వయనాడ్ నేపథ్యంలో.. తూర్పు కనుమల్ని కాపాడుకుందాం!! తూర్పు కనుమల్ని ప్రపంచ సహజ వారసత్వ సంపదగా ప్రకటించాలి
ప్రకృతి ఎంత సుందరమైనదో, ఎంత దృఢమైనదో అంత సున్నితమైనది కూడా. ప్రకృతి సకల జీవరాశికి ఆవాస నిలయమే కాదు ఆ జీవరాశి మనుగడకు తరగని వనరుల పెన్నిధి కూడా. సకల జీవరాశి ప్రకృతిని తమకు అవసరమైనంత వరకే ఉపయోగించుకుంటాయి. ఒక్క మనిషి మాత్రమే స్వార్థ చింతనతో, సుఖలాలసతో తనకున్న సాంకేతిక జ్ఞానంతో ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడు. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టాడు. వైవిధ్యపూరితమైన సమస్త జీవరాశి (మనుషులతో కలిపి)కి హానికలిగించే ఏ అభివృద్దీ వాంఛనీయం కాదు. …