కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయిం చాలని మాత• దినోత్సవంను ఏర్పాటుచేశారు.
అమ్మ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా కన్న తల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అమ•తం ఎలా ఉంటుందో తెలియదు. కానీ అమ్మ ప్రేమ ముందు అది ఎంతో తక్కువ. నిజంగా బ్రహ్మ స•ష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. నిజానికి బ్రహ్మను స•ష్టించ లేదు అమ్మే బ్రహ్మని స•ష్టించింది. అమ్మ గొప్పతనం వర్ణించలేము. అందుకే అమ్మకి ఒకరోజు అంకితం చేశారు.. అసలు ఈ మదర్స్ డే వెనుక కథ ఏంటి..
అమ్మ ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు. నవమాసాలు మోసి కష్ట పడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తయితే… రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్ట పడేది అమ్మ. ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా తక్కువే అవుతుంది.
ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిని గౌరవించాలి. ప్రతి రోజూ అమ్మని ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అతి పేద వాడు ధనం లేని వాడు కాదు అమ్మ ప్రేమ లేని వాడే ప్రపంచంలో అతి పేద వాడు. ఇక మదర్స్ డే గురించి చూస్తే… ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాత• దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. నిజానికి మదర్స్ డే వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంది. గ్రీస్‍లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు.
17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‍లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. అదే 1872లో అయితే జూలియ వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్విస్ అనే మహిళ ఎంతో క•షి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాత• దినోత్సవం కోసం ఎంత గానో ప్రచారం చేయడం జరిగింది.
అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాత• దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి కూడా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
- సత్యప్రసన్న
ఎ : 9030 6262 88