్నిబట్టి ఈ ప్రతీకల సృష్టికర్తలెవరో ఊహించవచ్చు!
ఇక శాస్త్రీయంగా సముద్రాల గూర్చి, వాటి జీవరాశి గూర్చి, సంపదలగూర్చి గత శతాబ్దంలోనే మొదలైనా, క్రీ.పూ. నుంచే వీటి గూర్చిన అనేక కథనాలు ప్రపంచ వ్యాపితంగా వున్నాయి. ఈ నమ్మకాలన్నీ ఆయా ప్రాంతాల మతాల సృష్టి అని తెలిసిందే! అవేకాలాల్లో గతితార్కిక ఆలోచనలు, పరిశీలనలు, వాస్తవాలు కూడా ముందుకు రావడం, వీటిని మతం అడ్డుకోవడం, మరణశిక్షల్ని విధించడం కూడా జరిగేది. (ఈ అంశాల్ని తర్వాత కథనాల్లో చూద్దాం!) మతం ఎంతగా అడ్డుకట్టలు వేసినా, జరగాల్సిన అభివృద్ధి, సాంకేతికత, శాస్త్రీయ ఆలోచనలు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతూ నేటి ప్రపంచావిష్కరణకు కారణమయ్యాయి. అదే విధంగా సముద్రమథనం యాంత్రీకరింబడింది. అప్పటిదాకా ఉపరితలానికే పరిమితమైన సముద్రయానాలు, లోపలి భాగాల్లో ప్రయాణించడం, లోతుల్ని, అడుగుల్ని తడమడం మొదలైంది. దీంతో సముద్రాల లోతట్టు గూర్చి, అక్కడ ఆవాసముండే అశేష జీవరాశి ఉనికి, ఇతర సముద్ర సంపదలు మానవుడి కంటపడ్డాయి. ఇలా మొదలైన పరిశోధనలు, ఒకవైపు అభివృద్ధికరంగా వుంటూనే, మరోవైపు సముద్ర జీవరాశికి ప్రాణసంకటంగా మారాయి. ఇప్పుడు సముద్రాల్లోని కొన్ని జలచరాల అంతరాత్మను తట్టిచూద్దాం!


జాస్‍ (jaws) ఓ అభూతకల్పన:
1975లో వచ్చిన హాలివుడ్‍ థ్రిల్లర్‍ చిత్రం జాస్‍ను చాలామంది చూసే వుంటారు. 1974లో పీటర్‍ బెంచ్లీ (peter benchley) రాసిన ఓ కల్పితగాధ ఆధారంగా స్టీవెన్‍ స్పీల్‍బర్గ్ (steven spelling) తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాపితంగా డాలర్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రం మా సొరచేపల (sharks) గూర్చి మానవుల్లో ఓ తప్పుడు అభిప్రాయాన్ని కల్గించింది. ఆ కథ మీ అందరికి తెలిసిందే అయినా, మరోసారి చూద్దాం! సరదాలకోసం మానవులు విహారయాత్రలు చేయడం, వేసవి విదులంటూ, సముద్రతీరాలంటూ తిరగాడడం తెలిసిందే! దీన్ని మేం తప్పుపడడం లేదుకాని, ఆయా ప్రాంతాల్లోని మానవేతర ఆవాసాల్ని మీ స్వంత జాగీర్లుగా వాడుకొని, పర్యావరణానికి, ఇతర జీవరాశికి విఘాతం కల్గిస్తున్నది కూడా వాస్తవమే! ఈ విషయాల్ని స్వయాన పర్యావరణ అభిమానులు ఎప్పటికప్పుడు బాహ్యప్రపంచానికి చెపుతూనే వున్నారు. పాశ్చాత్య దేశవాసులు సముద్రతీరాల్ని తమ స్వంత ఆవాసాలుగా చేసుకోవడంతో, తీరాలవెంట మా ఉనికికే ప్రమాదంగా మారింది. అలా ఓ సముద్రతీరంలో మా జాతిలోని ఓ తెల్లసొరచేప, విహారానికి వచ్చిన ఓ మహిళను కాకతాళీయంగా ప్రాణరక్షణకై దాడి చేయగా, ఆమె చనిపోయింది. ఇదో పాశవిక హత్యగా భావించి, ఆ సొరచేపను వెంటాడి, వేటాడి చంపడమే జాస్‍ (jaws) సినిమా కథాకామీషు. అయితే, ఇది చూడడానికి వినడానికి భాగానే వున్నా, ఆ సినిమా తర్వాత వచ్చిన సీక్వెల్‍, మా సొరచేపలు అత్యంత భయానకరమైనవిగా, మనుషుల్ని వేటాడే జీవులుగా (మేం భూమిపైకి రాకున్నా), కూ•ర మృగంగా చిత్రీకరించి, మాపైన దురభిప్రాయాన్ని కల్గించడమే ఓ బాధాకరం. ఈ కల్పితాన్ని ‘తప్పుగా’ ఏ జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు ప్రశ్నించక పోవడం మరింత బాధాకరం కాదా…


నిజానికి మేమేకాదు, మీరు కూ•రమృగాలుగా (beast & monster etc..) ముద్రవేసిన పులులు, సింహాలు, ఇతర అడవి జంతువులు, విషసర్పాలు, తదితర ఏ జంతువులు మీ మానవులకన్నా కూ•రమైనవి కాదనేది అనేక సందర్భాలలో నిరూపించబడినా, మాపైన మీ ప్రభావం అలాగే కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మరో ఉదాహరణను కూడా చూద్దాం! 1976లో ఒడియా కథ ఆధారంగా మృణాల్‍సేన్‍ తీసిన ‘మృగయా’ చిత్రాన్ని చూద్దాం! 1930 నాటి కథగా, స్థానిక ఆదివాసులకు, భూస్వాములకు మధ్యన దోపిడి, హింసను ప్రతిబింభించే ఈ చిత్రం మానవాళికి జంతువులపై ఎంతటి కపట ప్రేమో తెలుపుతుంది. నాటి బ్రిటీషు దొరలకు స్థానిక ఆదివాసి యువకుడు (మిథున్‍ చక్రవర్తి) అటవి జంతువుల్ని (పులి) చంపి కానుకగా ఇస్తే, ఆ అధికారి ప్రోత్సహించి అభిమానిస్తాడు. కాని, స్థానిక ఆదివాసుల పట్ల, మహిళల పట్ల, పులిలా వేటసాగించి, అనుభవించే ఓ భూస్వామి కూడా పులిలాంటి వాడని ఆ యువకుడు భావించి ఓ రోజు ఆ భూస్వామిని అంతమొందించి, బ్రిటీషు అధికారికి కానుకగా ఇస్తాడు. దీనికి బ్రిటీషు అధికారి భయకంపితుడై, యువకున్ని ఉరితీయిస్తాడు. నేటి సమాజానికి ఇది సబబే అని తోస్తుంది. న్యాయమే అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాలు ఓ వర్గ ప్రయోజనాల్ని కాపాడడానికే కాబట్టి, ఉరే సరైందని భావిస్తారు.


కానీ, ఏ ఒక్కరికి పులిని చంపడం కూడా మనిషిని మట్టుబెట్టినట్లేననే ఆలోచనరాదు. నేటికి ప్రపంచ వ్యాపితంగా జంతువుల్ని వేటాడినందుకు (సరదాకు/వీరోచితానికి) ఒక్కరంటే ఒక్కరికి ఉరిశిక్ష కాదుగదా, కనీస జైలుశిక్ష పడలేదు. కండలు వీరుడు సల్మాన్‍ఖాన్‍ లేడిపిల్లల్ని వేటాడి చంపినా, ఆయన కండలు మరింతగానే పెరిగాయి. ఇప్పుడేవో చట్టాలున్నాయిగాని, అవి ఎంతమేరకు పనిచేస్తున్నాయో జగమెరిగిన సత్యమే!


మా shark గూర్చిన నిజాలు:
మా జీవన విధానంపై పరిశోధన చేసిన బెంగళూర్‍కు చెందిన గజ ఈతగాడైన వ•ండిట్‍ కాలియా మాటల్లోనే వినాలి! ఈయన అండమాన్‍ నికోబార్‍ కేంద్రంగా సముద్రలోతుల్ని ఈదడానికి (swim) శిక్షణా శిబిరాన్ని నడుపుతున్నాడు.
‘‘……సొరచేపలు 90 మిలియన్‍ సం।। క్రితమే బాగా అభివృద్ధి చెందిన జీవులుగా గుర్తింపు పొందాయి. మానవుడి అభివృద్ధి క్రమం కేవలం రెండు లక్షల సంవత్సరాలే! అదీ, ఆధునిక మానవుని పరిణామం 40 వేల సంవత్సరాల కాలమే! ఆహారపు గొలుసులో, భూచరాల్లో సింహంలా పై స్థాయిలో వుండే సొరచేపలు వాస్తవంగా బిడియపు (shy) జీవులు. వాటికన్నా పెద్ద ఆకారం గల జీవులు తారసపడితే అవి తప్పుకొని పక్కకు పోతాయి. చివరికి సముద్రలోతుల్లో ఈదే మానవుల ఈత పరికరాల్ని భారీవిగా భావించి దూరంగా పోతాయి. తెలివిలో, బుద్ది కుశలతలో డాల్ఫిన్లతో సమానంగా వుండే ష్కార్క్లు మానవులకు మించిన మానవీయతను కలిగిన జీవులు. ఇలాంటి సాధుజంతువులను ప్రపంచ వ్యాపితంగా మానవులు సరదాకోసం, ఆహారం కోసం వీటి నుంచి లభించే నూనేకోసం చంపడం జరుగుతూనే వున్నది. అవికాకుండా, ఈ చేపలచే మానవులకు ఏదైనా జరుగుతే, జాస్‍ సినిమా తిరిగి పునరావృత్తమే అవుతున్నది. దీనితో వీటి సంఖ్య రోజురోజుకు క్షీణిస్తూ వుండగా, వీటి మందకోడి సంతానోత్పత్తి విధానం కూడా వీటి సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం!..’’


మేమెన్ని రకాలో:
అతి పురాతన జాతిగా, డైనోసార్స్ కాలం నాటివిగా చెప్పబడే మా జాతిలో 500 రకాలకు పైగా వున్నట్లు అంచనా. ప్రపంచ వ్యాపిత సముద్రాల్లో మా జాతులు సుమారు ఒక బిలియన్‍కు పైగా ఉన్నట్లుగా కథనాలు. మీ మానవులు, మా ఆకారాన్ని బట్టి, రంగును బట్టి మాకు పేర్లు పెట్టారు. ఇందులో కొన్ని ముఖ్యమైనవి.

1.గ్రేట్‍ వైట్‍ ష్కార్క్
2. హామర్‍హెడ్‍ ష్కార్క్
3.టైగర్‍ ష్కార్క్
4. వేల్‍ ష్కార్క్
5.బాస్కింగ్‍ షార్క్
6. నర్స్ షార్క్
7.బ్లూ షార్క్
8. లియోపార్డ్ షార్క్
9.జీబ్రా ష్కార్క్
10. బుల్‍ షార్క్


వ్యక్తిగతంగా మా జాతి చేపలకు ఎలాంటి బొక్కలు (bones) వుండక, ఓక్కో జాతి సొరచేపకు ఒక్కోతీరు పంటివరుస వుండడం మా ప్రత్యేకత. మా చర్మం గరుకుగా (sandpaper) వుండడం కూడా మాకు ప్రాణ సంకటంగా మారింది. మరో విచిత్రమేంటంటే, మా జీవి రెండు రకాల ప్రత్యుత్పత్తి విధానాన్ని కలిగి వుంటాయి. కొన్ని జాతులు గుడ్లను పెట్టి (oviparous) సంతానోత్పత్తిని జరుపుకుంటే, మరికొన్ని నేరుగా పిల్లల్ని కని (viviparous) వదిలేస్తాయి. 16వ శతాబ్దపు చివరిదాకా, మమ్మల్ని సముద్ర కుక్కలని కూడా అనుకునేవారు.


వైవిధ్యభరిత ఆకృతి:

ఇతర జంతువుల్లా మా ఆకృతి ఒకేతీరుగా కాకుండా, విభిన్న ఆకృతుల్ని కలిగివుంటాయి. మా ఆకృతిని బట్టి మాకు మీరు పేర్లు పెట్టారు కూడా! తిమింగలానికి (nobrask) సుమారు 4-10 రెట్ల బరువుతో మాలోని కొన్ని జాతులుండగా, అతిచిన్న సొరచేప లాంట్రెన్‍ ష్కార్క్ (శ్రీ•అ•వతీఅ •ష్ట్ర•తీ•) సుమారు ఏడు అంగుళాలకు మించకపోవడం గమనార్హం.
భూమిపై, సముద్రాల్లో ఉండే అన్ని జంతువులకన్నా, మేమే అత్యంత పెద్ద జంతువులు కావడం మాకు గర్వకారణమే! మాలోని రెండు ప్రధాన రకాల పొడవు, బరువు చూడండి.


బ్లూష్కార్క్ – సుమారు 30 మీటర్ల పొడవుతో 80టన్నుల బరువుతో అనగా- 40 ఏనుగులతో, 2700 మంది మనుషుల బరువుతో సమానముగా వుంటుంది.
వేల్‍ష్కార్క్ – బ్లూషార్క్ కన్నా కొంచెం తక్కువ పరిమాణం కలిగి వుంటుంది.


లోతట్టు సముద్రాలే మా ఆవాసం:
మా ఆకృతిని బట్టి మా తిరుగాడే ప్రాంతం వుంటుంది. సుమారు తీరాన్నుంచి 50-60 కి.మీ. లోతుల్లో మేం నడయాడగా, మేం తీరప్రాంత జంతువులుగా భావించి మమ్మల్ని వేటాడం జరుగుతున్నది. చెప్పడానికి మాకు పులులతో సమాన హోదాను ఇచ్చినా, మాకోసం రక్షణ సముద్రం (protected area) లేదు. మా వృంతాల (fins)తో తయారయ్యే సూపుకు విపరీతమైన డిమాండ్‍ ఉండడంతో, ఒక్క వృంతం ధర సుమారుగా 57,000 డాలర్లు పలుకుతుంది. అంటే మీకు నమ్మకం కుదరకపోవచ్చు. ఇది అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో మా సూపు ధర చూస్తే తెలుస్తుంది.


మా చర్మం గరుకుగా వుండడంతో దంతాల (ivory), కర్ర (wood) పాలిషింగ్‍కు sandpaper గా వాడతారు. మా మాంసం రుచికరమే! మా నుంచి లభించే నూనెను తోలు పరిశ్రమలలో వాడుతారు. ఇన్ని రకాల ఉపయోగాలచేత•, మేము నిత్యం వేటాడుబడుతున్నాం. అధికారిక లెక్కల ప్రకారమే, సంవత్సరానికి వందమిలియన్ల సొరచేపలు వేటాడబడుతున్నాయట!


ఈ విధంగా నిత్యవేటలో ఇనుప వలల్లో చిక్కుకొని, పెద్ద పెద్ద ఓడల తాకిడికి గురై ప్రపంచ వ్యాపితంగా నిత్యం వేలాదిగా అసువులు కోల్పోవడంతో, మాజాతిని శీఘ్రంగా అంతరించుతున్న, అపాయకర, కొన్ని జాతులనైతే అంతరించిన జాబితాలో (IUCN) చేర్చింది తెలిసిందే. ఆ సంస్థ ప్రచురించే రెడ్‍లిస్టు (red list) లో మేం పై స్థాయిలో వున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే దశాబ్దకాలంలోనే డైనోసార్స్ పక్కన మేం చేరిపోతాం! ఎంచక్కా మా నమూనాల్ని (models) మీరు మీ పిల్లల పార్కుల్లో ఏర్పాటు చేసి, మా గూర్చిన గొప్పలు చెప్పుకోవచ్చు! చందాలు వసూలు చేసి దందాలు చేసుకోవచ్చు! నిస్సారమైన సముద్రాల్లో ఆవాసాల్ని ఏర్పర్చుకొని మహదానందం పొందవచ్చు!.


ఇంకేంటి… మీమీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకొండి!
(హెమ్మింగ్‍వే రాసిన నవల The old man& the sea పుల్జిర్‍, నోబెల్‍ బహుతి పొందింది. ఇందులో షార్క్లను వేటాడే విధానం, శాంటియాగో (హీరో) వీటిని ఎలా చంపుతాడో తెలుస్తుంది.)
(వచ్చే సంచికలో మరికొన్ని సముద్ర జంతువుల గూర్చి చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *