భారతీయ వారసత్వ చరిత్రలో అపూర్వ ఘట్టం

UNESCO INSCRIPTION 2024 – ROYAL AHOM MOIDAMS, ASSAM, INDIA

వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ 46వ సెషన్‍ 2024 జులై 21 నుంచి 31 వరకు మొదటిసారిగా భారతదేశంలో జరిగింది. ఈ సందర్భంలోనే అసోంలోని మొయిడామ్స్ నామినేషన్‍ కూడా చోటు చేసుకుంది. భారతదేశానికి చెందిన 43వ ప్రాచీన కట్టడాన్ని వరల్డ్ హెరిటేజ్‍ జాబితాలో చేర్చే సందర్భంగా జరిగిన సమావేశం భారతదేశానికి ఎంతో ముఖ్యమైందిగా మారింది. ఈ నేపథ్యంలో నాటి సమావేశం జరిగిన తీరుతెన్నులు క్లుప్తంగా….
ఛైర్‍ పర్సన్‍: మొయిడామ్స్ గురించి వివరించాల్సిందిగా ఐకొమస్‍ ప్రతినిధిని కోరుతున్నాం.
ఐకొమస్‍ ప్రతినిధి:
తూర్పు అసోంలోని చరాయ్‍ దేవ్‍ ప్రాంతంలో ఈ మొయిడామ్స్ఉన్నాయి. ఈ ఎత్తయిన సమాధులు అక్కడి ల్యాండ్‍ స్కేప్‍ విశిష్టతలతో మిళితమవుతూ పవిత్రమైన భౌగోళిత కను సృష్టించాయి. వివిధ పరిమాణాల్లో ఉన్న 19 మొయిడామ్స్ తాజాగా నామినేట్‍ అయిన వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 600 వందల ఏళ్ల కాలానికి చెందినవి. నేలపై ఇటుకలు, రాళ్లతో లేదా మట్టితో నిర్మించిన హాలో వాల్ట్ (గది లాంటి నిర్మాణం) ను మట్టితో కవర్‍ చేసేలా ఇవి నిర్మితమయ్యాయి.
ఈ గదులు ఖననం చేయబడిన రాజుల, రాజకుటుంబీకుల భౌతికకాయాల అవశేషాలను కలిగిఉన్నాయి. సమాధి చేసేటప్పుడు భౌతికకాయాలతో పాటు ఉంచిన వివిధ వస్తువులు కూడా ఉన్నాయి. వీటి బఫర్‍ జోన్‍ కలో మొయిడామ్స్తో పాటుగా కాలిబాటలు, సరస్సులు కూడా ఉన్నాయి. నామినేషన్‍ మదింపు పక్రియ సందర్భంగా ఈ విశిష్టతలన్నిటినీ జాబితా చేశారు. ఈ బఫర్‍ జోన్‍ కు న్యాయపరమైన సంరక్షణను అసోం ప్రభుత్వం అందిస్తోంది. ఈ సైట్స్ ను ఒక్కో దాన్ని విడిగా కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.


తాయ్‍ అహోమ్‍ రాజుల అవశేషాలను కలిగిఉన్న ఈ మొయిడామ్స్ తాయ్‍ విశ్వాసాలను ప్రతిఫలించే కళాత్మకతో ఉన్నాయి. సహజ భౌగోళిక తీరుతెన్నులను, సరస్సులను, అడవులను ఉపయోగించుకుంటూ, మార్చుకుంటూ అవి రూపుదిద్దుకున్నాయి. ఈ సైట్స్ అహోం అంత్యక్రియల సంప్రదాయాలకు చక్కటి నిదర్శనాలు. సంప్రదాయాలతో ముడిపడిన విశ్వాసాలు కంటికి కనిపించే రీతిలో ఇవి చేస్తున్నాయి. ఎవాల్యూయేషన్‍ సందర్భంగా కంపారిటివ్‍ అసెస్‍ మెంట్స్ అందించబడ్డాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలకు సంబంధించి భారతదేశంలో ఇతర ప్రాంతాలు, అదే విధంగా ఇతర థాయ్‍ ఎత్నిక్‍ సమూహాలకు చెందిన వాటి పోలికలు అందించబడ్డాయి. ఆసియా ఖండంలోని వైవిధ్యభరిత సంస్కృతుల సందర్భాన్ని మరింత ప్రగాఢంగా అర్థం చేసుకునేందుకు ఇవి తోడ్పడుతాయి.
ఈ నామినేటెడ్‍ ప్రాపర్టీ అహోం రాజుల నిర్దిష్ట ఎత్తయిన సమాధుల ఆచారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైంది. బ్రహ్మపుత్ర లోయ అంతటా మొయిడామ్స్ ఉన్నప్పటికీ, నామినేట్‍ అయిన ప్రాంతంలో ఉన్నవి మాత్రం మరింతగా ఉన్నతమైనవి. ఈ నామినేటెడ్‍ ప్రాపర్టీ 5వ క్రైటీరియాను కనబర్చడం లేదని ఐకొమస్‍ భావిస్తున్నప్పటికీ, క్రైటీరియా 3, 4 లను మాత్రం ఇది కనబరుస్తుంది. ఆ విధంగా చూస్తే అథెంటిసిటీ, ఇంటిగ్రిటీలకు అవసరమైన ఆవశ్యకతలు లభించినట్లయింది. స్థానిక సమూహాలు ఈ మొయిడామ్స్ ను పవిత్ర సమాధులుగా భావిస్తూ వాటిని సంరక్షిస్తుంటాయి. వాటి నిర్వహణకు పాటుపడుతుంటాయి. ఈ సమాధుల వద్ద ముఖ్యమైన తాయ్‍ అహోం ఆచారాలు పాటించబడుతుంటాయి. నామినేట్‍ అయిన ప్రాపర్టీ చక్కగా నిర్వహించబడుతోంది. భారీ వర్షపాతం, నేల కొట్టుకుపోవడం, సమాధుల మీద రకరకాల మొక్కలు పెరగడం లాంటివి చోటు చేసుకుంటున్నప్పటికీ, మొత్తం మీద ప్రభుత్వపరమైన సంరక్షణ కూడా బాగుంది. భారత ఆర్కియాలజికల్‍ సర్వే తో పాటు అసోం ప్రభుత్వ ఆర్కియాలజీ విభాగం కూడా ఈ సమాధుల సంరక్షణలో భాగస్వాములుగా ఉన్నాయి.


నామినేటెడ్‍ ప్రాపర్టీలో నాలుగు సమాధుల గ్రూప్‍ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కట్టడంగా గుర్తింపు పొందింది. అవి జాతీయ చట్టాల కింద సంరక్షించబడుతున్నాయి. మిగిలినవి అసోం ప్రభుత్వంచే ప్రాచీన కట్టడాలుగా గుర్తింపు పొంది, రాష్ట్ర చట్టాల కింద సంరక్షణ పొందుతున్నాయి.
రక్షణ, నిర్వహణ తగినంతగా ఉన్నాయని ఐకొమస్‍ భావిస్తున్నప్పటికీ, దాని ప్రభావశీలత మాత్రం జాతీయ, రాష్ట్ర వారసత్వ కట్టడాల సంరక్షణ సంస్థల మధ్య ఉండే సమన్వయంపై, స్థానిక సమూహాలు మమేకం కావడంపై ఆధారపడి ఉంటుంది. సమన్వయపూరిత నిర్వహణ, నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రం తగు యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ పర్యాటకం నిర్వచనానికి, అదే విధంగా స్థానికుల భాగస్వామ్యం పెంచడం లాంటి వాటితో సహా ఇతర అంశాలపై నిర్వహణ వ్యవస్థలను మరింతగా అభివృద్ధి చేయాలని ఐకొమస్‍ సిఫార్సు చేసింది. నామినేటెడ్‍ సైట్‍ ప్రతిపాదిత అవుట్‍ స్టాండింగ్‍ యూనివర్సల్‍ వాల్యూపై ఐకొమస్‍ ఎవాల్యూయేషన్‍ సమ్మరీను కూడా తెలియజేస్తున్నాం. ఇక చివరిగా, ఈ మొయిడామ్స్ ను వరల్డ్ హెరిటేజ్‍ లిస్ట్లో 3, 4 ప్రాథమ్యాల పరంగా చేర్చాలని ఐకొమస్‍ సిఫారసు చేస్తోంది. ఈ ప్రాపర్టీ దీర్ఘకాలిక సంరక్షణకు గాను మరెన్నో సిఫారసులను కూడా చేసింది. థ్యాంక్‍ యూ.


ఛైర్‍ పర్సన్‍:
మీ ప్రజంటేషన్‍ కు థ్యాంక్‍ యూ.
థాయ్‍ ల్యాండ్‍ ప్రతినిధి:

ఎవాల్యూయేషన్‍ కు సంబంధించిన విస్తృత సమాచారం అందించినందుకు సలహా సంస్థలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు తెలుసు, ఈ సైట్‍ పై వచ్చిన వ్యాఖ్యలతో మేం పూర్తిగా ఏకీభవిస్తున్నాం. అందుకే ఈ సైట్స్ ను జాబితాలో చేర్చడానికి మేం గట్టిగా మద్దతు పలుకుతున్నాం.
ఛైర్‍ పర్సన్‍:
మంచిది. వియత్నాం వ్యాఖ్యలకు ధన్యవాదాలు. ఇక ఎలాంటి వ్యాఖ్యలు అవసరం లేదనుకుంటున్నాను. ఇక మనం ప్రొసీడ్‍ కావచ్చు.
జాంబియా ప్రతినిధి:
ఈ ప్రతిపాదనకు మద్దతు తెలియజేస్తున్నాం. ఐకొమస్‍ కృషి ప్రశంసనీయం.
ఛైర్‍ పర్సన్‍: ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అలా చేయడాని కంటే ముందుగా, ప్రతిపాదిత ముసాయిదా నిర్ణయం పట్ల ఏవైనా అభ్యంతరాలు వచ్చాయేమో తెలుసుకోవాలను కుంటున్నాను.


రాపోర్టర్‍, వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ:
ఎలాంటి సవరణలు అందలేదు. వియత్నాం, జాంబియా దేశాల మద్దతును నోట్‍ చేసుకున్నాం. అంగీకరించిన ఫాక్చువల్‍ ఎర్రర్స్ ను అవుట్‍ స్టాండింగ్‍ యూనివర్సల్‍ వాల్యూలో మిళితం చేసినట్లుగా ప్రకటించారు. థ్యాంక్‍ యూ.
ఛైర్‍ పర్సన్‍:
ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. ఈ ప్రాపర్టీని చేరుస్తున్నందుకు గాను యావత్‍ కమిటీ తరఫున భారత్‍కు నా అభినందనలు. ఈ విషయంలో ప్రకటన చేసేందుకు భారత ప్రతినిధికి నాలుగు నిమిషాల సమయం ఇస్తున్నాం. థ్యాంక్‍ యూ.
భారత్‍ ప్రతినిధి:
థ్యాంక్‍ యూ ఛైర్‍. పెద్దలకు, వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ ప్రతినిధులకు నమస్తే. 21వ తేదీన ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ సదస్సు సజావుగా సాగుతోంది. మీరంతా ఎన్నో గంటల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతినిధులంతా మా ఆతిథ్యాన్ని ఆనందిస్తున్నారని భావిస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మాకు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. భారత్‍ తన 43వ ప్రాపర్టీని వరల్డ్ హెరిటేజ్‍ జాబితాలోకి చేర్చగలిగింది. ఈ ప్రాచీన కట్టడాల తిరుగులేని సార్వత్రిక విలువను గుర్తించినందుకు, ప్రపంచ వారసత్వ జాబితాలోకి దాన్ని చేర్చేందుకు సహకరించినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున మరీ ముఖ్యంగా అస్సామీయుల తరఫున యునెస్కో, వరల్డ్ హెరిటేజ్‍ సెంటర్‍, ఐకోమస్‍లకు నా ధన్యవాదాలు.
ఐకోమస్‍ ప్రజంటేషన్‍ లో పేర్కొన్న విధంగా ఈ మొయిడామ్స్ 13 నుంచి 19వ శతాబ్ది కాలానికి చెందినవి. మొయిడామ్‍ అంటే ఆత్మకు నిలయం అని అర్థం. ఈ మొయిడామ్స్ అహోం సమూహం పాటించిన పవిత్ర ఆచార వ్యవహారాలకు నిదర్శనాలు. ఈ మొయిడామ్స్ నిర్మాణాల్లో ప్రకృతిని కూడా సమ్మిళితం చేశారు. వాటికి పక్కనే సరస్సులు నిర్మించారు. మొక్కలను పెంచారు. కాస్తంత ఎత్తుగా నిర్మితమైన ఈ కట్టడాలు నేలకు, స్వర్గానిక మధ్య బంగారు నిచ్చెనకు ప్రతీకలు.


ఆరో శతాబ్ది నాటి విశ్వాసాలకు ప్రత్యక్షంగా కనిపించే నిదర్శనాలు ఈ మొయిడామ్స్. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో అస్సాం నుంచి ఇప్పటికే రెండు చోటు చేసుకున్నాయి. ఇది మూడోది. సాంస్కృతిక విభాగంలో మాత్రం ఇదే మొదటిది. గతంలో 1985లో నమోదైన రెండు కూడా నేచురల్‍ కేటగిరీలో ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో వారసత్వ కట్టడాల విషయంలో భారతదేశ కట్టుబాటు అధికం అవుతోందనడానికి వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ 46వ సెషన్‍ భారతదేశంలో మొదటిసారిగా జరగడం కూడా ఓ నిదర్శనం. వరల్డ్ హెరిటేజ్‍ కన్వెన్షన్‍ ప్రాథమిక థీమ్‍ సంరక్షించడం, వేడుక చేసుకోవడం. వారసత్వం అనేది యావత్‍ మానవాళికి సంబంధించింది. వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. అది గతానికి, భవిష్యత్‍ కు మధ్య వారధి లాంటిది. ఆర్కియాలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా, అస్సాం ప్రభుత్వానికి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాన్ని కూడా నేను గుర్తు చేయదల్చుకున్నాను. మొయిడామ్స్ సంరక్షణలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలసి పని చేస్తున్నాయి. కొత్తగా దక్కిన ఈ గుర్తింపు భారత ప్రజానీకానికి ఓ అద్భుత బహుమతి. ఇది దక్కేలా కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు.

  • డాక్టర్‍ వంశీమోహన్‍ నర్ల,
    ఎ : 9848902520

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *