అహోం రాజుల సమాధులు మొయిడామ్స్

భారతదేశంలోని అసోంలో ఉన్న అహోం రాజుల సమాధులు మొయిడామ్స్కు తాజాగా మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక సంపద కేటగిరీలో చేర్చారు. దిల్లీలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి 2014లోనే 90 రాయల్‍ మొయిడామ్స్ కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ టెంటేటివ్‍ లిస్ట్లో స్థానం దక్కింది. క్రైటీరియా 3, 4 ల కింద వాటి నామినేషన్‍ కోసం ప్రయత్నాలు జరిగాయి.


సార్వత్రిక విలువ
చరాయ్‍ దేవ్‍ ప్రాంతంలోని మొయిడామ్స్ అనేవి ఒకే చోట ఉన్న తాయ్‍ – అహోం రాజుల గొప్ప సమాధులు. అవన్నీ కూడా సామాన్య శకం 13వ శతాబ్ది మొదలుకొని 19వ శతాబ్ది దాకా, 600 ఏళ్ల కాలానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఒక విశిష్ట అంత్యక్రియల సంప్రదాయాన్ని సూచిస్తాయి. తాయ్‍ పూర్వీకుల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. భూమి – స్వర్గం మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేస్తాయి. మరణించిన తాయ్‍ – అహోం రాజులు దేవతలుగా మారి ప్రజలను ఆశీర్వదిస్తారు. మె- డామ్‍ మె – ఫి, తర్పణ్‍ పేరుతో పూర్వీకులను ప్రజలు గుర్తు చేసుకుంటారు.
ప్రతీ మొయిడామ్‍ కూడా నేలపై ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని (గా – మొయిడామ్‍), దానిపై పవిత్ర స్థలాన్ని (చౌ – చాలి)ని కలిగి ఉంటుంది. చుట్టూరా అష్టభుజి ఆకారంలో ఒక పొట్టి గోడ కూడా ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉండే ప్రాంతంలోనే ఒక గుంత లాంటి నిర్మాణంతో ఒక గది లాంటిది ఉంటుంది. దాన్ని టాక్‍ అని అంటారు. అందులోనే రాజు భౌతిక కాయం, వస్తువులు లాంటివి ఉంటాయి. ఆర్కిటెక్చర్‍ లో చోటు చేసుకున్న పరిణామం (చెక్క నుంచి ఇటుక, రాళ్ల దాకా), తాయ్‍ అహోంల స్థానికీకరణలను గమనించవచ్చు.


ఎత్తయిన ప్రాంతంలో ఉండే ఈ మొయిడామ్స్ను పవిత్ర అటవీ ప్రాంతాలుగా భావిస్తారు. సాధారణంగా ఇవి కందకాలు, జలాశయాలు లాంటి వాటితో అనుసంధానమై ఉంటాయి. తాయ్‍ – అహోమ్‍ రాజుల సమాధులన్నీ ఇదే విధంగా ఉంటాయి. బఫర్‍ జోన్‍లలో ఉండే పవిత్ర కొండ శిఖరాలు, ప్రధాన ఆలయాలు, జలాశయాలు, ఊరేగింపు వీధులు లాంటివన్నీ కూడా మొయిడామ్‍ ల్యాండ్‍ స్కేప్‍లో భాగాలుగా ఉంటాయి.
చరాయ్‍ దేవ్‍లోని మొయిడామ్‍ ల్యాండ్‍ స్కేప్‍ తాయ్‍ రాజకుటుంబ అంతిమ సంస్కార ఆర్కిటెక్చర్‍, ల్యాండ్‍ స్కేప్‍ ప్లానింగ్‍ కు సమగ్ర నిదర్శనంగా నిలుస్తుంది. తాయ్‍ – అహోం సాంస్కృ తిక వారసత్వం, సాంకేతికతలు, కళాత్మకతకు, అదే విధంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాలు పంచుకున్న వారసత్వానికి ప్రతీకగా ఉంటుంది.


నామినేషన్‍కు ప్రాథమ్యం
ప్రాథమ్యం 3 – ఒక సాంస్కృతిక ఆచారం లేదా నేటికీ కొనసాగుతున్న లేదా అంతరించిన నాగరికతకు సంబంధించి ప్రత్యేకత లేదా ఉత్క•ష్టతను కలిగిఉండడం.
ఈ విశిష్ట అంతిమక్రియల ఆర్కిటెక్చర్‍ అయిన ల్యాండ్‍ స్కేపింగ్‍, దానితో ముడిపడిన ఆచారాలు శక్తివంతమైన తాయ్‍ – అహోమ్‍ రాజవంశ సంప్రదాయాలను సూచిస్తాయి. చరాయ్‍ దేవ్‍ తమ పవిత్ర అధికార కేంద్రంగా అహోం రాజులు ఆరు శతాబ్దాల పాటు అస్సామీ సమాజం, దాని సంస్కృతి, సంబంధించి ఆచార వ్యవహారాలకు పునాదులు వేశారు.
మొయిడామ్స్ ప్రకృతి సహజసిద్ధ వాతావరణంలో నిర్మితమయ్యాయి. ఇవి దేవుడి వంటి అహోం రాజులను అమరులుగా చేస్తాయి. తాయ్‍ స్వర్గం గురించి ఆధ్యాత్మిక చిత్రాన్ని అందిస్తాయి. చరాయ్‍ దేవ్‍ వద్ద ఉండే తాయ్‍ – అహోమ్స్ అంతా కూడా పూర్వీకుల పూజలు చేస్తారు, తర్పణాలు వదులుతారు. రక్షణ కల్పించే ఆత్మలుగా తమ రాజులు ఇక్కడికి వస్తారని వారు విశ్వసిస్తారు. అంతేగాకుండా ఆగ్నేయాసియా అంతటా తాయ్‍ ఉపవర్గాలలో అవి పంచుకున్న సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ఇవి చాటిచెబుతాయి. స్థానికి సమూహాలతో సమ్మిళితం కావడానికి ముందు వారికి ఉన్న ప్రత్యేకతను ఇవి తెలియజేస్తాయి.
ప్రాథమ్యం-4 అనేది మానవ చరిత్రలో గణనీయ దశ(ల)ను వివరించే ఒక రకం నిర్మాణం, ఆర్కిటెక్చరల్‍ లేదా టెక్నలాజికల్‍ ఎన్సెంబుల్‍ లేదా ల్యాండ్‍ స్కేప్‍ కు తిరుగులేని నిదర్శనంగా ఉండడం.


చరాయ్‍ దేవ్‍ రాజకుటుంబ శ్మశానం ఎంతో ప్రత్యేకమైంది. ఉన్నత స్థాయి ఆర్కిటెక్చర్‍, ప్లానింగ్‍ ను కలిగిఉంటుంది. ప్రొటొ-తాయ్‍ విశ్వాసాలకు ఉన్నతస్థాయి నిదర్శనంగా ఉంటుంది. ప్రతీ మొయిడామ్‍ కూడా ఎత్తయిన ప్రాంతాన్ని (గా – మొయిడామ్‍), దాంతో పాటే ఆష్టభుజి ఆకారానికి మధ్యలో ఒక పవిత్ర పీఠాన్ని కలిగి ఉంటుంది. ఈ అష్టభుజి ఆకారం తాయ్‍ విశ్వానికి ప్రతీక. గా – మొయిడామ్‍ లోపల గుంత (గర్వ)తో పాటుగా వాల్ట్ (తక్‍) లాంటి నిర్మాణం ఉంటుంది. గుంతలో భౌతికకాయాన్ని ఉంచుతారు. తక్‍ ను నిర్మించేందుకు ఉపయోగించే పదార్థాల్లో మార్పులు వివిధ కాలాల్లో మొయిడామ్‍ ఆర్కిటెక్చర్‍ లో చోటు చేసుకున్న మార్పులను సూచిస్తాయి. తాయ్‍ నిర్మాణం బ్రహ్మపుత్ర మైదానాల్లో స్థానికీకరణ చెందడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
ఎత్తయిన స్థలంపై ఉండే మొయిడామ్స్ అడవిలోని గుట్ట లాంటి భాగాన్ని తలపించేలా ఉంటాయి. చుట్టూరా ఉండే ప్రవాహాలు, కొండల మధ్య ఉండే ఈ నిర్మాణాలు స్వర్గాన్ని తలపింపచేస్తుంటాయి. ఏటా జరిగే పూర్వీకుల ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రజలు వీటిని సందర్శిస్తుంటారు.


సైట్‍ చరిత్ర
మొయిడామ్స్ అనేవి అహోం రాజుల సమాధులు. ఆర్కిటెక్చరల్‍, ల్యాండ్‍ స్కేపింగ్‍ మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇవి అసలైన తాయ్‍ విశ్వాస వ్యవస్థ వ్యక్తీకరణలు. స్వర్గం – భూమి మధ్య ఉండే సంబంధాన్ని ఇవి గొప్పగా చెబుతాయి.
తాయ్‍ స్వర్ణయుగంలో స్వర్గాన్ని అన్వేషిస్తూ తాయ్‍ – అహోమ్స్ బ్రహ్మపుత్ర లోయను చేరుకున్నారు. చరాయ్‍ దేవ్‍ అనే ప్రాంతంలో సియు – ఖా – ఫా (మొదటి అహోం రాజు) తన రాజధాని నెలకొల్పి తన వంశ క్రమాన్ని ప్రారంభించారు. ఈ వంశానికి చెందిన రాజులు అసోం ఏకీకరణకు పాటుపడ్డారు. కళలను, వాస్తుశిల్పాన్ని ఆదరించారు. సాహిత్యాన్ని ప్రోత్సహించారు. భాషకు, మతానికి పెద్దపీట వేశారు. నేటి ఆధునిక అసోంకు బీజం వేసింది ఈ వంశానికి చెందిన రాజులే.


అహోం రాజ వంశం పతనమైన తరువాత వారి సమాధులు దట్టమైన అడవుల్లో ఎవరికంటా పడకుండా ఉండిపోయాయి. 20వ శతాబ్దంలో వాటిని తిరిగి కనుగొన్నారు. 1970లో ఆర్కియలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా ‘గ్రూప్‍ ఆఫ్‍ ఫోర్‍ మొయిడామ్స్’ ను కాపాడింది. చరాయ్‍ దేవ్‍ మొయిడామ్‍ ను ఆర్కియాలజీ డైరెక్టరేట్‍ 1981లో లిస్టింగ్‍ చేసింది. 2015లో నోటిఫై చేసింది.


-సువేగా, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *