బీహార్‍లోని బనారస్‍లోని ఒక యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని, 1930లలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురద•ష్టవ శాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది.
మండల్ తన 23వ యేటా జిల్లా కౌన్సిల్‍కి ఎన్నికయ్యాడు. 1952లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.
1967లో జరిగిన ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన క•షి అద్భుతం. ఆయన ప్రచారం వల్ల 1962లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడింది. 1968 ఫిబ్రవరి 1న అతను బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించాడు.
1974లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేత•త్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. 1977లో జనతా పార్టీ తరపున లోక్ సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగాడు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించాడు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పని చేసాడు.
బిపి మండల్ చైర్మన్‍గా ఐదుగురు సభ్యుల పౌరహక్కుల కమిషన్‍ను డిసెంబర్ 1978లో, ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ నియమించారు. అణగారిన తరగతులకు మండల్ యొక్క దీర్ఘకాల మద్దతు ఫలితంగా ఈ కమిషన్ ఏర్పడింది, దీనిని ‘‘మండల్ కమిషన్’’ లేదా ‘‘వెనుకబడిన తరగతుల కమిషన్’’ అని పిలుస్తారు.
కమిషన్ నివేదిక 1980లో పూర్తయింది. అన్ని ప్రభుత్వ మరియు విద్యా స్థలాలలో గణనీయమైన భాగాన్ని ఇతర వెనుకబడిన తరగతులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను ప్రధాని ఇందిరా గాంధీ నిరవధికంగా ప్రవేశపెట్టారు. ఒక దశాబ్దం తరువాత, ప్రధాన మంత్రి •• సింగ్ మండల్ నివేదిక యొక్క సిఫార్సులను అమలు చేశారు. ఇది 1993లో అమలులోకి వచ్చింది.
మండల్ కమీషన్‍ను అనేక అగ్రవర్ణ సంఘాలు వ్యతిరేకించాయి. బిసి రిజర్వేషన్ వ్యతిరేకులు, దేశవ్యాప్తంగా నిరసనలు మరియు ఆందోళనలకు దిగి విధ్వంసం స•ష్టించారు.
బిపి మండల్ 1982 ఏప్రిల్ 13న మరణించాడు. అతని భార్య సీతా మండల్. వారికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత ప్రభుత్వం 2001లో బి పి మండల్ గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదలచేసింది.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88